Pages

Wednesday, 26 March 2014

మన దేశపు విస్తీర్ణంలో ఇరవై శాతం ప్రాంతంలో గిరిజనులు నివసిస్తున్నారు. ఈ ఇరవై శాతం ప్రాంతంలోనే భారతదేశపు డెబ్బయ శాతం ప్రకృతి వనరులు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వనవాసీలు ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సేనలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. భీముడి భార్య, ఘటోత్కచునికి తల్లి అయిన హిడింబి ఒక గిరిజన యువతే! ఇంకా చెప్పాలంటే కృత యుగంవాల్మీకి మహర్షి కూడా వనవాసీయే...! వ్యవసాయం రూపకల్పనకు మూలపురుషులు ఈ గిరిజనులే! కొండ కోనలలో, లోయలలో గిరిజనులు వ్యవసాయం చేస్తున్నారు. అనాదిగా సంస్కృతి, సంస్కారం కలిగిన ఈ గిరిజనుల ఉనికి నేడు ప్రశ్నార్ధకమైంది.

కోయ, చెంచు, యానాది, ఎరుకల , సహోలియా, సంతాల్, భిల్లు, గోండు, సవర, కొండ సబర, జాతాపు, కొండరెడ్డి, కోలాం, మొదలైన 33 తెగలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే భారత రాజ్యాంగంలోని 342 అధికరణం కింద మొత్తం 533 తెగలు భారతదేశపు అన్ని రాష్ట్రాలలోను యూనియన్ టెరిటరీలలోను ఉన్నట్టు నమోదు కాబడి ఉంది. ఈ గిరిజనులు సహజంగా, నగర జీవనానికి దూరంగా, ఏకాంతంగా, కొండ కోనలలో లోయలలో, కీకారణ్యాలలో జీవనయానం సాగిస్తుంటారు. ఈ వనవాసీలు ప్రపంచం మొత్తం మీద సుమారు ఇరవై కోటు ల అనగా ఫ్రపంచ జనాభాలోనాలుగు శాతం మంది ఉన్నట్టు అంచనా! భారతదేశపు మొత్తం జనాభాలో 8.19 శాతానికి సమానమైన అనగా 8. .3 కోట్ల వనవాసీలున్నారు. 1951వ సంవత్సరంనుండి ఈ జనాభా క్రమక్రమం పెరుగుతూ వచ్చింది. భారతదేశపు మొత్తం జనాభాలో సెక్సురేషియో 927 ఉంటే గిరిజనులలో 972 ఉంది (అనగా 1000మంది పురుషులకు 972 మంది మహిళలు అన్నమాట)
శతాబ్దాల తరబడి ఆహారం, నిలువ నీడ, ఇంధనాల కోసం అరణ్యాలతో అనుబంధం కలిగి అరణ్యాలలో జీవిస్తున్నారు. ఈ ఆడవిపుత్రులు, భారతీయ జీవన వ్యవస్థల పెంపుదలకు పూల పురుషులు, కానీ ఈ వనవాసీలు క్రమపద్ధతిలో అణగదొక్కబడుతూ వచ్చారు. వీరి సంపదపై ఆధిపత్యాన్ని కోల్పోయారు. 1952వసంవత్సరం నాటి అటవీ విధానం వలన వనవాసీల హక్కులు పూర్తిగా నేలకు రాయబడ్డాయి. అందుకు కారణం వీరి నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు!

జన జీవనానికి దూరంగా బతకడం, అమాయకత్వం, పేదరికం, ఫలితంగా దోపిడీకి గురవుతున్నారు. 2001 సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సాక్షరత 64.84 శాతం ఉంటే వనవాసీలలో 47.10 శాతం ఉంది. అలాగే మహిళలలో 53.67 శాతం ఉంటే వనవాసీ మహిళలలో 34.76 శాతం ఉంది! అలాగే అనేక పథకాల ద్వారా గిరిజనులకు వైద్య, ఆరోగ్య సేవలు మెరుగుపడుతున్నాయి. అందువలన కొంత మేరకు వైద్య ఆరోగ్య సేవలు గిరిజనులకు మెరుగైనట్టే భావించాం. వనవాసీలు అధికంగా వ్యవసాయ కూలీలుగా లేదా పారిశ్రామిక కూలీలుగా జీవనయానం సాగిస్తున్నారు. సగానికి పైగా గ్రామీణ గిరిజనులు దారిద్య్ర రేఖకు దిగువనే జీవనం గడుపుతున్నారు. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56నుంచి గిరిజనుల అభివృద్ధికి ప్రణాళికలను భారత ప్రభుత్వం రూపొందించం మొదలుపెట్టింది. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956-61నుంచి సామజిక, ఆర్థిక పరిస్థితుల అభివృద్ధికి అంకురార్పణ చేసింది. ఎంపిక కాబడిన గిరిజన ప్రాంతాలలో బహుళార్ధక సాధక గిరిజన పథకాలు ప్రవేశఫెట్టడం జరిగింది. 1961-66 మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ‘ట్రైబల్ డెవలప్‌మెంట్ బ్లాకు సిస్టం’ను అమలుచేయడం జరిగింది. నాల్గవ పంచవర్ష ప్రణాళిక 1969-74లో 498 ట్రైబల్ డెవలప్‌మెంట్ బ్లాకులు ఏర్పడ్డాయి. ఫలితంగా గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతున్నది.

ఇదే కాకుండా అనేక నూతన పథకాల రూపకల్పన జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక 1974-79 కాలంలో గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం కోసం ట్రైబల్ సబ్ ప్లాన్ (టిఎస్‌సి)లకు నూతన వ్యూహంతో పునాదులేర్పడ్డాయి. 6వ పంచవర్ష ప్రణాళిక 1980-85 కాలంలో ఇంతకుముందు అభివృద్ధికి రాకుండా మరుగున పడిపోయిన గిరిజన ప్రాంతాలకోసం ‘మోడిఫైడ్ ఏరియా డెవలప్‌మెంట్ అప్రోచ్’ (యంఏడిఎ) అనెడి సమగ్రాభివృద్ధి పథకాన్ని టిఎస్‌సి కింద రూపొందించారు. 7వ పంచవర్ష ప్రణాళిక 1985-90 కాలంలో దారిద్య్ర రేఖకు దిగువన వున్న 40 లక్షల గిరిజన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలనేది లక్ష్యమైంది. 1987-88 ఆర్ధిక సంవత్సరంలో 3 కోట్ల, 13 లక్షల 21వేల గిరిజనుల సంక్షేమం కోసం 184 సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు పనిచేయడం మొదలయ్యాయి. భారత రాజ్యాంగ నిర్మాతలకు గిరిజనుల సమస్యలపై మంచి అవగాహన ఉంది. అందుకనే వారి సంక్షేమం కోసం అభివృద్ధికోసం ప్రత్యేక అవకాశాలను రాజ్యాంగంలో పొందుపరిచాయి.

భారతరాజ్యాంగం 330, 332, 334 అధికరణాల కింద లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో గిరిజనులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించబడింది. అలాగే 164 , 338 అధికరణల కింద రాష్ట్రాలలోను, జాతీయ కమిషన్‌లోను గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రభుత్వ శాఖలను ఏర్పరచడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. 224 అధికరణ, 5,6 షెడ్యూల్ కింద ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్‌లు ప రిపాలన, నియంత్రణలకు ప్రత్యేక అవకాశం, వాటికయ్యే ఖర్చును భరించడానికి 275)1) అధికరణ కింద రాజ్యాంగం అవకాశాన్ని కల్పించింది. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అత్యున్నత వ్యవస్థగా వ్యవహరిస్తోంది. ఇన్నిరకాలుగా ప్రభుత్వం చొరచూపి, గిరిజనులకు సంక్షేమం, అభివృద్ధికోసం చట్టాలు చేస్తున్నా, పథకాలకు రూపకల్పన చేస్తున్నా కూడా అమలులో చిత్తశుద్ధి లేకపోవడంవలన వాటి తీపి ఫలాలు గిరిజనులకు అందడంలేదంటే అతిశయోక్తి లేదు ఇప్పుడు గిరిజనేతరులు, వడ్డీవ్యాపారులు, మద్యం వ్యాపారు లకబంధ హస్తాలనుండి గిరిజనులకు విముక్తి లభించడం దుర్లభమవుతున్నది. అందుకుగాను ప్రభుత్వం చొరవ చూపి గిరిజనుల రుణాలను మొత్తం మాఫీ చేయాలి. గిరిజన ఉత్పత్తులకు లాభదాయకమైన మార్కెట్ సౌకర్యం కల్పించాలి. నిరక్షరాస్యత, మూఢనమ్మకాలను పారదోలాలి. వారికి రక్షితనీటి సౌకర్యం, పౌష్టికాహార సరఫరా, నీటి పారుదల సౌకర్యం, జల పరీవాహక పథకాల ఏర్పాటు జరగాలి. గిరిజనులవంటి నిష్కలంక మిత్రులు ప్రపంచంలో మరొకరుండరు. అట్టివారి సంక్షేమం అభివృద్ధికోసం ప్రభుత్వమే కాదు సభ్యసమాజం అంతా దీక్ష బూని పాటుపడాలి. చట్టాలు చేస్తే సరిపోదు, చిత్తశుద్ధితో అమలుపరచాలి.



NewsListandDetails
విధ్వంసకర బాక్సైట్‌ తవ్వకాన్ని వ్యతిరేకిద్దాం
''ప్రకృతి సిద్ధమైన వాతావరణాన్ని అడవులు, చెరు వులు, నదులు, వన్యమృగ జీవనాన్ని కాపాడటా నికి పెంపొందించటానికి అలాగే జీవ జంతుజా లంపట్ల కనికరం,ప్రేమ చూపాలని ప్రజలు జీవిం చటానికి వారికి కావలసిన వసతులు పొందటానికి రక్షణలు కల్పించాలని భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు తెలియచేస్తున్నవి. కానీ అభివృద్ధి ముసుగులో రాష్ట్రంలో జీవన విధ్వంసం జరుగుతోంది. ఒకపక్క ఆదివాసీ లను అడవికి దూరం చేయవద్దని బాక్సైట్‌ తవ్వొద్దని కేంద్ర సాధికారిత కమిటీ పర్యటనకు నిరసనగా ఏజెన్సీ బంద్‌కు పిలు పిస్తే కమిటీ మాత్రం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేసి వెళ్లింది. ప్రజావాక్యం వీరికవసరం లేదా!
  విశాఖపట్నం జిల్లాలో 60.293 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్డ్‌ ఏరియా ప్రాంతంలో 6 లక్షల జనాభాగల ఆదివాసీలు 7 తెగలుగా 11 మండలాలలో నివసిస్తున్నారు. మొత్తం విశాఖ మన్యంలో (చింతపల్లి, జెర్రెల, గుర్తేడు, అనంతగిరి ప్రాంతంలో) జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 8 వేల హెక్టార్లలో 700 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బాక్సైట్‌ నిక్షేపాలు ఉన్నాయి.  ఈ నిక్షేపాలను తవ్వి జిందాల్‌, అన్‌రాక్‌, ఆల్‌ఖైమ కంపెనీలకు కట్టబెట్టాలని ప్రభుత్వం ఎ.పి.ఎన్‌.పి.డి.సి. ముసు గులో దొంగనాటకాలాడుతోంది. ఈ బాక్సైట్‌ తవ్వకాలు ప్రక్రియ ఇపుడు మొదలైంది కాదు. 1890లోనే బ్రిటిష్‌ పాలకులు మొద టిసారిగా ప్రయత్నం చేశారు. ఒకవైపు సర్వేలు ముమ్మరం చేసి మరోవైపు రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారు. కాని ఆదివాసీలు ప్రతిఘటించడంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు. 1970లో భారత ప్రభుత్వం రష్యాతో సర్వే చేయించింది. రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేసింది కాని, అప్పటి శ్రీకాకుళం పోరాట ఉధృతికి పాలకులు వెనక్కుతగ్గారు. తదనంతరం తెలుగుదేశం ప్రభు త్వం ప్రయత్నాలు జరిపితే 2005 సంవత్సరంలో కాంగ్రెస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి ఒప్పందమే కుదు ర్చుకుంది. దాని ఫలితమే వాకపల్లి, బల్లుగూడ అత్యాచారాలు.
   ఈ తవ్వకాల వల్ల జరిగే విధ్వంసంతో విశాఖ ఏజెన్సీలోని గూడెం కొత్తవీధి,చింతపల్లి, కొయ్యూరు,అరకు, అనంతగిరి మం డలాలు పూర్తిగా కనుమరుగవుతాయి. 274 గూడేలలో 45 వేల మంది అడవిపై ఆధారపడి జీవించే ఆదివాసీలు మనుగడ కోల్పో తారు, సంస్కృతి సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ వారి జీవనాధా రం కనుక పసుపు, అలసంద, సోళ్ళు, చిక్కుళ్లు వంటి పంటలు, చింతపండు, పనస, కుంకుడు, ఉసిరి, శికాయి, కొండచీపురు, అడ్డాకులు వంటి 29 రకాల అటవీ ఉత్పత్తులు అదృశ్యమవు తాయి. ఈ బాక్సైట్‌ శుద్ధి కర్మాగారాల వలన ఇంకా ఎక్కువగా ముప్పు ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతు న్నారు.శుద్ధివలన సల్ఫర్‌డై ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ విషవాయువులు వెలువడు తాయి. బాక్జైట్‌ నుండి అల్యుమినియం తీశాక మిగిలిన ఎర్రమట్టి (బాక్సైట్‌ రిసెడ్యుస్లరి) దుమ్ము మరింత ప్రమాదకరం, అది సమీప చెట్లపై పడి చెట్టు నాశనం అయి అడవి అంతరిస్తుంది. దానినుండి వచ్చే ఎర్ర బురద కలుషిత నీరు నేలలో కలిసి జీవ రాశి, పంటపొలాలు నాశనం అవుతాయి. ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయి. పండే పంటల్లో అల్యుమినియం ఫ్లోరైడ్‌ శాతం పెరిగిపోతుంది. విశాఖ జిల్లాలో పండే 30 రకాల పంటలకు సుమారు 15 వేల మందికి ఆధారంగా చూపుతున్న కాఫీ తోట లకు 30 వేల మందికి ఆధారంగా ఉన్న పిప్పళ్ల పంటలకు కాలం చెల్లినట్లే అని చెప్పవచ్చు.
  అంతేగాక తూర్పు కనుమల నుంచి ప్రవహించే నదులు వాటిపై నిర్మించిన ప్రాజెక్టులు నిర్వీర్యమైపోతాయి అని అధ్య యనాలు వెల్లడిస్తున్నాయి. అడవులలో తవ్వకాలు చేపడితే నదు లకు ఎలా ముప్పు ఏర్పడుతుందనే సందిగ్ధం రావచ్చు! ఈ బాక్సైట్‌లోని స్పాంజ్‌ గుణమే (శ్రీకాకుళం) జిల్లాలోని వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా, విశాఖపట్నం జిల్లాలోని శారద, వరహా తాండవ, మచ్‌ఖండ్‌, గోస్తని (విజయనగరం), గౌతమి, నాగావళి, చంపావతి, వేదవతి, గోముఖి, సువర్ణ ముఖి, తూర్పు గోదావరి జిల్లాలోని తాండవ, పంప, ఏలేరు నదులను, వీటిపై కట్టిన ఏలేరు, తాండవ, పంపా, రైవాడ, సూరపాలెం, కళ్యాణలోవ,మేఘాద్రి, గంభీరం, కోనాం, రావిపా లెం, తాబేరు, రంగబోలు, డెంకాడు, ఆంధ్ర, తాటిపూడి, వేగాతి, సీతానగరం, పెద అంకలం ఆనకట్టలను రిజర్వాయర్‌ బతికిస్తుంది. బాక్సైట్‌ భూమిలో ఉన్నంతకాలం దాని ప్రభావం నీరు,పర్యావరణంపై పడదు. వెలికితీయడం మొదలైతే బాక్సైట్‌ లోని రసాయనాలు భూమి, నీరు, అడవిని కలుషితం చేస్తాయి. రసాయనాల ఫలితంగా నీరు భూమిలో ఇంకిపోకుండా ఆవిరిగా మారుతుంది. భూగర్భ జలాలు క్షీణిస్తాయి. తవ్వకాలు జరిగిన ఒడిశాలోని దామన్‌జోడిలో ఇలాంటి పరిస్థితి ఉందని పరిశోద µకులు అంటున్నారు. ఢిల్లీకి చెందిన ది ఎనర్జిస్‌ రిసోర్స్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ ఫలితాలపై అధ్యయనం చేసి విశాఖ ఏజె న్సీలో ఒక్క అనంతగిరి ప్రాంతంలోనే 1500 కోట్ల విలువైన పర్యావరణ సంపద పోతుందని స్పష్టం చేసింది. పూనేకు చెం దిన కులవృక్ష పర్యావరణసంస్థ 2004లో సర్వే జరిపి ఏలేరు, తాండవ, శారద నదులకు కాలం చెల్లినట్లే అని పేర్కొంది.
   అదేవిధంగా ఈ తవ్వకాలతో వన్యప్రాణులు, వృక్ష, జంతు జీవరాశులు కూడా అంతరిస్తాయి అని చెప్పవచ్చు. తూర్పు కను మలలోని 1400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అడవుల్లో రకరకాల వన్యప్రాణులు, వృక్షసంపద ఉంది. పెద్ద పులులు, అడవి దున్నలు, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, రాస ఉడుత, కొండ ఎలుక, నెమళ్లు, అరుదైన గుడ్లగూబలు ఈ ప్రాం తంలో ఉన్నాయి. ఇక ఔషధ వృక్షాలకు కల్పతరు ఈ ప్రాంతం, ఇవేకాక 10వేల భారీ వృక్షాలు నేలకూలుతాయని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.అంతేకాదు 90 రకాల వన్యప్రాణులు కనుమరుగవుతాయి. ఇప్పటికీ తూర్పు కనుమల్లో 11 రకాల పక్షులు, 54 రకాల తోకపిట్టలు, 10 రకాల వార్‌బర్డ్స్‌, 7 రకాల గుడ్లగూబలు మాయమవుతాయి. 30 ఏళ్ల క్రితం 160 రకాల పక్షులు 54 రకాల వలసజీవులు ఉండేవని, ప్రస్తుతం 100 దేశీయ రకాలు మాత్రమే ఉన్నాయని 'నేచర్‌ హిస్టరీ సొసైటీ ప్రకటించింది. తవ్వకాల మూలంగా అడవి దున్నలు, అడవి ఆవులు,కణుజులు,చుక్కల దుప్పులు, కొండ గొర్రెలు, మాను పిల్లులు, పులులు కనుమరుగు అవుతాయని స్వయాన విశాఖ రీజియన్‌ అటవీశాఖ స్పష్టం చేసింది.ఇప్పటికే అటవీ ప్రాంతంలో తేమ తగ్గి మానుపిల్లులు, డెక్కల పిల్లులు, అడవికోళ్ళు, నెమలి కోళ్లు, కొండ గొర్రెలు, కత్తెర పిల్లులు మాయమైపోయాయి.
  ఇంత పెనుముప్పు సంభవిస్తున్నా పాలకులు ఈ తవ్వకాలు ఎందుకు చేపట్టవలసి వస్తుంది అనేది చూస్తే, ఈ బాక్సైట్‌తో రిఫైనరీ ప్లాంట్‌లో శుద్ధిచేస్తే అల్యూమినియం అనే ముడిపదార్ధం పౌడర్‌ రూపంలో వస్తుంది. అది స్మెల్టర్లలో కడ్డీలుగా, రేకులుగా ఉండే లోహంగా తయారవుతుంది. ఈ లోహాన్ని అల్యూమిని యం అంటారు. ఈ అల్యూమినియం విమాన తయారీకి ఉప యోగిస్తారు. అయిన మనదేశ అవసరాలకు సరిపడే అల్యూమిని యం,నాల్కో, బల్క్‌, హిందాల్కో కంపెనీలు తయారుచేస్తు న్నవి. ఇప్పుడు కొత్తగా తీయాల్సిన అవసరం, అగత్యం ఏమీ లేదు, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి ఉపయోగపడే వనరులను ఏ దేశంలో ఉన్నా మారుమూల ప్రాంతంలో ఉన్నా తన్నుకుపోవాలనే సంకల్పం సామ్రాజ్యవాద దేశాలది. ఇటువంటి సామ్రాజ్యవాదులకు మన పాలకులు మన ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవలసిన విష యం. ఇక్కడ బాక్సైట్‌ తవ్వటానికి ఆదివాసీలకు ప్రభుత్వం పున రావాసం,ఉద్యోగకల్పన భ్రమలు కల్పిస్తోంది.బాక్సైట్‌ భూములు కోల్పోయిన ఆదివాసీలకు భూములు ఇప్పిస్తామని బొంకుతోంది. పెద్ద మొత్తంలో నిర్వాసితులు అయ్యే ఆదివాసీలకు ప్రభుత్వం భూమి ఎక్కడి నుండి ఇస్తుంది? ప్రధానంగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ ప్రభావిత ప్రాంతంలో అమ్మాయిలను ప్యాషన్‌ డిజైన్‌ పేరుతో పట్టణ ప్రాంతాలకు పంపుతున్నారు. వారిలో కొంత మంది ఏమయిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి. గ్రామాల లోని యువకులను మావోయిస్టు ముద్రవేసి వందలాది మందిని జైళ్లకు పంపుతున్నారు.  
  ఈ తవ్వకాలు పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్ప వచ్చు. 1996 పంచాయితీరాజ్‌ (షెడ్యూల్డు ప్రాంతాల విస్తరణ) చట్టం ప్రకారం గ్రామసభల అనుమతులు పొందిన తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కాని తుపాకి నీడన భయానక వాతావరణంలో జరుగుతున్నవి. 1997లో సుప్రీంకోర్టు సమత వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో ఇచ్చిన చారిత్రకమైన తీర్పును పరిశీలిస్తే షెడ్యూల్డు ఏరియాలో ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరునిగానే పరిగణించాలని పేర్కొంది. వాస్తవంగా ఈ తవ్వకాలను జరిపే అధికారం ప్రభుత్వానికి లేదు. అయినప్పటికీ కోట్ల రూపాయల కోసం పాకులాడుతోంది. 1/70 చట్టం ప్రచా రంలోకి వచ్చిన షెడ్యూల్డు ప్రాంత భూ బదిలీ నియంత్రణ చట్టం 1959 సవరణను, అడవి హక్కుల చట్టం 2006 (పార్లమెంటు)ను ఉల్లంఘిస్తోంది. ఈ విధంగా ప్రాజెక్టుల, గనుల పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన దశాబ్దకాలంలో పాలకులు 87 రకాల ఆదివాసీ తెగలు అంతరించిపోవటానికి కారణమ య్యారు.ఇదేవిధంగా కొనసాగితే అడవులు అంతరించి మన్యంలో ఆదివాసీతెగలు కూడా పూర్తిగా అంతరించటం ఖాయం. ఈ తవ్వకాలవలన కేవలం ఆదివాసి సమాజానికి కాదు ఆదివాసేతర సమాజం పర్యావరణ,జంతు, జీవజాలం, నీటి వనరులకు కూడా ముప్పు ఏర్పడనున్నాయి. యావత్‌ ప్రజానీకం ప్రజల రక్షణకు ప్రజాస్వామ్య రక్షణకు ఆదివాసీల పోరాటం చేయ వలసిన అవసరం నేడు ముందున్న కర్తవ్యం.
Internet dept
Source: http://www.vaartha.com/NewsListandDetails.aspx?hid=1126&cid=1033

Related News