Tuesday, September 10, 2013
విద్యార్థుల సంక్షేమం మరుస్తున్న సర్కార్
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లల్లో దుర్భర పరిస్థితులపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల కింద కేసు నమోదు చేసింది. దీంతో ఈ సమస్య తెర మీదకు వచ్చింది. రెండేళ్లుగా ఈ పరిస్థితులపై అనేకసార్లు ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమశాఖ మంత్రికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేదు. పెరిగిన ధరల ప్రకారం మెస్‌చార్జీలు పెంచాలని, హాస్టళ్లల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనితో హాస్టల్ విద్యార్థుల సంక్షేమం- సంక్షోభాల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే హాస్టళ్లల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదు. హాస్టళ్లల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోతే విద్యార్థులు వెళ్ళిపోతారు. విద్యార్థుల సంఖ్య తగ్గితే విద్యార్థులు లేరనే సాకుతో మూసివేయవచ్చుననే కుట్ర దాగి ఉంది. అయితే హైకోర్టు జోక్యంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచేనా?
రాష్ట్రంలో 1422 హాస్టళ్లల్లో 1, 75,000 మంది విద్యార్థులు ఉన్నారు. 235 ఎస్సీ హాస్టళ్లల్లో 2,26,000 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 442 గిరిజన హాస్టళ్లల్లో 77 వేల మంది విద్యార్థులు, 599 గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టళ్లల్లో 1, 41,000 వేల మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించబడింది. ఇవి గాక ఆనంద నిలయాలు, డిఎన్‌టీ హాస్టళ్లు మరో 120 వరకు ఉంటాయి. బీసీ హాస్టళ్ల నిర్వహణకు ఏడాదికి 314 కోట్లు, ఎస్సీ హాస్టళ్ల నిర్వహణకు 502 కోట్లు, ఎస్టీ హాస్టళ్ల నిర్వహణకు 464 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ హాస్టళ్ళ విద్యార్థులకు ఆహారపు చార్జీలకు గాను మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వారికి నెలకు 475 రూపాయలు, నుంచి 10వ తరగతి విద్యార్థులకు 535 రూపాయలు చెల్లిస్తున్నారు. వీటిని 200 మార్చి లో పెంచారు. దాదాపు నాలుగేళ్లు గడుస్తున్న ఇంతవరకు పెంచలేదు. ఈ మొత్తంలో విద్యార్థులకు మూడు పూటల భోజనం పెట్టాలి. నుంచి 10వ తరగతి విద్యార్థులకు రోజుకు ఒక్కొక్క విద్యార్థికి సగటున రూ. 17.3లు వస్తాయి. పూటకు రూ. 5.90 పైసలు వస్తాయి. అలాగే 3 నుంచి7 తరగతి చదివే విద్యార్థులకు రోజు రూ.15.0 వస్తాయి. పూటకు రూ. 5-25 పైసలు వస్తాయి. ఇంత తక్కువ మొత్తంతో హోటల్‌లో టిఫిన్ కూడా రాదు. మరి ఎదిగే విద్యార్థులకు ఇంత తక్కువ మొత్తంలో షోషక పదార్థాలు గల ఆహారం ఎలా పెడుతారు.
నాసిరకం ఆహారం పెట్టడానికి పెరిగిన ధరల ప్రకారం ‘మెస్ చార్జీలు’ పెంచకపోవడమే ప్రధాన కారణం. ఒకవైపు ధరలు పెరిగిపోతున్నాయి. ఏలిన వారి పుణ్యమా అని పెరుగుతున్న ధరలకనుగుణంగా మెస్‌చార్జీలను పెంచకపోవడంతో హాస్ట ల్ విద్యార్థులకు నాసిరకం ఆహారంతోనే రోజులు వెళ్లదీస్తున్నారు. చాలీచాలనీ నాసిరకం ఆహారంతో అనారోగ్యానికి గురయితే పట్టించుకునే నాథుడే లేడు. బందెల దొడ్డి మాదిరిగా ఉన్న కిక్కిరిసిన హాస్టళ్ల వల్ల విద్యార్థుల జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. రాష్ట్రంలోని 450 ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో నివసించే దాదాపు పదిలక్షల మంది విద్యార్థుల సంక్షేమం- సంక్షోభాల మయం అయ్యింది. నల్గొండ, మెదక్, రంగాడ్డి, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ నిజామాబాద్, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, గుంటూరు, ప్రకా శం, జిల్లాల్లోని కొన్ని హాస్టళ్లను సందర్శించిన తర్వాత అక్కడ విద్యార్థులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
హాస్టల్ విద్యార్థుల మీద పెట్టే బడ్జెట్‌ను ‘వ్యయం’ కోణంలో చూడరాదు. మాన వ వనరుల అభివృద్ధి కోణంలో చూడాలి. మంచి భోజనం పెట్టి, మంచి విద్యా ప్రమాణాలతో చదువు చెబితే రేపు దేశానికి ఉపయోగపడే శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పరిపాలకులు, సంఘ సంస్కర్తలు, రాజకీయ నాయకులు తయారవుతారు. లేకపోతే జీవితంలో విసిగిపోయి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకొని దేశభక్తి- జాతీయత లోపించి సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రమాదముంది. దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే అవుతుంది. ప్రభుత్వం సామాజిక బాధ్యతతో ప్రతి మనిషి శక్తి యుక్తులను మానవ ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలి. ఈ అంకితభావంతో చూసినప్పుడే హాస్టల్ విద్యార్థుల జీవితాలు బాగుపడుతాయి. అప్పుడే వారు సమాజ ప్రగతికి, దేశాభివృద్ధికి ఉపయోగపడతారు. దళితులు, బీసీలు ఆదివాసులు అనే నిర్లక్ష్య భావనతో చూస్తూ ఏదో మొక్కుబడిగా చేస్తే సమాజ ప్రగతికి వీరు ఆటంకంగా తయారవుతారు.
ప్రస్తుతం హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న మెస్‌చార్జీలు పెరుగుతున్న ధరల ప్రకారం పెంచడంలేదు. ఆహార వస్తువుల ధరలు 200 నుంచి 2011 వరకు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. పప్పు రూ. 30 నుంచి 75 లకు, మంచినూనె రూ. 35 నుంచి 0 లకు, కూరగాయలు సగటున 5 నుంచి 20 రూపాయలు ఇలా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. విద్యార్థులకు మంజూరవుతున్న మెస్‌చార్జీలు సరిపోవడం లేదు. దీంతో అధికారులు విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారు. శాసనసభ్యులు, మంత్రుల జీతాలను రెట్టింపు చేయడానికి (ఒక లక్ష నుంచి 2 లక్షలకు పెంచడానికి) నిర్ణయం తీసుకున్న ముఖ్యమంవూతికి హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు వినిపించడం లేదా! పెంచాలనే కనీస ఆలోచన రావడంలేదా? శాసనసభ్యులు- మంత్రు ల మీద ఉన్న శ్రద్ధ 10 లక్షల మంది విద్యార్థుల అర్థాకలి తీర్చడంపై లేదా?
హాస్టళ్ళలోని వసతులు మెరుగుపర్చాలంటే యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని వసతులతో సొంత భవనాలు నిర్మించాలి. అలాగే విద్యార్థులలో జనరల్ నాలెడ్జీ పెంచడానికి దినపవూతికలు, మాస పత్రికలు తేవడం లేదు. ఒక ప్రత్యేక రీడింగ్ రూం లేదు. హాస్టళ్ళల్లో టీవీలు ఏర్పాటు చేయాలని, ఆడియో, వీడియో పాఠాలు కూడా చెప్పించవలసిన ఆవశ్యకత ఉందని అనేక కమిటీలు సిఫారుసులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక ఆహార విషయంలో హాస్టల్ విద్యార్థులు పంచభక్ష పరమన్నాలు కోరడం లేదు. రోజు మాంసాహారం అడగటం లేదు. కేవలం నాణ్యమైన భోజనం పెట్టమని మాత్రమే కోరుతున్నారు. ‘పోషక పదార్థాల సంస్థ’ వారు రెకమండ్ చేసిన పట్టిక ప్రకారం ఆహారం ఇస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఉన్నట్లు ఫిక్స్‌డ్‌రేట్లు నిర్ణయించడం సరియైన పద్ధతి కాదు. ధరలు పెరిగినప్పుడల్లా మెస్ చార్జీలను పెంచాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అ విధంగా కాకుండా ‘ఆహారపు పట్టిక’ ను ఏర్పరచి దాని ప్రకారం ఎంత బిల్లు వస్తే అంత మొత్తాన్ని మంజూరు చేసే విధంగా ప్రభుత్వ విధానాన్ని మార్చాలి. కనుక ప్రభుత్వం సంక్షేమం అనే మాట మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తే విద్యార్థులకు మేలు చేసిన వారవుతారు.

- ఆర్. కృష్ణయ్య
ఆంధ్రవూపదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల్డు

No comments:
Post a Comment