పుట్టెడు
సవాళ్ళల్లో- పునాదివిధ్య
బుద్దారం రమేష్
కౌన్సిల్ పర్ సొషల్ డెవలప్ మెంట్
హైదరాబాద్
“నిరక్షరాస్యత
మన దేశానికి తలవంపులు తెస్తున్న కళంకం. దీనిని వెంటనే నిర్మూలించి తీరాలి'' జాతిపిత గాంధీజీ ఆవేదన. అక్షరాస్యతే అభివృద్ధి,
అభివృద్ధికి పునాది అక్షరాస్యతే, అందుకే ప్రాథమిక విద్య అందరికీ అందాలి, పట్టిష్టమైన
ప్రాథమిక విద్య పునాదిపైనే సమాజ, దేశాభివృద్ధి రూపుదిద్దుకొంటుంది ఇది అమర్త్యసేన్
అభిప్రాయం. ఆరు దశాబ్దాల స్వతంత్ర పాలనలో భారత్
''అక్షర భారత్‌గా” ఎదగలేక సాక్షర పోరాటం చేస్తూనే వుంది. ప్రాథమిక విద్య వ్యక్తి ప్రగతికే కాదు, మొత్తం జాతి నిర్మాణానికి , పురోగతికి పునాది వంటిది. భారతదెశంలో 14 ఏళ్ళ వయస్సు వరకు బాలలందరికి ఉచిత నిర్బంధ విద్య కల్పిస్తామన్నది రాజ్యాంగ పరమైన హామీ. ఈ ప్రయాణంలో విద్యాభివృద్దికి, ముఖ్యంగా ప్రాథమిక విద్యనందించెందుకు అనేక అనేక పథకాలు, పాలసీలు,కమిటిలు, కమిషలు ఏర్పాటు చేయబడ్డాయి. అయినప్పటికి పూర్థి స్థాయి అక్షరాస్యత సాధన జరగలేకపోయింది. ఈ
పరంపరలో సార్వత్రిక సంపుర్ణ విధ్య అనే నినాదంతో
6-14 ఏళ్ళ వయసు పిల్లలందరికి, విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ భారత పార్లమెంటు ఇటీవలే విద్యా హక్కు చట్టాన్ని ఆమోదించింది. దేశంలోని అన్ని ప్రాంతల్లో విద్యా వసతులు కల్పించడం, ప్రాథమిక విద్య నేర్చుకునే వయసున్న బాలబాలికలను నూటికి నూరు శాతం పాఠశాలలలో చేర్చుకోవడం, అందరూ కొనసాగేలా చూడడం లక్షంగా
నడుంబిగించింది. ఐనప్పటికి ఏదోలొపం. భారత బాలబాలికల్ని అత్యంత
మేధసంపన్నం చెయాల్సిన కీలకమైన ప్రాథమిక దశ అనేక సమస్యల చట్రంలొ బంది అయి కూర్చుంది. బావి భారత పౌరుల భవితవ్యం అందంగా తీర్చిదిద్ది భవిషత్తుకు బాటలు వెయాల్సిన తరుణంలొ అనెక అడ్డంకులు అవరోదాల్ని ఎదుర్కొవాల్సి వస్తుంది.
స్వాతంత్ర్యనంతరం పాఠశాలల్లో మౌలిక సదుపాయల
కల్పనకు పూర్థి స్థాయి కృషి చెసింది చాల తక్కువంటె అతిశయోక్తికాదేమొ. ఇప్పటికి కూడా
రాష్త్రంలోని ఎక్కువ శాతం పాఠశాలలు తరగతి గదులు,
త్రాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరిగోడ, బెంచిలు, బల్లలు లాంటి కనీస సౌకర్యాల లేమితోలేకుండా,
మరికొన్ని ఉపాధ్యాయులు లేక వెలవెల పొతున్నాయి. మనరాష్ట్రం నమూనా విద్యాహక్కు చట్టాన్ని
అన్ని రాష్ట్రాలకన్నా ముందుగానే ప్రకటించింది. 2013 ఎప్రిల్ నెలకల్ల రాష్ఠ్రంలొని అన్ని
పాఠశాలల్లో మౌలిక సదుపాయలు కల్పిస్తామని
హామి ఇచ్చారు. మౌలికసదుపాయాల కొరత మూలంగా ముఖ్యంగా టాయిలెట్లు లేకపొవడం ప్రధాన కారణంగా బాలికల డ్రాప్-అవుట్ రేట్
అధికంగా ఉంటుందని అద్యయనాలు చెప్తునాయి. విద్యార్థి
ఉపాధ్యాయ నిష్పత్తి, కూడా సరిపడ నిష్పత్తిలో ఉండటం లేదని చాల చొట్ల విద్యా వాలంటీర్ల ద్వారానే బోధన జరుగుతుందని
అలాంటప్పుడు విద్యలో నాణ్యత ఎలా ఉంటుందనే సందేహాలు వెలివెత్తుతున్నాయి. డైస్ నివేదిక ప్రకారం
2010-11లో రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 4,76,565. వీరిలో ప్రాథమిక
పాఠశాలల్లో 1,74,079 మంది; ప్రాథమికోన్నత పాఠశాలల్లో 93,003 మంది; ఉన్నత పాఠశాలల్లో
2,05,179 మంది పని చేయగా మిగిలిన 4,304 మంది ఉపాధ్యాయులు మాధ్యమికోన్నత పాఠశాలలో
పనిచేస్తున్నారు. ఈ సంఖ్య పెరుగుతున్న జనభా అవసరాలకు తగ్గట్టు పెంచాల్సిన అవసరం ఉంది.
పిల్లల్లో సృజనాత్మక శక్తిగానీ, విశ్లేషణాత్మక
నైపుణ్యం గానీ, అవగాహనా
సామర్థ్యం అక్కడ
అమలయ్యే భాషా మాధ్యమంపైనే ఆధారపడి ఉంటుందనేది నిర్వివాదాంశం. ప్రాథమిక విద్య దశలో పిల్లలకు
ఉపాధ్యాయుడు చెప్పే విషయం సంపూర్ణంగా అర్థమయితేనే వారికి సందేహాలు వస్తాయి. ఆ సందేహాల్ని
తీర్చుకోవడానికి ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నే వారి ప్రగతికి మూలం అవుతుంది. కాబట్టి
ఆ స్థాయిలో చదువు మాతృ భాషలో ఉండాలి. ఇది ప్రత్యేకంగా అదివాసి విద్యార్థుల పట్ల అడ్దంకిగా
మారింది. ఆదివాసులు విద్య పట్ల మొగ్గు చూపకపొవడానికి భాష అత్యంత అవరొధ కంగా ఉందని చాల అధ్యయనాలు తెలియపరిచాయి. మాతృ బాషలోవిద్యబొధన జరగాలని స్వతంత్ర్యానికి పూర్వం హంటర్ కమిటి,
అలాగె
కొఠారి
కమిటి,
భారత రాజ్యంగంలోని ప్రకరణ 350(ఎ) సూచించాయి, ఈ నేపథ్యంలో ఈ దిశగా దేశంలోనె మొదటి సారిగ ప్రయోగాత్మకంగ ఆంధ్ర ప్రదేశ్ లో
బంజార,
సవర,
గోండి,
కువి,
కోయ,
కొలమి,
కొండ,
మొదలగు గిరిజన బాషలలొ పాఠ్య పుస్తకాల ప్రచురణ జరిగింది. “బంజార
భారతి” పేరుతో వాలంటీర్ల నియమకం కూడా చేపట్టారు. కాని వాటిచె పాఠాలు భోధించిన దాఖలాలు తక్కువనె చెప్పాలి. లక్షలాది రుపాయలు వెచ్చించి ముద్రించిన పుస్తకాలు అటకెక్కికుర్చున్నాయి. ఆ ప్రయత్నం అరంభ శూరత్వంగానే మిగిలిపోయింది.
విద్యార్థికి సరైన విద్యనందించి ఒక సత్ప్రవర్థన కలిగిన పౌరున్ని తయరు చేయల్సినభాద్యత ముమ్మాటికి గురువులదే. అయితే, ఆ గురువులు నేడు అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యా హక్కు చట్టం ఉపాద్యాయులు
ఇతర వృత్తులు చెపట్టరాదని స్పస్టం
చెసినప్పటికి, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇతరత్ర వృత్తివ్యాపారాల్లో
నిమగ్నమయ్యారని మరికొంత మంది
ఎకంగా
ప్రైవెటు
పాటశాలలు నిర్వహిస్తున్నరని, తను
పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాల నిర్వహన ఎవరొ ఒక స్థానిక విద్యా వాలంటీర్ ని నియమించి తమ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారనె
విమర్శల్లో నిజంలేకపోలేదు. వీరికి పంతులుద్యోగం కాస్త పస లేని పైసలు రాల్చని వృత్తిగా పరిణమించింది. టీచర్ల గైరాజరి సమస్య మారుమూల గ్రామాల్లొని స్కూల్లో చాలా అధికంగా ఉంటుంది. టీచర్ల గైరాజరి వల్ల సరయిన సమయంలో భోదించాల్సిన పాఠ్యంశాలు సకాలంలో పుర్తికాలెకపోతున్నయని యునెస్కొ తన నివెదికలో పేర్కోంది. నవతరం ఉపాద్యాయులలో బొత్తిగా సేవా
భావగుణం
లోపించి
ఉపాధ్యాయ వృత్తి తమ
పూర్వపు
ఉనికిని
కోల్పోతుందనే వాదనలు వివిధ అధ్యయనాల ద్వార వినిపిస్తున్నాయి. ఉత్తమ
ఉపాద్యాయులెవరనె ప్రశ్నకు , రోజు పాఠశాలకు రావడం, పై అదికార్ల ఆజ్ఞలు పాటిoచడమె,
ఉత్తమ
ఉపాద్యాయుని లక్షణం అని విమల రామచంద్రన్ నిర్వహించిన అధ్యయనంలో పాల్గోన్న అనెక మంది టీచర్లు పేర్కొన్నారు.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చె
ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వస్తాడని అశించడం, ఇసుక నుంచి తైలం తీయడమే. మరోక ముఖ్య గమనించదగ్గ విషయం ఎంటంటె, పాఠశాలల్లో
టీచర్ల మధ్య అంతర్గత విబేధాలు ,కుమ్ములాటలు,
పలాన కులం అని , పలాన ఉపాధ్యాయ సంఘసభ్యులని,
స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయుడు అనే భావాలు ఆదిపత్యదొరనులు సర్వ సాధారనం అయ్యాయి. పాఠశాల అభివృద్ది మరియు నిర్వహణ , నిధులు ఖర్చుపెట్టే విషయంలో కూడా ఉపాధ్యాయుల మద్య సయొద్య కుదరకపొవటం కూడా తగాదాలకు ఆజ్యం పోస్తుంది. వీటి పర్యవసనం విద్యపైన, విద్యారిపైన, ఎంతగానొ ఉంటుంది . విధ్యబోధించె చోటు కాస్త
తగాదాలకు వేదికగా మారి విద్యార్తుల పాలిట పెను శాపంగా తయారవుతున్నాయి. తాజగా
నిజమాబాద్ జిల్లాలొ ఒక ఉపాధ్యాయిని ఇలాంటి ఘటనలకు బలవ్వడం చాల హేయనీయ విశయం. ఇంకాస్త లొతుగా వెలితె మహిళ ఉపాద్యాయులపైన గుట్టుచప్పుడు కాకుండా జరిగే
లైంగిక
వేదింపులు వెలుగులోకి
రాకుండా
ఉన్న
ఉదంతాలు
కోకొల్లలు. అలాంటి
వాతావరణంలో విద్యబోధన సాధ్యమయ్యె పనేనా అనే అనుమానలు తలెత్తక మానవు. 1986
ప్రకటించిన జాతీయ
విద్యా
విదానంలో
ఉపాధ్యాయులు పాటించాల్సిన వృత్తి ప్రవర్తననియమావళిని పొందు
పర్చారు.
ఇందులో
వివిద
వ్యక్తుల
మద్య
ఉండాల్సిన సంబందాలు
పేర్కొన్నారు. ఈ వృత్తి నియమాలు ఈ సమజంలో ఎంతవరకు
పాటింపబడుతున్నాయన్నది ఎవరికి
వారు సందించుకోవాల్సిన ప్రశ్న.
పర్యవేక్షణ అనేది జవాబుదారి తనాన్ని పెంచి
వ్యవస్థను చక్కదిద్దె ఒక శక్తివంతమైన సాధనం. ఇది కొరవడినట్లయితె వ్యవస్థ గాడితప్పుతుంది.
పర్యవేక్షనకు నియమితులైన అధికార్లు, వివిద మీటింగులని, ట్రేనింగులని, పాలన పరమైన పనులతో
పర్యవెక్షనకు తీరిక లేకుండా ఉంటున్నారు. ఏజెన్సీ
ప్రాంతల్లో ఈ సమస్య మరి జటిలం. ప్రభుత్వాదికార్ల నుంచి పర్యవేక్షణ అశించడం అటుంచి విద్యహక్కు
చట్టంలో పేర్కొన్న “పాఠశాల నిర్వహణ కమిటి”లనెవి
బలోపేతం చేసుకున్నట్లైతె పాఠశాల పనితీరు మెరుగుపడినట్లె. ఇవి
ఎంత సమర్థవంతంగా పనిచేస్తె పాఠశాలల్లో విద్య అంత నాణ్యంగా ఉండే అవకాశం ఉంది. మెరుగయిన ఉపాధ్యాయుల పని తీరు, సౌకర్యాల కల్పన, నాణ్యమైన
మధ్యాహ్న భోజనం, విద్యార్థుల అరోగ్యాన్ని కాపాడే
జవహర్ బాల రక్ష పథకం నిర్వహణ అనేది ఈ కమిటిల ద్వారా సాద్యం. కాని దురద్రుష్ట వశాత్తు చాల చొట్ల
ఇవంటె ఎమిటొ తెలియని పరిస్థితి నెలకొని ఉంది. వీటిపై తల్లితండ్రుల్లో అవగాహన కల్పించడానికి శిక్షణ
కార్యక్రామాలు నిర్వహించడానికి ప్రభుత్వం చాలి చాలని నిదులు కెటాయింపులు జరుగుతున్నాయని, ఎన్నొ నేరాలు చెసి జైలల్లొ ఉంటున్న ఖైదిలకు పెట్టె
ఖర్చు నవ నిర్మాన భావి భారతపౌరుల్ని తయారు చెయుటకు పెట్టె ఖర్చు కంటె చాల తక్కువగా
ఉంటుందని గత నెలలో హైదరబాద్ లో జాతీయ బాలల
హక్కుల పరిరక్షన కమిషన్ నిర్వహించిన రాష్ఠ వ్యాప్త సదస్సులో పాల్గోన్న ప్రతినిదులు ఆవేదన వ్యక్తం చేసారు. 2010 గణాంకాల
ప్రకారం హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వo పాఠశాలల్లో చదివే విద్యార్థిపై ఏడాదికి సగటున
1709 రూపాయలు, కేరళ 1537 రూపాయలు వెచ్చిస్తే మన రాష్ట్ర సర్కారు కేవలం 573 రూపాయల
తోనె సరిపుచ్చుతుంది. ఇలాంటి సమయంలో నాణ్యతలో ఏదో ఒక చోట రాజీపడకతప్పడం
లేదు.
ఇక ప్రాథమిక విధ్యను పటిష్ట పరచడానికి
తీసుకోవాల్సిన చర్యలను చూసినట్లయితె మొదటగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వనరుల కొరత లేకుండా
చూడాలి. నూతన తరగతిగదుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చెపట్టి
నాణ్యతకు తిలొదకాలు ఇస్తూన్నరని, మరుగుదొడ్లు సంగతి మరిచిపొతున్నారని విమర్షలున్నాయి.
విధ్యాశాఖ వీటిపైన నిఘావేసి అవినితికి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేటు పాఠశాలకు
దీటుగా తీర్చిదిద్దిగలగాలి. సర్కారి సదువుపైన ఉన్న చులకన భావాన్ని తీసివేసెదిశగా చర్యలు
చేపట్టాలి. పాఠశాలల్లో పూర్తిస్థాయి అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు
ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు తమ వ్యాపర అలొచన దొరని విడనాడి సేవాదృక్పథంతో
పని చేసే విధంగా ప్రేరణ తరగతులు నిర్వహించడం, సేవకు దగ్గ గుర్తిపునివ్వడం లాంటి చర్యలు
ఎంతొ సత్పలితాలనిస్తయన్నది అక్షర సత్యం. ప్రాథమిక స్థాయిలో డ్రాపు-అవుట్ తగ్గాలన్నా, అందరికీ
విద్య లక్ష్యం నెరవేరాలన్నా మాతృభాష భాషలొనే
విధ్యాబోధన జరగాలి. గైరాజరి సమస్యను ఎదుర్కోనెందుకు బయోమెట్రిక్ హజరి పద్దతి ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు ముందుకు రావడం శోచనియం. ఈ రోజుల్లొ టెక్నాలజి ఉపయొగించని ఒకె ఒక రంగం అంటె అది కేవలం ప్రభుత్వ విధ్యా రంగం మాత్రమే. ఈ సాంకెతిక పరిజ్ఞానం ఉపయొగించి విద్యని ఏ విధంగా అభివృద్ది చెయాలొ అన్ని మార్గాలు అన్వేషించాల్సిన అవసరం, సమయమ అసన్నమయింది. 2015 నాటికి
సహస్రాబ్ది లక్ష్యాల సాధనకు క్రుషి చేస్తామని
అలాగే సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్నది ప్రభుత్వాల లక్ష్యమని 2011-12 సామాజిక, ఆర్థిక
సర్వేలో పేర్కొన్నారు. ఈ
దిశగా
ఆలొచిస్తూ సామాజిక
అంతరాలను తొలగిస్తూ సుస్థిర అభివృద్ధికి బాటవేసే నాణ్యమైన ప్రాథమిక విద్య నందిచినపుడె
ప్రపంచ దేశాలతో పొటి పడి నిలవగలుగుతాం, సగర్వంగా
తలెత్తుకు మనగలుగుతాం.
****
No comments:
Post a Comment