Pages

Wednesday, 16 January 2013


వికలాంగులు- విద్యాహక్కు చట్టం

“అందరు చదవాలి -అందరూ ఎదగాలి”  ఇది సర్వ శిక్ష అభియాన్ నినాదం. అందరికి విద్యనందిస్తామని సర్కార్ చేసిన శపథం. ఎపుడో విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాల్సిన ప్రభుత్వాలు ఆరు దశాబ్దాల అనంతరం   ఏప్రిల్ ఒకటవ తేదీ 2010 నుండి భారతదేశంలో విద్యాహక్కు చట్టం అమలులోనికి తీసుకవచ్చింది. “భారతదేశంలోని  బాల బాలికలందరికి (6-14 సంవత్సరాలు) కుల, మత, లింగ,జాతి భేదం లేకుండా, విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలతో కూడి, ఒక సంపూర్ణ బాధ్యతయుత పౌరుణ్ణి తయారు చేసే విద్యనందించడానికి కట్టుబడి ఉన్నాం”ఇవి సాక్షాత్తు దేశ ప్రధాని  మన్మోహన్ సింగ్ విద్యా హక్కు చట్టం ప్రవేశ పెట్టే  ముందు చేసిన వ్యాఖ్యాలు. 6-14 సంవత్సరాలలోపు బాల బాలికలందరికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యనందిస్తామని రూపొందించిన విద్యాహక్కు చట్టం, వికలాంగులని విస్మరించి చట్టం చేయడమేమిటని  సామన్య ప్రజానికం మొదలుకొని మేధావి వర్గం  దాక గగ్గొలు పెట్టారు. దీంతొ విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ  "అంగవైకల్యం గల పిల్లలు" అనే పదాన్ని జోడించి సవరించిన చట్టాన్ని 2012 జూన్ నెల నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ సవరించిన చట్ట ప్రకారం  వికలాంగులు(చెవిటి, మూగ, శారిరిక వైకల్యం, దృష్టిలోపం,బదిర, బాషణలోపం) మొదలగువారికి విధ్యనందించాల్సిఉంటుంది. వికలాంగులు తమ దైనందిన జీవితంలో విద్యనభ్యసించుటకు అనేక  అవస్థలు పడాల్సివస్తుంది. ఆడ పిల్లల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఇంట బయటా వీరు చాల వివక్షతను ఎదుర్కొంటున్నారుమొదటగా పాఠశాలలో సర్దుబాటు సమస్య చాల తీవ్రంగా వేదిస్తున్నది. తరగతి గదిలో మిగత పిల్లల తో సమానంగా వీరు ఇమడలేక సతమతమవుతున్నారు. వీరి పట్ల  తోటి పిల్లల తక్కువ అంచన భావం వీరిని తీవ్ర మనస్తాపానికి , వేదనకు గురి చేస్తుంది. చదువులో చదువుకుందామన్న  బలమైన కోరికను నీరు కారుస్తున్నాయి.  దీని మూలంగా వికలాంగ పిల్లల్లో అత్మనూన్యత అవహించి అర్థంతరంగా బడి నుంచి నిష్క్రమించె పరిస్థితులు తలెత్తుతున్నాయి. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ప్రతిసారి ఉపాధ్యాయుడు పర్యవేక్షించడం అనేది కష్టసాద్యమైన పని. సామజిక కార్య కర్తలు , మానసిక శాస్త్రజ్ఞుల చేత తరచుగా సమావేశాలు ఏర్పరిచి అందరు సమానమే అన్న భావనను విద్యార్థులలో కలగ చేసినట్లైతే ఈ సమస్యను సులువుగా అదిగమించవచ్చు. ఇక బోధన పద్దతులు పరిశీలించినట్లైతే ప్రత్యేక అవసరాలు గల పిల్లలున్నపుడు సాధారణ బోధన పద్దతులు ఏమాత్రం వారికి విద్యనందిచంచలేవు.  ప్రత్యేకంగా మూగ, అంధ, చెవిటి వారికి ఈ విద్య ఏమాత్రం సరిపడదు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు 1:8 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయలుండాలని రామ్ముర్థి కమిటి సూచించగా విద్యాహక్కు చట్టం 1:30 ఉపాధ్యాయ నిష్పత్తి  సూచించింది. విద్యా హక్కు చట్టం దీనిని ఏవిధంగా  సంతులితం చేస్తుందన్నది పెద్ద సవాలు . ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు విద్యా బోధన,  ప్రత్యేక విద్యా బోధన పద్దతులు   ఉపయోగించి చేయాల్సి ఉంటుంది. ప్రత్యేక విద్యా బోధన పద్దతులతో  ఏ మాత్రం పరిచయం లేని ఉపాధ్యాయులు ఈ పిల్లలకు విద్యా బోధనచేయడం  అనేది కత్తి మీద సాము లాంటిదే.   ప్రస్తుతం పని చేస్తున్న ఉపాధ్యాయులు చాల మటుకు బి.ఎడ్/టి.టి.సి చేసినవాల్లే అవడం చేత వీరు ప్రత్యేక పిల్లలకు విద్యా భోదన అందించగలరా అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యేక విద్యలో బి.ఎడ్ చేసిన ఉపాధ్యాయులను నియమించించి ఈ కొరతను తీర్చవచ్చు.  మన రాష్త్రంలో ఎన్.ఐ.ఎం.ఎచ్, స్వీకార్,  హెల్లెన్ కెల్లెర్ స్కూల్ ఫర్ డేఫ్, మరియు థాకుర్ హరి ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెంటల్లి రెటార్డెడ్ మొదలగు సంస్థలు  ఈ ప్రత్యేక విద్యలో బి.ఎడ్ ని మరియు వివిద రకాల డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఈ సంస్థల్లొని  విద్యార్థులను ప్రత్యేక  శిక్షకులుగా నియమించవచ్చు.  ఇక ఈ చట్టం కింద పాఠశాలలల్లో  కల్పించే వసతులు ప్రత్యేకంగా  వికలాంగులకు అత్యవసరమైన ప్రత్యేక మరుగుదొడ్లు, మెట్ల వరస (రాంపు) , చూసినట్లయితే దాదాపు తక్కువే  అని చెప్పవచ్చు. మాములు  వసతులు కల్పించడానికే నాన అవస్తలు పడుతున్న ప్రభుత్వాలు వికలాంగులకు ప్రత్యేకంగా వసతులు కల్పించడం సంగతి కాలమే తేల్చాల్సిన విషయం. విద్యాహక్కు చట్టం కింద ప్రత్యేక అవసరాలు గల పిల్లల సమస్యా పరిష్కారానికి   ట్రైసైకిల్లు, సపొర్టింగ్ కర్రలు, హియరింగ్ పరికరాలు, ఫిసియొథెరపి, ఎస్కార్ట్ అలవెన్స్, గ్రహణ శస్త్ర చికిత్సలు, మొదలగునవి మాత్రం మండల కేంద్రంలో మండల విద్యాధికారి కార్యాలయంలో ఎర్పాటు చేసిన ప్రత్యేక  శిక్షకుడి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రజల మద్య వీటి గురించి అవగాహన చాల తక్కువగా ఉంది. పరిస్థితి  వికలాంగులు వారికి రాజ్యం కల్పించిన హక్కులపైన గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉంది.  ప్రస్తుతం ఒక ప్రత్యేక శిక్షకుడు మండలంలోని అన్ని గ్రామాల క్షేత్ర పర్యటన మరియు పాలన వ్యవహారాలు చుసుకోవడం అనేది తలకు మించిన బారం అవుతుంది.  దీని నివారించి తగిన సిబ్బందిని  నియమించాల్సి ఉంది.   ప్రస్తుత విద్యాహక్కు చట్టం ప్రత్యేకంగా  వికలాంగులకు ఇచ్చిన హక్కులు ఏమి లేవని ఇది కేవలం ఐక్య రాజ్య సమితి వికలాంగుల హక్కుల ఒప్పందంలోని ఆంశాలు యాథావిదిగా విద్యాహక్కు చట్టంలో చేర్చారనే విమర్షలు వినపడుతున్నాయి. భారతరాజ్యగం అమల్లోకి వచ్చిన తర్వాత 1960 వరకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వికలాంగుల అభివృద్ధి, సంక్షేమానికై చర్యలు చేపట్టకపోవడం విడ్డూరకరం. 1960లో పోలియో ఆధారిత వికలాంగుల సంఖ్య పెరగడంతో సర్కార్వికలాంగులపెై దృష్టి సారించింది. తొంభైయవ దశకంలో వికలాంగుల విద్య కొరకై  అనేక కమిటిలు , విధానాలు రూపొందిచబడ్డాయి. కాని వాటి ప్రభావం చాలా తక్కువనే చెప్పొచ్చు.  అందులో ముఖ్యంగా ఐక్య రాజ్య సమితి ప్రామణిక నియమావళి 1994, రామ్ముర్తి కమిటి 1992, వికలాంగుల జాతీయ విద్యావిధానం 1986, ప్రోగ్రాం అఫ్ యాక్షన్ 1992,  మొదలగునవి ముఖ్యమైనవి. ఇందులో ప్రత్యేకంగా  రామ్ముర్తి కమిటి అనేక విలువైన సిపార్సులు చేసింది,  కాని ఈ చట్టంలో అయన చేసిన సిపార్సులకు సమ ప్రాధాన్యం కల్పించలేదు. ఈ చట్టం కేవలం ప్రాథమిక విద్యకు  భరోసా ఇచ్చి ఉన్నత విద్య అందిచే భాద్యత నుంచి రాజ్యం  తప్పుకుందన్న వాదనలకు కొదవలేదు. కోఠారి కమిషన్ సూచించినట్లుగా ప్రత్యేక విద్య అనేది కేవలం  మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం అధారంగా రూపొందిచడం జరిగినపుడే దానికి సార్థకత ఏర్పడుతుంది. రాజ్యంగం కల్పించిన ఉచిత నిర్భంద విద్య ప్రకరణ 21 ని సాకారం చేస్తూ చట్టం చేయడం ఒకింత శుభ పరిణామమే ఐతే దీనిని సమర్థ వంతంగా అమలు చేసినపుడే నిజమైన  ప్రయోజనం  చేకూరుతుంది

No comments:

Post a Comment