Pages

Wednesday, 27 February 2013

ప్రతిస్పందన ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు
ఫిబ్రవరి 24 ఆదివారం రోజు ‘నమస్తే తెలంగాణ’ దినపవూతికలో ‘అంధకారంలో ఆరెకటికలు’ శీర్షికతో ప్రచురితమైన ఆర్టికల్ మాజాతిని మేల్కొనేలా చేసింది. ఆరె కటికల సంప్రదాయాన్ని, ఆచారాన్ని, కులవృత్తిని, వారి కష్టాల గురించి రాసి మా కులస్తులలో చైతన్యం తెచ్చారు. నేడు మా కులానికి జరుగుతున్న అన్యాయాలను కళ్లకు కట్టినట్టు రాశారు. ముఖ్యంగా రిజర్వేషన్లు, ఫెడరేషన్, రాజ్యాధికా రం లేక మా ప్రజలు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకోవడం హర్షణీయం. ఈ రోజుల్లో అనేక పత్రికలు మా జాతి ని కించపరుస్తూ వ్యాఖ్యలు రాస్తున్నాయి.

‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన ఆర్టికల్ మా కులాన్ని కించపరిచే వారికి కనువిప్పు కలిగేలా ఉన్నది. ఆరెకటికలు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నలభై లక్షలకు పైగా జనాభా ఉన్నా, మాకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదని మీ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలియజేసినందుకు రాష్ట్ర ఆరెకటికల పోరాట సమితి సంతోషిస్తున్నది. దీనికి ఆరెకటిక పోరాట సమితి తరఫున నమస్తే తెలంగాణ ఎడిటర్ గారికి ఉద్యమాభివందనాలు. మునుముందు కూడా మా జాతి అభ్యుదయానికి తోడ్పాటు అందించగలరని మనవి.
-గోగికార్ సుధాకర్ (ఆకటిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు),
గోగికార్ సుధాకర్, కళ్యాన్‌కార్, ఈశ్వర్‌చౌదరి,
మల్కెడికార్, గురుచరణ్, మురారికార్ ప్రశాంత్, గోగికార్ నరేశ్

this is the response to   my article on are katika published in Namste telangana on  February  24th 2013 

No comments:

Post a Comment