5/2/2014 12:06:41 AM
జన జాతర మేడారం
కరువు పీడితులైన ప్రజల నుంచి కప్పం వసూలు చేయడాన్ని,
సమ్మక్క, సారలమ్మలు వ్యతిరేకించారు. కాకతీయ పాలకులకు ఎదురు తిరిగి, తమ
శౌర్య పరాక్రమాలు, పౌరుషాన్ని, ధీరత్వాన్ని ప్రదర్శించి వీరమరణం పొందా రు.
ఆనాటి నుంచి ప్రతి రెండేళ్ల ఒకసారి నాలుగు రోజు లు అతి వైభవంగా జరిగే
పండుగే సమ్మక్క సారలమ్మ జాతర. వీరనారీమణులు స్మత్యర్థం ఆదివాసీలు ఈ జాతరను
జరుపుతారు. ఈ జాతర ఆదివాసీ, గిరిజనుల సం స్కతి, సాంప్రదాయాలకు,
ఆత్మగౌరవానికి ప్రతీకలుగా భావిస్తారు. భక్తులు సమ్మక్కను తల్లిగా సారలమ్మను
ఆడపడుచుగా కొనియాడుతారు.
దేశం నలుమూలల నుంచి కోటికిపైగా భక్తులు ఈ జాతరకు వస్తారు. తల్లిబిడ్డలుగా ఖ్యాతిచెందిన ఈ దేవతలు గిరిజన తెగలలోని కొని గోత్రాలకు చెందిన కోయవారిచే సాంప్రయాలకనుగుణంగా పూజించబడుతున్నారు. జాతర సమయంలో గద్దెనుంచి మూడు కిలోమీటర్ల దూరంలోగల కన్నెపల్లి గ్రామం నుంచి సారలమ్మను బుధవారం సాయంత్రం వైభవంగా గద్దెకు చేర్చుతారు. గురువారం సాయంత్రం గద్దె నుంచి కిలోమీటర్ దూరంలో గల చిలకలగుట్ట నుంచి వారి సాంప్రదాయ నత్యాల, వాయిద్యాలతో, గౌరవ సూచకంగా పోలీసు అధికారులు గాలిలోకి కాల్పు లు జరిపి కట్టుదిట్టమైన బందోబస్తుతో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతను జన సముద్రం నుంచి వైభవంగా గద్దెకు చేరుస్తారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను కొత్తగూడ మండలం పునుగొండ గ్రామం నుంచి గద్దెలకు తీసుకొస్తారు.
గద్దెకు చేరిన దేవతలకు భక్తులు కానుకలను సమర్పిస్తారు. ప్రారంభం లో గిరిజనులు మాత్రమే ఈ జాతరలో అధికశాతం పాలుపంచుకునేవారు. వీరు ఆర్థికంగా, సామాజికంగా వెనకబడి ఉండటం వల్ల తక్కువ ఖర్చుతో కూడిన కానుకలైన ఎదురు కోళ్ళు, బెల్లాన్ని సమర్పిస్తారు. తాము సమర్పించే బెల్లాన్ని బంగారంతో సమానంగా భావిస్తారు. తమ ఎత్తు(బరువు) బంగారాన్ని దేవతలకు కానుకలుగా ఇస్తారు. కొత్త పసుపు రంగు గుడ్డలో కుంకుమ బియ్యం, రెండు కొబ్బరి కుడుకలు, రెండు రవిక ముక్కలు, రెండు వక్కలు, ఖర్జూరాలు వేసి భక్తులు నడుముకు కట్టుకుంటారు. అందులో నుంచి రెండు రవిక ముక్కలు కొద్ది బియ్యం దేవతల కు సమర్పిస్తారు. మిగిలినవి తమతో తీసుకువెళ్ళడం వల్ల స్వయంగా దేవత సమ్మక్కే తమ ఇంటికి వచ్చినట్టుగా నమ్ముతారు. ఈ జాతరలో మాంసాహారం, మద్యపానం వాడడం ఆనవాయితి. అసంఖ్యాకంగా భక్త జనం స్నానాలు ఆచరించి శివసత్తులు తమ కోరికలు కోరుకుంటా రు. జంపన్న వాగులో స్నానం చేసిన తరువాతే మొక్కులు సమర్పిస్తారు. శనివారం దేవతలు తిరిగి వనప్రవేశం చేయడంతో ఈ జాతర ముగిసిన ట్టు ప్రకటిస్తారు.
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద, దక్షిణ భారతదేశంలోనే గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతర ప్రతి పండుగకు ముందు విమర్శలు అధికార యంత్రాంగం ఆరాటం ఆర్భాటంతో మొదలైన కోట్లా ది రూపాయలు వెచ్చించినా శాశ్వతమైన సౌకర్యాలు లేక జాతర అనంతరం కాలుష్యంతో అక్కడి గిరిజనులకు మిగిలేది కష్టాలు, సమస్యలే. జాతర ప్రారంభానికి ఆరునెలల ముందు నుంచి పనులు ప్రారంభింస్తుం ది. ప్రణాళిక ప్రకారం గిరిజనులు మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి జాతరకు సౌకర్యాలు మెరుగుపరుస్తూ, జాతర ప్రాముఖ్యాన్ని ప్రాచుర్యంలోకి తెస్తారు. గిరిజనుల మనోభావాలు, భక్తుల సూచనలు ఆచరణలోకి రాకపోవడం శోచనీయం. ఇతర ప్రాంతాలలో ఉన్న దేవాలయా లు, పురాతన కట్టడాలపై ఉన్నశ్రద్ధ, తెలంగాణలోని గిరిజన నియోజకవర్గమైన ములుగు ప్రాంతంలోగల సమ్మక్క సారలమ్మ జాతరపై లేదు. ఈ ప్రాంతం అభివద్ధికి నోచుకోకపోవడమే కాదు పర్యాటక కేంద్రంగా గుర్తింపు రాలేదు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే విమర్శలు ఉన్నాయి.
ముఖ్యంగా అరకొర సౌకర్యాలున్నా లక్షలాది మంది భక్తులు ఈ జాతరలో భక్తి శ్రద్ధలతో అవాంఛనీయ సంఘటనలు లేకుండా వ్యయ ప్రయాసలకోర్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేంకటేశ్వరస్వామి పేరును పెట్టుకున్నట్టుగానే తెలంగాణలో చాలామంది తమ పిల్లలకు సమ్మయ్య, సమ్మక్క, సారలమ్మ సారయ్య, జంపన్న అని పేర్లు పెట్టుకోవడం మనకు కనిపిస్తుంది. సమ్మక్క, సారలమ్మలపై ఉన్న అపారమైన నమ్మకమే దీనికి కారణం.
ఇన్ని విశిష్టతలు గల ఈ జాతరను ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించాలి. ఈ జాతర చరిత్రను పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలి. తరిగిపోతున్న సహజ సంపద, అటవీ సంపదను, ఔషధ మొక్కలను, కంక వనాలను పెంపొందించాలి. దీన్ని వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా అభివద్ధి చేయాలి. కలగా మిగిలిన కంతనపల్లి ప్రాజెక్టును నిర్మించి సాగు,తాగునీటిని అందించాలి. అలాగే ఈ ప్రాంతా న్ని పర్యాటక కేంద్రంగా అభివద్ధి చేయాలి.
ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెడుతున్న కోట్ల రూపాయలు ఒక ప్రణాళికా ప్రకారం వెచ్చిస్తే ప్రభుత్వాలు విమర్శలకు గురికావు. మొక్కులు చెల్లించే సమయంలో కొబ్బరికాయలు, బెల్లం గద్దెపైకి విసిరే సమయంలో అనేకమంది భక్తులకు గాయాలవుతున్నాయి. దీని నివారణకు ఎన్ని సూచనలు చేసిన ప్రయోజనం ఉండడం లేదు. జాతర ప్రాం తంలో అక్కడక్కడ చెత్తకుండీల మాదిరిగా తాత్కాలిక కుండీలను జాతర నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంత అభివద్ధికి పర్యావరణ వేత్తలు, సామాజికవేత్తల, ఆదివాసీ, గిరిజన విద్యావంతులతో కూడిన కమిటీ వేయాలి. వారి సూచనల ఆధారంగా శాశ్వత ప్రణాళికలు రూపొం దిం చాలి. జాతర సమయంలో పంట నష్టపోతున్న స్థానికులకు పంట నష్టపరిహారం చెల్లించాలి.
ఈ ప్రాంతంలోని ప్రకతి నిలయమైన ప్రతి జీవరాశి వస్తువు సమ్మక్క, సారలమ్మ ప్రతిరూపాలు. వీటికి హాని తలపెట్టకూడదు. ప్రకతి వరమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోవడం, అంతరిం చిపోతున్న వన సంపదను కాపాడుకోవడం మనందరి బాధ్యత.

పొఫెసర్ ఎ. సీతారాం నాయక్
కాకతీయ యూనివర్సిటీ
No comments:
Post a Comment