Pages

Wednesday, 30 July 2014


అస్తిత్వ సమాధులపై పోలవరం - మైపతి అరుణ్‌ కుమార్‌

Published at: 31-07-2014 00:29 AM
‘మమ్మల్ని ముంచే ప్రజాస్వామ్యం మాకొద్దని’ పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న ఆదివాసులు నినదిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, కొమరం భీం, బిర్సాముండా, సోయం గంగులు పోరాట        సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మా గూడెంలో మా రాజ్యం. ‘జల్‌, జంగిల్‌, జమీన్‌’ మాదే అని ఉద్యమిస్తున్నారు.
దేశ చరిత్రలో మూడు లక్షల మంది ఆదివాసులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఊచకోత కోయడానికి మార్గం సుగమం చేసిన చీకటి రోజు 2014, జూలై 11. ప్రస్తుత ప్రజాస్వామ్య పాలన భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని నిరూపించిన రోజు అది. రాజ్యాంగంలోని జీవించే హక్కును ఆదివాసులకు అందకుండా కాలరాసిన రోజు. గత యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన పోలవరం ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్‌ను ప్రస్తుత ఎన్డీఏ యాంలో పార్లమెంటులో ఆమోదం పొందిన రోజు. పోలవరం పేరిట ఆదివాసీలకు ప్రజాస్వామ్య పాలకులు వేసిన శిక్ష అది.
సమాజం మొత్తం అనుకున్నట్లే కేవలం గ్రామాలు, అడవులు, పురావస్తు ఆధారాలు, భద్రాచల రామాలయ భూముల్ని మాత్రమే కోల్పోతున్నామా లేక ఇంతకంటే విలువైనవేమైనా జల సమాధి అవుతున్నాయా? అదివాసీ సమూహాల్లో కొన్ని వేల ఏళ్ళుగా వస్తున్న అస్తిత్వ మూలాలు జలసమాధి అవుతున్నాయి. ప్రభుత్వాలు వారి అస్తిత్వానికి ఏం పరిహారం చెల్లిస్తాయి? కోల్పోతున్న వారి అస్తి త్వాన్ని ఏవిధంగా పునర్మిరిస్తాయి? సాధారణంగా ఆదివాసీ సమూహాలు.. ప్రకృతితో మమేకమై, అటవీ ఉత్పత్తుల అనుసంధానంతో, అందుబాటులోని నీటివనరుల ఆధారంగా తమ అస్తిత్వాన్ని సుస్థి రం చేసుకుంటారు. ఆ విధంగా సంప్రదాయబద్ధంగా గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సాలోని ముంపునకు గురయ్యే 300 ఆదివాసీ గ్రామాలు ఆ విధంగా ఏర్పడినవే. ఖరీఫ్‌ సీజన్‌ మొదలవగానే దేశంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతుంది. ఆదివాసీ సమాజంలో దీనికి భిన్నంగా ఉం టుంది. దుక్కులు దున్నటానికి నాగలి కోసం అడవిలో వంక గల బిలుగు చెట్టు కలపను సేకరించి నాగ లి తయారు చేసుకుంటారు. దానికెటువంటి ఖర్చు అవసరం లేదు. పంటచేల రక్షణ కోసం అడవిలో చెట్లతోనే మంచెల నిర్మాణం, కంచె నిర్మాణం చేసుకుంటారు. పశుపోషణ అడవితో ముడిపడి ఉంది. అటవీ ఉత్పత్తులను సేకరించి సంతల్లో విక్రయించి పూట గడుపుకుంటారు. వెదురుతో బొమ్మలు చేస్తారు. అడవి కలపతోనే పూరి గుడిసెల నిర్మాణం చేసుకుంటారు. పండుగలు కూడా ఆయా గ్రామాల పరిసర ప్రాంతాలతో ముడిపడి ఉంటాయి. ఇవేకాక ఆదివాసీ సమాజంలో గట్టు విధానం ఉంటుంది. ముంపునకు గురయ్యే కోయ సమాజంలో 3 నుంచి 7వ గట్టుకు సంబంధించిన ఆదివాసీలున్నారు. ఇందులో ప్రతి గట్టు వారికి అడవిలో ఒక చెట్టు, జంతువు దైవాలుగా ఉంటాయి. మద్ది చెట్టు అడవి కోడి, ఉడుము, మేక, తాబేలు వంటివి. ఏ పండుగ జరిపినా విప్ప చెట్టును వారు ప్రధానంగా పూజిస్తారు. వేట విధానంలో కూడా వేటాడిన మాంసాన్ని నల్లమద్ది చెట్టుకు నైవేద్యంగా పెట్టిన తర్వాతనే తినటం ప్రారంభిస్తారు. గూడెంలోకి సరిపడు పంటలు పండటం కోసం సంప్రదాయబద్ధంగా ఏర్పాటుచేసుకున్న నీటి చెరువులు కుంటల కట్టలపై మైసమ్మ, ఎర్రమ్మలు కొలువుంచుకుంటారు. ఆదివాసుల అణవణువూ వారు శతాబ్దాలుగా బతుకుతున్న ప్రకృతిపై ఆధారపడి ఉంది. పెళ్ళి విధానంలోనూ ఉమ్మడి సాంప్రదాయక జీవన వ్యవస్థ ప్రకృతిలో గల సంబంధాన్ని చూడవచ్చు. పెళ్ళి విధానంలో పచ్చని పందిరి ఏర్పాటుకూ కొన్ని ప్రత్యేక చెట్లను వాడుతారు. ముహూర్తానికి ముందు జిన్న పొరక, పాల పొరకను అడివి నుంచి సన్నాయి వాయిద్యాలతో తీసుకొచ్చి పందిరిపై అలంకరిస్తారు. ప్రధానం పీఠ, కడపలను ఇదే సమయంలో తీసుకొస్తారు. వాటి తయారీకి అడవిలో బతెంగ చెట్టు బెరడునే ఉపయోగిస్తారు. వేరేదాన్ని వాడటానికి వీలులేదు. తాళి కట్టే సమయంలో జమ్మి చెట్టును అడవినుంచి తెచ్చాకే తాళి కడతారు. ఇలా ఆదివాసీ సమా జం ప్రకృతితో పెనవేసుకోయి శతాబ్దాలుగా నడుస్తోంది. అలాంటి ఆదివాసీ అస్తిత్వం పోలవరం ప్రాజెక్టు వల్ల సమాధి కాబోతోంది.
ఉన్నపళంగా వీటన్నింటినీ వదిలి నేడు పోలవరం పేరిట సామ్రాజ్యవాదులకు లాభం చేకూర్చటానికి ఈ గూడేలన్నిటినీ మైదాన ప్రాంతాలకు తరలిస్తే ఆదివాసుల అస్తిత్వమేమవ్వాలి? ప్రభుత్వం ప్రకటించే రూ.10 లక్షల నష్టపరిహారం వారు కోల్పోతున్న జీవితంతో పోలిస్తే ఏపాటిది? మైదాన ప్రాంతంలో పునరావాసం కల్పిస్తే వారు ఎలా బతకాలి? తాగునీరు సైతం మైదానంలో రూ.20 ధర పలుకుతుంటే వారి జీవనం ఎలా సాగాలి? మైదాన ప్రాంతంలో భూముల కోసం కొట్టుకు చస్తుంటే, మాకు భూములు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇచ్చినా ఏం పంటలు పండించాలి? అనే ప్రశ్నలు జలసమాధి కాబో తున్న ఆదివాసీలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. అడవి అనే నీటిలో చేపలాగా బతికే ఆదివాసీని బయటపడేస్తే ఎలా బతుకుతారు? కనీస మానవతా విలువలు లేకుండా వ్యవహరిస్తున్నాయి ఈ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు. ఆదివాసీలు జీవించే హక్కును ప్రజాస్వామ్య బద్దంగా కాలరాస్తున్నవి. ప్రజాస్వామ్యబద్దంగా గ్రామ సభల తీర్మానం జరపాలని సూచించే రాజ్యాంగ నిబంధనను కూడా అవి ఉల్లంఘిస్తున్నాయి. అటవీ హక్కులకు సంబంధించిన 1/70 చట్టాన్ని పార్లమెంట్‌ గేటు దగ్గర పాతర పెట్టి లోపల మాత్రం పోలవరానికి ఆమోదం తెలిపాయి. అస్తిత్వ పోరాటాన్ని అంచనా వేయ డం చాలా కష్టం. నాడు జోలాపుట్‌ బలిమెల డ్యాంల కింద నిర్వాసితులైన గోండులు ఏమయ్యారో నేటికీ తెలియదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల కింద జల సమాధి అయిన చెంచులు బతికున్నారో లేదో అంచనా లేదు. నేడు ‘పోలవరం’ ముంపునకు గురయ్యే 3 లక్షల కోయ సమాజం కూడా వీరిలాగే ఉనికిలో లేకుండా పోతారనే ఆందో ళన ఉంది. అయితే గతంలో వలె నిరక్షరాస్యతతో నేటి ఆదివాసీ సమాజం లేదు. విద్యా చైతన్యాన్ని, సామాజిక స్పృహను సంతరించుకున్నారు. మమ్మల్ని ముంచే ప్రజాస్వామ్యం మాకొద్దని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న ఆదివాసులు నినదిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, కొమరం భీం, బిర్సాముండా, సోయం గంగులు పోరాట సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మా గూడెంలో మా రాజ్యం. ‘జల్‌, జంగిల్‌, జమీన్‌’ మాదే అని ఉద్యమిస్తున్నారు. మరో శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం, ఇంద్రవెల్లిలు పునరావృతం అయితే దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.
మైపతి అరుణ్‌ కుమార్‌
అదివాసీ విద్యార్థి సంఘం
Andhra Jyothi dated 31 -07-2014


ఆ చిన్నపిల్లల్ని ఎవరు చంపారు? " - కంచ ఐలయ్య
మాసాయిపేట దుర్ఘటనలో పాపం, పుణ్యం తెలియని పసికందులు ఎందుకు చనిపోయారు? నాలుగైదు గ్రామాల నుంచి అంత చిన్న పిల్లలు బస్సుల్లో పట్టణాల్లో స్కూళ్ళకు ఎందుకొస్తున్నారు? యల్‌.కె.జి.లో చేరే చిన్న పిల్లల వయస్సు ఎంత ఉంటుంది -మూడు లేదామూడున్నర కదా? రైలు ట్రాక్‌ చుట్టూ పడివున్న శవాలను, వారి పసి ముఖాలను చూసి ఏ పండిత వర్గమైనా బాధపడిందా?
ఈ చిన్న పిల్లల్ని గ్రామాల నుంచి ఇంగ్లీష్‌ మీడియం స్కూలుకు పంపిన తల్లిదండ్రుల ముఖాలు, బట్టలు చూశారా? అందులో ఎంత బీద లేబర్‌జనం ఉన్నారో గమనించారా? వాళ్ళ, వాళ్ళ గ్రామాల్లో కిండర్‌ గార్టెన్‌ నుంచి ఏడో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ఉండి ఉంటే ఇంత పసికందులు బస్సులో పడి గేటులేని లెవల్‌ క్రాసింగ్‌లు ఉన్న దేశంలో, రాష్ట్రంలో సుదూర స్కూలుకు వెళ్ళేవాళ్ళా? హైదరాబాద్‌కు అతి దగ్గర్లో ఉన్న రైలు లైన్ల మీద కూడా కనీసం మనిషిని పెట్టి గేటు పెట్టలేని రైలుపట్టాలున్న దేశమిది. రైల్వే ఆస్తుల్ని మంత్రులు, అధి కారులు ఎంత దోచుకుతింటున్నారో మనకు తెలుసు. ఈ ప్రాంతం నుంచి ఎంతోకాలం నుంచి ఎన్నో స్కూలు బస్సులు పసికందుల్ని ఎక్కించుకొని తిరుగుతున్నాయని అధికారులకు తెలుసు, మంత్రులకు తెలుసు. ఎంత వీలైతే అంత దోచుకొని పాపభీతి కూడా లేకుండా బతికే పాలకులకు పసిపిల్లల ప్రాణాలు ఎంత విలువైనవో ఎలా తెలు స్తుంది? ఆ చనిపోయిన పిల్ల్లల్లో ఎటువంటి మేధావితనం దాగి ఉండిందో ఎలా అంచనా కట్టగలం? వాళ్ళంతా ఇంత పెద్ద వ్యవస్థ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అమానుషత్వంతో ఆగమైపోతే ఎందుకిలా జరుగుతుందో మూలాల్లోకి పోవాలి గదా! గ్రామాల్లో శ్రమజీవుల్లో ఇంగ్లీషు విద్యా ఆకాంక్ష అంతా ఇంత పెరగలేదు. హైదరాబాద్‌ చుట్టూ గ్రామాల్లో కూలీనాలీ చేసుకునే వాళ్ళు ఇంగ్లీషు విద్య కోసం ఇంత తపించి అంత పసికందుల్ని సుదూరం పొయ్యే బస్సెక్కిస్తుంటే ఎవరు ఆలోచించకపోయినా ప్రభుత్వ స్కూల్‌ టీచర్లు ఆలోచించాలి కదా?
ఈ పిల్లలు పుట్టిన అన్ని గ్రామాల్లో తెలుగు మీడియం స్కూళ్ళు ఉన్నాయి. అందులో ప్రభుత్వ పంతుళ్ళు ఉన్నారు. ఆ స్కూళ్ళలోకి ఈ కూలీ, నాలీ పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడక, బస్సుకూ, స్కూలుకూ తమ రెక్కల కష్టం నుంచి డబ్బుకట్టి ఉచిత విద్యను, మిడ్డే మీల్స్‌ను పక్కకు పెట్టి ప్రైవేట్‌ స్కూళ్ళకు వాళ్ళు ఎందుకు పంపుతున్నారు? ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలంగాణ జిల్లాల్లో సగటున 59 మంది పిల్లలే మిగిలి ఉన్నారని టీచర్‌ సంఘాలే ఒప్పుకుంటున్నాయి. ఆ 59 మంది తల్లిదండ్రులు అయ్యో! మా పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం స్కూలుకు పోతలేదే అని ప్రతిరోజూ ఆవేదన పడుతున్నారు. ఆ ఆవేదన నుంచే కదా ఈ పసికందులు బలైంది? దానిని తల్లిదండ్రుల తప్పందామా?
ఈ స్థితి ఎందుకొచ్చిందనే ప్రశ్న గురించి ఎవరు ఎక్కువ ఆలోచించాలి? ఉపాధ్యాయ సంఘాలు, టీచర్‌ ఎమ్మెల్సీలు ఈనాడున్న విద్యా వ్యవస్థకు మేలుచేస్తున్నారా, కీడు చేస్తున్నారా? ఒక చిన్న మేధావి వర్గం విప్లవం, మార్క్సిజం, ప్రభుత్వ రంగం, సోషలిజం గురించి ఉపన్యసిస్తూ తమ పిల్లల చదువుకొచ్చే సరికి వరల్డ్‌ క్లాస్‌ ప్రైవేట్‌ స్కూళ్ళకు పంపుతుంటే వీళ్ళు విప్లవ దృక్పథానికి చేసే ద్రోహం ఎంత పెద్దదో ప్రజలకు తెలుసు. అందుకే వీరి ‘విప్లవం’ పట్ల ప్రజలవిశ్వాసం సన్నగిల్లుతున్నది. ఏ వ్యవస్థ పునాది అయినా అది ఎన్నుకునే విద్యారంగంపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ వచ్చేవరకు తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రభుత్వాల మెడలు వంచి ప్రజల మేలుకోసం పాటు పడుతామని ప్రమాణాలు చేసిన వారంతా ఇప్పుడు ప్రభుత్వంలో తమకు ఏమి లభిస్తుందని ఆలోచిస్తున్నారు తప్ప ప్రభుత్వ హామీలను ముఖ్యంగా కె.జి. టు పి.జి. వరకు ఇంగ్లీష్‌ విద్యను అమలుచేయాలని ఒక్క అగ్ర కుల మేధావి అడగడంలేదు. పసికందులు ప్రైవేటు స్కూలు బస్సుల్లో, ఆటోల్లో పొయ్యే విద్యా విధానానికి స్వస్తిచెబుదామని ఎవరూ అడగడం లేదు.
ఏ నిర్ణయాన్ని ఎప్పుడు అమలుచేయాలో ఇప్పుడు ఒక్క కుటుంబం మాత్రమే నిర్ణయించాలి. ఉద్యమ ప్రజాస్వామ్యం ఇప్పుడు పటాపంచలైంది. చిన్న రాష్ట్రంలో పెద్ద అధికార పీఠాల వేట నిరంతరం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం దోపిడీ దొంగలకు కూడా లెజిటమసీ ఇచ్చింది. రోజూ పత్రికల్లో ఒక కుటుంబ ప్రకటనలు లేదా బీజేపీ, శివసేన వంటి వారు ముస్లింల మీద చేసే యుద్ధం తప్ప మరొకటి కనిపించడం లేదు. విద్యా వ్యాపారంపై పోరాటం చేసే బదులు విద్యా వ్యాపారులు, ప్రైవేట్‌ స్కూళ్ళ యజమానులు (ఇందులో టీచర్‌ ఎమ్మెల్సీలూ, నాయకులూ ఉన్నారు) ప్రభుత్వ రంగంలో ప్రవేశపెట్టాలనుకునే కె.జి.టు పి.జి ఇంగ్లీషు విద్యా విధానాన్ని ఆపడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మాసాయిపేట రైలు క్రాస్‌ వద్ద చనిపోయిన చిన్నారుల కుటుంబాల సంగతే చూద్దాం. వారికి ప్రభుత్వ రంగంలో ఇం గ్లీషు విద్య కూడా దొరికివుంటే వారి చావులు తప్పేవి, వారి కుటుంబాల ఆర్థిక స్థితి కూడా భిన్నంగా ఉండేది. నెలవారీగా ప్రైవేటు స్కూళ్ళ మీద పెట్టే ఖర్చు ఇంతా అంతాకాదు. తమ పిల్లలకూ ఇంగ్లీష్‌ రావాలనుకునేది బ్రిటిష్‌ వలసవాదం మీదనో, లార్డ్‌ మెకాలే మీదనో ప్రేమతో కాదు. తమ పిల్లలు తమలా కూలీలు కావద్దని. ఇప్పటికే తల్లిదండ్రులకు తెలుగు మీడి యంపై నమ్మకం పోయింది. ఆ కూలీల్లో కొంతమందైనా పదోతరగతి వరకు తెలుగుమీడియం చదువుకున్న వాళ్ళున్నారు. వారు మళ్ళా కూలీలుగానే బతుకుతున్నారు. ఇంగ్లీషు కూడా చదువుకుంటే ఈ విధంగా కూలీ బతుకు బతక్కుండా ఉంటారని ఒక నమ్మకం వాళ్ళలో ఉన్నది. ఈ స్థితిలోనూ ఉపాధ్యాయ సంఘాలు జూలై 27న తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి తమ సర్వీసు విధానం గురించి అడిగారు. తమకు లెక్చెరర్‌ పదవులు కావాలని అడిగారు కానీ విద్యా విధానాన్ని మార్చండని వాళ్ళు అడుగలేదు. ముఖ్యమంత్రి తాను ఏమి ఆలోచిస్తున్నారో వారికి చెప్పి పంపారు.
తెలంగాణలో గత పదేండ్లలో ప్రైవేట్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళు ఎంత పెరిగాయో విద్యా కమిషన్‌ ప్రతి సంవత్సరం ఇచ్చే ఎడ్యుకేషన్‌ స్టాటిస్టిక్స్‌ చూస్తే తెలుస్తుంది. 2012 సంవత్సరాంతానికి ఒక్క రంగారెడ్డి జిల్లాలో 1002, హైదరాబాద్‌లో 744, కరీంనగర్‌లో 604, నల్లగొండలో 485, మహబూబ్‌నగర్‌లో 412, వరంగల్‌ జిల్లాలో 533 ప్రైవేట్‌ స్కూళ్ళు ఉన్నాయి. ఈ ప్రైవేట్‌ స్కూళ్ళన్నీ ఎక్కువగా అగ్రకుల విద్యా వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి.
ఈ అగ్రకులాల వారే ఎమ్మెల్సీలు, నాయకులు అవుతారు. వీరి పిల్లలు లెవల్‌ క్రాస్‌ చేయనవసరం లేని హైదరాబాద్‌ సిటీలో ఉండి చదువుతారు. ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడు చెప్పిన సమాచారం ప్రకారం కొంతమంది ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్‌ స్కూళ్ళకు పిల్లల్ని గ్రామాలు, కుటుంబాలు తిరిగి సమీకరిస్తారట. ప్రైవేట్‌ స్కూళ్ళలో పాఠాలు చెబుతారట. కానీ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం వారానికొక రోజు కూడా పోరట. వీళ్ళంతా ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ కె.జి. నుంచి పి.జి. వరకు ఇంగ్లీష్‌ విద్య నిర్ణయాన్ని తిరగదోడించాలనేది వారి పట్టుదల.
కనీసం కమ్యూనిస్టు పార్టీలు, విప్లవగ్రూపులు తమ ప్రభావంతో నడిపే విద్యార్థి సంఘాల ద్వారాగానీ, టీచర్ల సంఘాల ద్వారాగానీ టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని అమలుచేయించడం గురించి చర్చ జరుగుతుందా అంటే అది కనిపించడం లేదు. ఇక మిగిలింది దళిత బహుజన సంఘాలు. ఈ సంఘాలు కూడా విద్యా విధానం మార్పుపై మాట్లాడే ప్రక్రియను సీరియస్‌గా తీసుకోలేదు. కులసంఘాల్లోనూ సంఘనాయకులు తమ పిల్లల్ని ఏదో ఒకటిచేసి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో చదివించుకుంటారు. కానీ సర్వజన సమానత్వం, సమానపోటీస్థాయి కల్పించే విద్యా రంగం వరకు వచ్చేసరికి వాళ్ళకూ అంతగా పట్టింపు ఉండదు. అంటే తమ పిల్లల విద్య మాత్రమే తమ స్థాయిని కాపాడుతుందని ప్రతి నాయకుడు/నాయకురాలు ఆలోచిస్తారు. దాదాపు అన్ని కులాల్లో (అసలే చదువుకోని కులాలు తప్పితే) విద్యావర్గ లక్షణం ఒకటి వచ్చి కూర్చుంది. ఈ వర్గ వ్యత్యాసాన్ని మార్చగలిగేది కూడా ‘యూనిఫామ్‌ విద్యా విధానం’ మాత్రమే. ఈ అన్ని కారణాల వల్ల ‘సర్వ సమాన ఇంగ్లీషు విద్య’ అందరి పిల్లలకు రాకుండా చూసే కుట్ర వివిధ స్థాయిల్లో ఉంది. నమ్మాలో వద్దో కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ‘నేను యూనిఫామ్‌ ఇంగ్లీషు విద్య ప్రేమికుణ్ణి’ అని ప్రకటించుకున్నారు. అయితే ఆయన కుమారుడికీ, కుమార్తెకీ ఇటువంటి ప్రేమ ఉన్నదో లేదో చెబుత లేదు. అమలయ్యే నిర్ణయాలన్నీ కుటుం బం ఐక్యంగా తీసుకుంటుందని వదంతులున్నాయి. కనీసం ఈ ఒక్క నిర్ణయం - అంటే కె.జి. టు పి.జి. ఇంగ్లీషు మీడియం నిర్ణయం సమష్టిగా తీసుకొని అమలుచేస్తే తెలంగాణ రాష్ట్రానికో మేలు జరుగుతుంది.
ఐతే హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంగనర్‌ నగరాల్లో, జిల్లాల్లో వివిధ చోట్ల తిష్ట వేసిన విద్యా వ్యాపారస్తుల ఒత్తిడి తక్కువ ఉంటుందని అనుకోలేం. బస్లుల్లో, ఆటోల్లో పిల్లలు సుదీర్ఘ దూరాలకు పోతూ సచ్చినా మంచిదేనని అన్ని గ్రామాల్లో ఇంగ్లీషు మీడియం విద్య ప్రైవేట్‌రంగం నుంచి ప్రభుత్వ రంగానికి మారడాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇంగ్లీష్‌ మీడియం కాలేజీలు ఎత్తేసి అన్ని ఉన్నత పాఠశాలలను 12వ తరగతిలోకి మార్చడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు.
వీళ్ళంతా పార్టీలకు చందాలిస్తారు. మంత్రుల, ఎమ్మెల్యేల అవసరాలు తీరుస్తారు. వీరి డబ్బులముందు తెలంగాణ ప్రజల త్యాగాలు పెద్ద లెక్కలోనివి కావు. తెలంగాణ బీద ప్రజలకు త్యాగాలు చెయ్యడం తెలుసు గానీ, తమపిల్లల్ని బాగుచెయ్యడం తెలువదు కదా! రైలుపట్టాల మీద చనిపోయిన పసికందుల రక్తం ఈ రాష్ట్రంలో అందరికీ ఇంగ్లీషు విద్య కోసం చిందింది. అది వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో దొరికితే కనీసం వాళ్ళ చావు ఒక సమస్యను పరిష్కరిస్తుంది.
- కంచ ఐలయ్య, సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi dated 31 July 2014

Saturday, 19 July 2014


Editorial Namasthe Telangana Logo

పోలవరంపై ఐక్య పోరాటం
Updated : 7/20/2014 1:37:57 AM
Views : 13
ది ఒడిశా మల్కానిగిరి జిల్లా పోడియ బ్లాక్ ఆదివాసీ కోయలు నివసించే ప్రాంతం. దట్టమైన అడువుల కాలిబాటలు కలెవాల్ కలెవాల్ కోయతూర్ కలెవాల్ ఆంప్‌వాల్ ఆంప్‌వాల్ పోలవరం ఆంప్‌వాల్‌అని కోయాతూర్ సమాజంలో అస్తిత్వ నినాదాలు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు ఒడిశా నుంచి కుంట (ఛత్తీస్‌గఢ్ మీదుగా భద్రాచలం వరకు తలపెట్టిన 15 రోజుల మహాపాదయాత్రలో ఒక కోయ విద్యార్థిగా, రచయితగా నేను భాగస్వామిని అయినాను. నాతోపాటు ఉస్మానియా, కాకతీయ విద్యార్థి సంఘాలు ఈ పాదయాత్ర అనుభవం నుంచి అన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాము.

పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణలో ఉంటే పాదయాత్ర ఒరిస్సా నుంచి ఎందుకు మొదలయింది అన్నప్పుడు అనేక విషయాలు బయటకొస్తాయి. కోయ సమాజాన్ని గోదావరి పరివాహక ప్రాతం ఇరువైపుల శ్రీరాంసాగర్ (మహదేవ్‌పూర్ నుంచి) ఏటూరు నాగారం, భద్రాచలం మీదుగా పశ్చిమగోదావరి పోలవరం వరకు చూడవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల జలసమాధి అయ్యేది మూడు లక్షల మంది కోయ కొండరెడ్లు. ఇది గోదావరి నదికి సంబంధించిన ముంపు. కానీ ఈ ప్రాజెక్టు వల్ల, గోదావరి నీరు కమ్ముకోవటం మూలంగా, వి.ఆర్.పురం దగ్గర విలీనమయ్యే శబరి, సీలేరు నదులు గోదావరికి తాకి వెనుకకు నీరు మళ్లటం మూలంగా మళ్లీ ఈ రెండు నదుల పరివాహక ప్రాంతంలో జలసమాధి అయ్యేది కోయ సమాజమే.

ఒడిశా ప్రభుత్వం 17 ముంపు గ్రామాలని ప్రకటించింది. కాని ఈ రెండు నదుల ఇరువైపుల సర్వే నిర్వహిస్తే 139 గ్రామాలు లక్ష జనాభా, లక్షల ఎకరాల అటవీ భూమి, వేలాది ఎకరాల పంట భూములు మునిగిపోతాయి. అయినా ఇక్కడివారికి ముంపు సంగతి తెలియదు. ప్రభుత్వం చెప్పడం లేదు. నది దాటితే కుంట (ఛత్తీస్‌గఢ్) కోయ ప్రాంతం. ఇది తెలుగు గిరిజనేతరుల వలస ప్రాంతం. ఇక్కడ 14 గ్రామాలు మునుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ 50 గ్రామాల వరకు మునుగుతాయి.

కానీ మొన్నటిదాక ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక మౌనం వహిస్తున్నది. ఆంధ్రలోని తూర్పు, పశ్చిమ గోదావరి కోయ కొండ రెడ్డిలది మరీ దారుణ సమస్య. ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాలు పోలవరం నిర్మించాలంటున్నాయి.

ఈ రాష్ర్టాల్లోని కోయ సమాజం నేడు ఒక ప్రశ్నను సంధిస్తున్నది. పూర్వం మధ్య భారతాన్ని పాలించింది గోండులు (కోయాతూర్)లు.1956లో భాషాప్రయుక్త రాష్ర్టాలు ఏర్పాటు చేసినప్పుడు- మా ప్రాంతాన్ని పరిపాలించిన చరిత్ర, భూభాగం, ప్రత్యేక భాష, సంస్కృతీ సంప్రదాయాలు కలిగివున్నాం, మాకు ప్రత్యేక రాష్ర్టం కావాలంటే బలవంతంగా విడదీసి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణలుగా విభజించారు. ఒరియా, హిందీ, తెలుగు పరాయి భాషలు రాక, మాతృ భాషలకు విలువ లేక దుర్భర స్థితిలో ఉన్నాం. ఏ రాష్ట్రం అభివృద్ధి మా దరి చేరలేదు.

అడవితల్లిని నమ్ముకొని ఎవరితో సంబంధం లేకుండా జీవిస్తున్నాం. మళ్లీ ఇప్పుడు పోలవరం పేరిట మా మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం అనంతరం ప్రత్యేక భారతం కావాలన్న ఆదివాసీలకు ప్రత్యామ్నాయ స్వయం ప్రతిపత్తి అని రాజ్యాంగంలో 5వ షెడ్యూలు మీరే చేశారు. పెసా అటవీ హక్కుల చట్టాలను చేశారు. 1/70 చట్టాన్ని మీరే చేశారు.

వాటన్నింటిని మీరే ఉల్లంఘించారు. ప్రజాస్వామ్యంలో ప్రతివ్యక్తి జీవించే హక్కును కలిగి వున్నాడు. అందుకే ఏదైనా పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగేటపుడు ఆయా ప్రాంతాల వ్యక్తులు ఆ ప్రాంతంలో జీవించే హక్కును కోల్పేయే అవకాశం ఉన్నందున, ప్రజాభిప్రాయసేకరణ జరపాలి అని రాజ్యాంగం చెబుతున్నది. కాని ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరపలేదు? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జీవనాన్నే కొల్లగొడుతున్నపుడు కోయల దారి ఎటువైపు మళ్ళుతుంది అనేది కూడా అర్థం కాని ప్రశ్న.
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపటం కలుపకపోవటం పక్కనపెడితే ఈ రెండు ప్రాంతాలతో మేము ఎటువైపు అనేది అర్థం కాక కోయ సమాజం మానసిక క్షోభను అనుభవిస్తున్నది.

విద్యార్థులకు కుల ఆదాయ నివాస ధ్రువీకరణ పత్రాల అవసరం. తహశీల్దారు ఆఫీసుకెళితే ఏ రాష్ట్రం ధ్రువీకరణ పత్రం ఇస్తాడో తెలియదు. ఏ యూనివర్సిటీలో, కళాశాలలో దరఖాస్తు చేయాలో తెలియదు. ఫీజు రియింబర్స్‌మెంటు ఎవరిస్తారు? ఉద్యోగాల కోసం ఏ రాష్ట్రంలో దరఖాస్తు చేయాలి, ఉద్యోగస్తులకు ఏ ప్రభు త్వం జీతాలిస్తుంది? బలికోరాం రండి మా రాష్ర్టానికి అని ఆంధ్రప్రాంతం పిలిచినట్టా, బలిచ్చినా ఎరుగనట్టి తెలంగాణ ప్రాంతమా అన్నట్టుగ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బలమైన పోరాటం చేయకుండా డిజైన్ మార్చాలని ఏ రంధి లేకుండా పునర్నిర్మాణం చేసుకుంటుంది.


ఇటువంటి సమయంలో కోయ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలన్నపుడు, పోలవరం ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నపుడు కొన్ని రకాల పరిష్కారాల మార్గాలను వెతుకాల్సిన అవసరం ఏర్పడింది. భారతదేశాన్నే పునర్నిర్మాణం చేసే అంత మేధోసంపత్తి తెలంగాణ మైదాన ప్రాంతంలో వున్నది. అదే నేటి తెలంగాణ రాష్ర్టాన్ని నిలబెట్టగలిగింది. ఏ రాజకీయ ఉద్యమం దీనికి కారణం కాదు. తెలంగాణ కోసం 60 ఏళ్ళు శ్రమించిన ఈ మేధో సంపత్తి పోలవరం కోసం ఆదివాసీల పక్షాన ఉపయోగపడటం లేదు.

ఆదివాసీ పోరాటానికి పదును పెట్టే ప్రయత్నం చేయడం లేదు. చరిత్రలో ఆదివాసీ పోరాటాలయిన కొమురం భీం, బిర్సాముండా, సాయం గంగులు, మన్యం పోరాటాలన్నింటిని ఆదివాసీలే నడిపినా వాటి వెనుక మైదాన ప్రాంతాల మేధావుల హస్తం కొంతమేర అయి నా వుంటుంది. అది మళ్ళీ పోలవరం ఉద్యమంతో పునరావృతమవ్వాలి.

వందలాది పాఠశాలలు, కళాశాలలు ముంపునకు గురవుతున్నందున విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ముంపు అనేది ఆదివాసీ ఉమ్మడి సంప్రదాయక జీవనవ్యవస్థతో ముడిపడి ఉన్నందున ఆదివాసీ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. 7 గ్రామాలు 8 వేల జనాభా గల పోస్కో ఉద్యమం, పోస్కో ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకుంది. ఒడిశాలోని నియంగిరి కొండల్లోని నిరక్షరాస్య కోయలు విజయం సాధించారు.

కానీ మూడు లక్షల ఆదివాసీ జనాభా, ఉద్యమ చరిత్ర, విద్యా చైతన్యం గల మనం బలమైన ఉద్యమ నిర్మా ణం ఎందుకు చేయలేక పోతున్నాం అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆదివాసీ సంఘాల మధ్య, వ్యక్తుల మధ్య వైరుధ్యాలు మనుగడకే ముప్పు తెస్తున్నాయని గ్రహించాలె. ఆదివాసీ ప్రాంతాన్ని మొత్తం ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించుకుంటున్నాం.

మాకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాకొద్దు, ఏ ప్రభుత్వాలు మాకు బువ్వపెట్టలేదు. మేము అప్పుడూ ఇప్పుడూ అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. బతుకుతాం. మమ్మల్ని ముంచాలని చూస్తే ఊరుకునేది లేదు అని బలమైన సంకేతం ఇచ్చిన రోజు ప్రభుత్వాలే ఆదివాసీల దగ్గరకి వస్తాయనేది చరిత్రలో ఆదివాసీల సంప్రదాయ పోరాటాలు నిర్థారించిన విషయం అందరికి తెలిసిందే.

http://namasthetelangaana.com/EditPage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=387599

Source  : Namaste TElangana DAted 20th July 2014
Home

అడవి చెంచుల్ని ఆదుకోవాలి - గంగాపురం లాలయ్య

Published at: Sunday  20-07-2014 01:17 AM Edit page
గిరిజన తెగలలో చెంచులు, ఎరుకలు, లంబాడీ కులాలవారు ప్రధానంగా ఉన్నారు. లంబాడీలు, ఎరుకల కులస్థులు గ్రామాలలో, మైదాన ప్రాంతాల్లో నివసిస్తుండడంతో చెంచులతో పోలిస్తే సాపేక్షంగా అభివృద్ధి చెందారు. లంబాడీలు, ఎరుకల కులస్థులను గిరిజన జాతుల్లో కలిపిన పిదప తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రల్లో వారు ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకం ఫలితాలను అందుకొని చాలా వరకు అభివృద్ధి చెందారన్నది వాస్తవం. అయితే అడవుల మధ్య, కొండల నడుమ చెంచు గూడేల్లో, పెంటల్లో ఉన్న అడవి చెంచులు నాగరికతకు దూరంగా ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పథకాలను రూపొందించి, సమర్థులైన అధికారులను నియమించి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం రూపొందించిన పథకాల ఫలితాలు వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, నల్లమల అడవి తల్లి బిడ్డలు, గిరి పుత్రులు దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బతుకంత చీకటి. నిలువ నీడలు లేవు తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు చేయడానికి పని కల్పించినపుడే చెంచులు మనలో ఒకరుగా కలసి పోగలరన్న విషయం గుర్తుంచుకొని చర్యలు తీసుకోవాలి. ఆధునిక సమాజంలో అంతరించి పోతున్న చెంచుల జనాభాను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, వారి జీవన స్థితిగతులపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి ఆ అడవి బిడ్డలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నల్లమల అడవి ప్రాంతంలో కొండల నడుమ నివసిస్తున్న చెంచులు కనీస మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్నారు. దక్షిణ భారతదేశంలో దట్టమైన అడవులుగా ప్రసిద్ధి పొందిన నల్లమల అడవులు క్షీణించడం వల్ల చెంచుల జీవనోపాధి సంక్షోభంలో పడి ంది. రెండు దశాబ్దాల క్రితం అడుగడుగున ఉన్న వృక్షాల్ని స్మగర్లు తరలించుకుని పోవడంతో అటవీ ఉత్పత్తులు లభించక, తిండి తిప్పలు నోచుకోక అల్లాడుతున్నామని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గ్రామాలకు రహదారిలో ఉన్న చెంచు గూడేల్లో కొంత అభివృద్ధి జరిగింది. అయితే గ్రామాలకు దూరంగా నల్లమల అడవి మధ్యలో కొండల నడుమ నివసిస్తున్న చెంచుల అభివృద్ధికి జరిగిన కృషి అత్యల్పం. నిరక్షరాస్యత, ఆరోగ్యం పరిశుభ్రత గురించి తెలియని ఈ చెంచులు తరచూ రోగాల బారిన పడుతున్నారు. గిరిజన స్ర్తీలు, పిల్లల్లో ఎదుగుదల లేక రక్తహీనతతో బాధపడుతున్నారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం దశాబ్దాలుగా వందలాది కోట్లు నిధులు మంజూరు చేసినా వాటిలో నామమాత్రంగానైనా చెంచుల అభివృద్ధికి చేరుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిథులు, దళారులు ఆ నిధుల్ని భుక్తం చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధి పేరుతో మంజూరయ్యే కోట్లాది రూపాయలను ఆయా అధికారులు వెనకేసుకుంటున్నారు. అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్న వారిని ఏకంగా అటవీ ప్రాంతాల నుంచి తరలించడంలో ప్రభుత్వం విఫలమైంది. అయితే అటవీ ఉత్పత్తులు తగ్గిపోవడంతో బతుకుదెరువు కోసం వలస బాటనే ఎంచుకుంటున్నారు. 1983లో పులుల అభయారణ్యంగా ప్రకటించారు. అయితే ఆ అభయారణ్యం నుంచి పులులు బయటికి వచ్చి గ్రామాలపై దాడి చేసి పశువులను కబళించడమే కాక, మనుషులపై కూడా దాడికి తెగబడుతున్నాయి. పులివాత పడి చనిపోయినవారికి ప్రభుత్వం నామమాత్రంగా చెల్లించడంతో ఎంతో మంది చికిత్స పొందుతూనే చనిపోయారు. వేల రూపాయలు విలువ చేసే పశువులు పులి దాడిలో చనిపోయిన సందర్భాల్లో ప్రభుత్వం నామమాత్ర నష్టపరిహారం ఇస్తోంది. దాంతో ఎంతో మంది ఆదివాసులు, అడవి అంచు గ్రామాల్లోని రైతులు వ్యవసాయం మానుకొన్న ఘటనలు అనేకం. చెంచులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం. గిరిజన జాతుల్లో లంబాడీ, ఎరుకలి కులాలవారు చాలావరకు సాంఘికంగా, ఆర్థికంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఎదిగారు. ఈ నేపథ్యంలో చెంచుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించింది.
ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అమాయక చెంచులకు అందేలా ప్రభుత్వం డెలివరీ మెకానిజంను రూపొందించాలి. కొత్త ప్రభుత్వంపై అడవి చెంచులు కోటి ఆశలు పెట్టుకొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రలలో చెంచుల పిల్లలను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు 89 కేంద్రాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లమల అడవుల్లోని పెంటలు, గ్రామాలు, మైదాన ప్రాంతాలలో నివాసం ఉంటున్న చెంచులు ఉపాధి పనులకు వెళ్ళటం, గ్రామాల్లో కూలీలకు వెళ్ళేటపుడు వారి పిల్లల్ని చూసుకునే వారు లేరు. దీంతో వారిని సంరక్షించేందుకు ప్రభుత్వం గత నెల 15న, జీవో 17 విడుదల చేసింది. పుట్టిన ఆరు నెలల పాప నుంచి ఆరేళ్ళ పిల్లల వరకు కేంద్రాలలో సంరక్షించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేస్తూ, సంరక్షణ కోసం ఒక మహిళని నియమించనున్నారు. మహిళకు నెలకు వేతనాన్ని చెల్లించి నియమించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి కొందరు అప్పుడప్పుడు చెంచు గూడేలకు వెళ్తున్నప్పటికీ గిరిజనులకు మాత్రం ఆశించిన స్థాయిలో నాగరికత అబ్బలేదు. ఈ చెంచులకు శాశ్వతగృహాలను నిర్మించడం జరుగుతున్నా సుదూరంగా ఉండే వారికి ఈ సదుపాయం కల్పించడానికి ఇంతవరకు అధికారులు కృషి చేయలేదు. అందువల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పుకు అవకాశం లేకుండా పోయింది. ఉపాధి కల్పన పథకాలలో వీరికి తగిన ప్రోత్సాహం కనిపించడంలేదు. వ్యవసాయ బావులు తవ్వించడం, వ్యవసాయానికి ఎడ్లబండ్లను ఇవ్వడంలోను అడవి చెంచులకు అన్యాయం జరుగుతోంది. అధికారుల దృష్టి అంతా గ్రామాల్లోనూ, అందులోను రహదార్లకు దగ్గర ఉండే వారిపైనే ఉందనడంలో సందేహం లేదు. క్రూర మృగాల సంరక్షణ ప్రాంతాల్లో చెంచు గిరిజన గూడేలు అనాదిగా ఉన్నాయి. అంటే క్రూర మృగాల సంఖ్య పెరగడం వల్ల వారందరిని తరలించి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. అటవీ ప్రాంతాల్లోని పెద్ద గ్రామాల పరిధిలో గిరిజనులకు గృహాలని నిర్మించాలని ప్రభుత్వ సంకల్పించినా, వారు మాత్రం పెద్ద గ్రామాలలో నివసించడానికి ఇష్టపడటంలేదు. అడవిలో చెంచులు మంచినీటి కోసం గూడెం నుంచి కనీసం మూడు కిలోమీటర్లు దూరం నడచి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రభుత్వం వారి మంచినీటి అవసరాలను తీర్చేందుకు ఎలాంటి సదుపాయాలు కల్పించక పోవడం దురదృష్టకరం. గిరిజనుల అభివృద్ధికి కోసం కేటాయిస్తున్న నిధులు ఖర్చు చేయకపోవడంతో తరచూ మురిగిపోతున్నాయి. గ్రామాలకు దగ్గరగా ఉన ్న చెంచులలో కొంత నాగరికత కనిపించినా, సుదూరంగా అడవుల్లో నివసించే వారు బాగా వెనకబడి ఉన్నారు. ఆదివాసుల కోసం రూపొందించే ఏ పథకమైనా వారికి అందుబాటులోకి వచ్చే విధంగా రూపొందించాలి. గిరిజనులకు పునారావాసాలను కేవలం అడవులకు పరిమితం చేయకుండా అవసరమైతే సాధారణ జనావాసాలకు చేరువగా నిర్మించి వారి అభ్యున్నతికి రెండు తెలుగు రాషా్ట్రలు కృషిచేయాలి.
గంగాపురం లాలయ్య
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
http://www.andhrajyothy.com/node/114995

Tuesday, 15 July 2014

NEW TRIBES of Andhra pradesh

Return to frontpage



Kayitha Lambadas celebrate new status

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/kayitha-lambadas-celebrate-new-status/article6121756.ece
PRINT   ·   T  T  

People of the rare tribal group found in two districts included in STs

ELATED:A rare tribal community, Kayitha Lambadas, at a tribal hamlet in Nizamabad district.– Photo: K.V. Ramana
ELATED:A rare tribal community, Kayitha Lambadas, at a tribal hamlet in Nizamabad district.– Photo: K.V. Ramana
People of the rare tribal group, Kayitha Lambadas also known as Mathura Lambadas, numbering a few thousand and scattered in Gandhari, Lingampet, Bichkunda and Jukkal mandals in the district, are happy over the government’s decision to include them in the Schedule Tribe category.
The promise made by the government it is believed will benefit them in the future as they being under BC “D” category all these years they had lost all opportunities in education and employment. As they were not in the ST category like the Lambadas or Banjaras, there was no improvement in their literacy level or employment among them.
Low literacy level
The literacy percentage among them is just 10 to 15 per cent, which is far below the literacy level of Lambadas, while the government employment is almost dismal.
Though their literacy level is poor they are financially sound, which is why they were converted into BC category in the early 80s. Since then, they have been demanding that they be given the previous status of STs. Rajiv Gandhi and Y.S. Rajasekhara Reddy had assured them of restoring their old social status, but to no avail.
Confined to Nizamabad and Adilabad districts they live around hills for greener pastures as they are predominantly cattle grazers.
They are basically vegetarians and shun liquor and celebrate festivals relating to Lord Krishna in a grand way as they feel as they are his descendants.
They were denied admission to tribal residential schools as they were not considered to be tribals. However, on the request of local people, about 70 Kayitha Lambada children were admitted to the tribal welfare hostel at Shivanur in Jukkal mandal, according to Chandrashekar, an employee in the department.
Lack of data
Interestingly, there is no demographic data of this community either with tribal welfare or BC welfare department. Among 1.89 lakh tribal population in the district as per the 2011 census the Kayitha Lambadas are hardly 4,000 in number. They are in a couple of thousands only in Gandhari mandal, says P. Jagadeeswar Reddy, the DTWO.“We did not receive any application for any benefit from them. In my 16-year stint in the department I have not seen a single Kayitha Lambada person coming for assistance,” said V. Ramesh, office superintendent at district BC welfare office.
TDP leader Badya Nayak is of the view that the government’s decision would certainly improve their socio economic conditions.

ప్రభుత్వ స్కూల్‌ టీచర్స్‌ ఏం చెయ్యాలి? -కంచ ఐలయ్య

Published at: 15-07-2014 02:11 AM Andhra Jyothi Edit page
ఎంత తెలివైన అధికారైనా విద్యారంగం గురించి టీచర్ల కంటే ఎక్కువ ఆలోచిస్తాడని నేను అనుకోను. విద్యారంగం సెల్ఫ్‌ డిసిప్లినరీ రంగం. అధికార దండం దానిపై అంతగా పని చెయ్యదు. అందుకు మొత్తం ఉపాధ్యాయ రంగం,        మేధావులు (వారే రంగంలో ఉన్నా) స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సంపూర్ణ మార్పును ఎలా చెయ్యాలో చర్చించాలి.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానంపై చర్చ ఇంకా తీవ్రతరం కావలసి ఉంది. ఇప్పడున్న తెలుగు మీడియం నుంచి ప్రభుత్వం ప్రామీజ్‌ చేసిన కేజీ టు పీజీ ఇంగ్లీష్‌ మీడియంలోకి ఈ స్కూళ్ళను ఎలా మార్చాలి అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు ఈ అంశంపై ఇంకా చర్చకు పూనుకోలేదు. బహుశా వారి దృష్టిలో ఇది అయ్యేదా పొయ్యేదా, మమ్మల్ని కాదని ఎలా చేస్తారు అనే భావన ఉండవచ్చు లేదా దాన్ని మేం ఆపగలమనే భావన ఉండవచ్చు. అటువంటి ఆలోచన ఉంటే మాత్రం అది తెలంగాణ ప్రజల అభివృద్ధిని వ్యతిరేకించే ఆలోచన. తెలంగాణలో ఆధునిక ఆంగ్ల విద్య, ఆ విద్యతో వచ్చే అవకాశాలు తప్ప, మరో అవకాశాలు లేని ప్రజలు చాలా మంది ఉన్నారు. దాదాపు అగ్రకులాల్లో ఎక్కువ మంది తమ పిల్లల్ని ఇప్పటికే ఇంగ్లీషు మీడియంలో చదివించుకుంటున్నారు. వీళ్ళే ప్రభుత్వ విద్యారంగాన్ని ఇంగ్లీషు మీడియంలోకి మార్చడానికి వ్యతిరేకిస్తే వారి ప్రేమ తెలంగాణపై ఎటుంవంటిదో తెలిసిపోతుంది.
ఈ మధ్య తెలంగాణలోని గురుకుల ఉపాధ్యాయులు తమపై ఒక అధికారి చాలా వత్తిళ్లు తెస్తున్నాడని, స్కూళ్ళకు రాని రోజులకు జీతం ఆపుతున్నాడని రోడ్డెక్కారు. గురుకుల స్కూళ్లన్నీ రెసిడెన్షియల్‌ స్కూళ్ళు. ఆ స్కూళ్ళలో వర్కింగ్‌ దినాల్లో టీచర్లు అక్కడే ఉండాలి. కానీ టీచర్లు దూర, దూరాల్లో ఉంటూ, ఆలస్యంగా స్కూళ్ళ కు వస్తారనే ఆరోపణ చాలా కాలం నుంచి ఉంది. రాష్ట్ర ంలో అత్యున్నత ప్రభుత్వ రంగ విద్యారంగం ఇది. ఈ రంగం సరిగా పనిచెయ్యక పోవడం వల్లనే తెలంగాణ విద్యా విధానం బాగా దెబ్బతిని ఉన్నది. స్కూల్‌ టీచర్లలో ఎక్కువ మంది తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు, అదొక సాకుగా చూపించి అర్థ విద్యాబోధన విధానాన్ని అవలంభించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆ రంగాన్ని గాడిన పెట్టడం అంత సులభం కాదు. టీచర్‌ సంస్థలు, ప్రజా సంఘాలు వారి వేతనాలు, స్కూళ్ళ పరిస్థితులు, ట్రాన్స్‌ఫర్లు, ఇంక్రిమెంటు మొదలగు వాని చుట్టూ కేంద్రీకరించాయి కానీ, బోధనా బాధ్యత మీద ఎన్నడూ కేంద్రీకరించలేదు. ఇది దేశం మొత్తం మీద ఉన్న పరిస్థితి కూడా.
టీచరు తమ పిల్లల్ని తమ కంటే చాలా తక్కువ జీతాలతో పనిచేసే ప్రైవేటు టీచర్లు పాఠాలు చెప్పే ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళకు పంపుతారు. కానీ తామే ప్రభుత్వ విద్యా విధానం ఇంగ్లీషు మీడియానికి మారే ప్రక్రియను చాలా బలంగా వ్యతిరేకిస్తారు. దీనికి తమ పిల్లల్ని ఇంకా పెద్ద స్కూళ్ళలో చదివించే ‘పెద్ద’ మేధావి వర్గపు మద్దతు కూడా ఉంటుంది. ఇదొక ప్రమాదకరమైన హిపొక్రటిక్‌ వర్గం. దీన్ని సిద్ధాంత రీత్యా తిప్పికొట్టడం ఒక పెద్ద సమస్య. యూనిఫాం విద్యా విధానం గురించి మాట్లాడేవారిని వీళ్ళు చాలా సులభంగా ఐసలోట్‌ చెయ్యగలరు. మీడియా కూడా వీరికి అండగా ఉంటుంది.
మార్క్సిస్టు మావోయిస్టు ఉద్యమాల నుంచి వచ్చినవారు కూడా టీచర్‌ సౌకర్యాల మీద చర్చించినంతగా విద్యా బోధన మీదగానీ, మీడియం మీద గానీ చర్చించరు. వీళ్ళంతా ప్రైవేటు రంగాన్ని వ్యతిరేకిస్తారు, ప్రభుత్వ రంగం పెరగాలంటారు కానీ తమ పిల్లల్ని ప్రైవేట్‌ రంగంలో చదివిస్తారు. తమకు రోగమొస్తే ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయిస్తారు. ఈ ధోరణి ప్రభుత్వ రంగానికి ఎంత ద్రోహం చేస్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. విద్యారంగంలో ప్రభుత్వ-ప్రైవేటు వ్యత్యాసాన్ని రూపుమాపకుండా హిపొక్రటిక్‌ ప్రాక్టీస్‌కు అడ్డుకట్టబడదు. దీనికి ప్రభుత్వ- ప్రైవేట్‌ స్కూల్‌ను సమ-మీడియం, సమ-సిలబస్‌, సమతుల్య జీతాలు, సమతుల్య సౌకర్యాలు ఏర్పర్చకుండా ఏ రాష్ట్రం బాగుపడదు. తెలంగాణ వంటి విద్యా వెనుకబాటుతనం గల రాష్ట్రం అసలే బాగుపడదు. దీనికి పరిష్కారం కేజీ టు పీజీ ఇంగ్లీషు మీడియం విద్యావిధానం ప్రభుత్వ టీచర్లు, వాళ్ళ సంఘాలు ఒక బలమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం పట్టుదలతో అమలు చెయ్యాల్సి ఉంటుంది. పోతే ఉపాధ్యాయులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కనుక, వారు ఎన్నికల రంగంలో ఒక కీలక పాత్ర నిర్వహిస్తారు గనుక వారు వ్యతిరేకిస్తే ఇప్పుడు అమలులోకి రానున్న కేజీ టు పీజీ ఇంగ్లీష్‌ విద్యా విధానాన్ని ప్రభుత్వం ఆపేసే అవకాశముంది. తమ ఉద్యోగ ధర్మమొకటి తప్ప మిగతా చాలా పనులు చేసి పలుకుబడిగలవారు, ఎమ్మెల్సీలో, నాయకులు అయినవారు మన విద్యా సంస్థల్లో చాలా మంది ఉన్నారు. వీరిని చర్చల ద్వారా, రాతల ద్వారా, వాదనల ద్వారా మార్చడం చాలా కష్టం. వారి పద్ధతులను వ్యవస్థ మార్పుల ద్వారా అరికట్టాల్సిందే.
స్కూలు వ్యవస్థలో ఎటువంటి మార్పుల చెయ్యాలో ప్రైవేటీకరణ పరుగులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నది. ఈ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా (ఇప్పటికీ అనధికారికంగా) పనిచేస్తున్న ప్రొఫెసర్‌ అరవింద పనగారియా, ఈ మధ్య ‘ఇండియా టుడే’లో రాసిన వ్యాసంలో ఒక మార్గాన్ని సూచించాడు. ఆయన ఆలోచన ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళు భారత దేశంలో సరిగా పనిచెయ్యడం లేదు కనుక (ఈయన అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఉంటాడు) ప్రభుత్వ స్కూళ్ళను క్రమంగా ప్రైవేటు రంగంలోకి మార్చాలి. మొదటి దశలో బీద కుటుంబాలన్నిటికీ ‘విద్యా కూపన్లు’ ఇచ్చి, తల్లిదండ్రులను తమకు నచ్చిన స్కూళ్ళలో చదివించుకునే అవకాశం ఇవ్వాలి. ఈ పద్ధతి అమెరికాలో కూడా పెట్టాలని రిపబ్లికన్లు వాదిస్తున్నారు. ఒబామా ఈ మధ్య దాని గురించి ఆలోచిస్తానని చెప్పారు కూడా. దీనర్థమేమంటే కూపన్ల ద్వారా బీద పిల్లలకు స్కూల్‌ ఫీజ్‌, పుస్తకాలు, బట్టల ఖర్చులకు ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. ప్రజలు వారి పిల్లల్ని ఇప్పుడు చదివించే స్కూళ్ళను క్రమంగా ప్రైవేటీకరించవచ్చు లేదా మూసివేయవచ్చు.
తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికే ఆంధ్ర గ్రామాల కంటే ఎక్కువ ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ స్కూళ్ళు సరిగా పనిచెయ్యనందున అవి ఇంకా పెరిగాయి. అవి మంచిదో చెడ్డదో ఇంగ్లీషు-కొన్ని తెలుగు మీడియంలో ఉన్నాయి. ఈ కూపన్ల సిస్టమ్‌ ఈ దేశంలో వస్తే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకు పోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ (ఎక్కువగా వీరే ఆ స్కూళ్ళలో ఉన్నారు కనుక) కూపన్లను ఉపయోగించుకొని, తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళకు తోలుకుంటారు. దీనికి అడ్డుకట్ట వెయ్యాలంటే ప్రభుత్వ స్కూళ్ళను ఇంగ్లీషు మీడియంలోకి మార్చి టీచర్లను నిబద్ధీకరించడం తప్ప మరో మార్గం లేదు. టీచర్లు ఇతర మేధావులు విద్యావ్యవస్థను మార్చడం గురించి ఆలోచించకుండా మరో మార్గం లేదు.
ప్రొఫెసర్‌ అరవింద్‌ వాదన ప్రకారం యూనివర్సిటీలను కూడా క్రమంగా ప్రైవేటీకరించాలి. ఆయన యూజీసీనే రద్దు చేయమని మోదీ ప్రభుత్వానికి రెకమెండ్‌ చేశారు. అంటే మొత్తం విద్యారంగాన్ని ప్రైవేటు సెక్టారుకు ఒప్పజెప్పే తీవ్ర ప్రయత్నమొకటి జరుగుతున్నది. ఈ దశలో అన్ని స్థాయిల ఉపాధ్యాయ వర్గం ఇప్పుడున్న పని తీరును, స్టాండర్డ్స్‌ను ఒక ఉద్యమంగా మార్చకుండా ప్రభుత్వ విద్యారంగం బతకదు. ఇక్కడే టీచర్లు సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరమున్నది. ఇప్పుడు ప్రభుత్వ రంగంలోని టీచర్ల వేతనాలకీ, ప్రైవేటు రంగంలోని టీచర్ల వేతనాలకీ ఎంత తేడా ఉందో ఆలోచించాలి. జీతాలెక్కవ ఉన్న దగ్గర స్టాండర్డ్స్‌ ఎక్కువ ఉండాలి. ఎక్కువ పని గంటలుండాలి. అప్పుడే ప్రభుత్వ రంగం బతుకుతుంది.
ఇదేమీ ఆలోచించకుండా మమ్మల్ని తెలుగు మీడియంలో చెప్పేందుకు మాత్రమే రిక్రూట్‌ చేశారు. మేం ఇంగ్లీషు మీడియంలో చెప్పం. పాత కాలంలో మా పని గంటలు ఇలా ఉండేవి అలా తప్ప మరో రకం పని విధానాన్ని అలవర్చుకోము అనేది ఇప్పుడున్న ఆలోచన ప్రక్రియ ఆత్మహత్య ప్రక్రియేకాని మార్పు ప్రక్రియ కాదు. ఉద్యమం పేరుతో కొంతమంది రోజూ రోడ్లమీద ఉపన్యసించడం మానేసి తమ మార్పు ఆలోచన ఏదో రాసి, చర్చకు పెడితే మంచిది. నేను చెప్పేది విద్యారంగంలో పనిచేసే అధికారులను నియంతలుగా మార్చడానికి ఏ విధంగానూ దోహదపడదు. ఎంత తెలివైన అధికారైనా విద్యారంగం గురించి టీచర్ల కంటే ఎక్కువ ఆలోచిస్తాడని నేను అనుకోను. విద్యారంగం సెల్ఫ్‌ డిసిప్లినరీ రంగం. అధికార దండం దానిపై అంతగా పని చెయ్యదు. అందుకు మొత్తం ఉపా ధ్యాయ రంగం, మేధావులు (వారే రంగంలో ఉన్నా) స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సంపూర్ణ మార్పును ఎలా చెయ్యాలో చర్చించాలి.
ప్రభుత్వం కేజీ టు పీజీ ఇంగ్లీష్‌ విద్య అనేది ఒక పాలసీ నిర్ణయం మాత్రమే. దానికి డబ్బు కేటాయించడం, సౌకర్యాలు కల్పించడం చెయ్యాలి. కానీ టీచర్లు ఈ రంగాన్ని ఒక ఉద్యమంగా మార్చడానికి మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో టీచర్ల ట్రేడ్‌ యూనియనిజం ద్వారా రాష్ర్టాన్ని మార్చలేం. టీచర్‌ క్రియేటివిటీ ద్వారానే మార్చగులుగుతాం. ముందు, ముందు దేశంలో వచ్చే విద్యా మార్పులకు ఇక్కడి నుంచి మనమొక మార్గం చూపించవచ్చు. ఎటు వంటి పాఠాలు చెబితే గ్రామీణ ప్రాంతంలో క్రియేటివిటీ పెరగుతుందో ఆలోచించి, టీచర్లు తమంతట తాము పాఠాలు రాయాలి. మొత్తం విద్యా రంగంలో శ్రమ గౌరవ పాఠాలు చెప్పడం చాలా ముఖ్యం, దానికి ఇప్పుడున్న చాలా వృత్తులకు లేని గౌరవాన్ని, స్కూళ్ళో గౌరవం కలిపించే విధంగా పాఠాలు తయారు చేసుకోవడం అవసరం. టీచర్‌ పిల్లలకు ఒక్క సిలబస్‌ మాత్రమే చెప్పక్కర్లేదు. సిలబస్‌కు బయట ఎన్నో కొత్త పాఠాలు వారిచే చదివించవచ్చు. ప్రతి టీచర్‌ ఇంట్లో ఒక స్వంత లైబ్రరీ పెట్టుకోవడం చాలా ముఖ్యం. టీచర్‌ వ్యక్తిత్వం, ఆయన ఇంటి వాతావరణం, క్లాసులో ఆయనకున్న విశాల జ్ఞానం విద్యార్థుల్ని చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా స్కూల్‌ టీచర్లు పుస్తకాల్లో ఉన్న పాఠాలను చదివి మాత్రమే వినిపిస్తారు. దానికి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషుకు మారుతున్నప్పుడు తనకు ఇప్పుడున్న ఇంగ్లీషు జ్ఞానానికి అదనపు పదకోశాన్ని చేర్చుకుంటే సరిపోతుంది. అసలు మీడియం విషయంలో భయపడడమనేది సరికాదు. ఇంగ్లీషు ఏ టీచర్‌కు రాని భాషకాదు. చెయ్యాల్సిందల్లా దానిపై కేంద్రీకరించడమే.
ప్రతి టీచర్‌ వారానికి రెండు మూడు వ్యాసాలు, సంవత్సరానికి రెండు కొత్త పుస్తకాలు చదవడం చాలా అవసరం. చదివే అలవాటు లేనప్పుడు కొత్త జ్ఞానం నేర్చుకోవడం కష్టం. అప్పుడే తమపై అజమాయిషీ వహించే అధికారి కన్నా తాము గొప్ప వారమనే భావన వారిలో ఉంటుంది. అప్పుడు అధికారే టీచర్‌కి భయపడుతాడు.
-కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త