ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఏం చెయ్యాలి? -కంచ ఐలయ్య
ఎంత తెలివైన అధికారైనా విద్యారంగం గురించి టీచర్ల కంటే ఎక్కువ ఆలోచిస్తాడని నేను అనుకోను. విద్యారంగం సెల్ఫ్ డిసిప్లినరీ రంగం. అధికార దండం దానిపై అంతగా పని చెయ్యదు. అందుకు మొత్తం ఉపాధ్యాయ రంగం, మేధావులు (వారే రంగంలో ఉన్నా) స్కూల్ ఎడ్యుకేషన్ సంపూర్ణ మార్పును ఎలా చెయ్యాలో చర్చించాలి.
కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానంపై చర్చ ఇంకా తీవ్రతరం కావలసి ఉంది. ఇప్పడున్న తెలుగు మీడియం నుంచి ప్రభుత్వం ప్రామీజ్ చేసిన కేజీ టు పీజీ ఇంగ్లీష్ మీడియంలోకి ఈ స్కూళ్ళను ఎలా మార్చాలి అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాలు ఈ అంశంపై ఇంకా చర్చకు పూనుకోలేదు. బహుశా వారి దృష్టిలో ఇది అయ్యేదా పొయ్యేదా, మమ్మల్ని కాదని ఎలా చేస్తారు అనే భావన ఉండవచ్చు లేదా దాన్ని మేం ఆపగలమనే భావన ఉండవచ్చు. అటువంటి ఆలోచన ఉంటే మాత్రం అది తెలంగాణ ప్రజల అభివృద్ధిని వ్యతిరేకించే ఆలోచన. తెలంగాణలో ఆధునిక ఆంగ్ల విద్య, ఆ విద్యతో వచ్చే అవకాశాలు తప్ప, మరో అవకాశాలు లేని ప్రజలు చాలా మంది ఉన్నారు. దాదాపు అగ్రకులాల్లో ఎక్కువ మంది తమ పిల్లల్ని ఇప్పటికే ఇంగ్లీషు మీడియంలో చదివించుకుంటున్నారు. వీళ్ళే ప్రభుత్వ విద్యారంగాన్ని ఇంగ్లీషు మీడియంలోకి మార్చడానికి వ్యతిరేకిస్తే వారి ప్రేమ తెలంగాణపై ఎటుంవంటిదో తెలిసిపోతుంది.
ఈ మధ్య తెలంగాణలోని గురుకుల ఉపాధ్యాయులు తమపై ఒక అధికారి చాలా వత్తిళ్లు తెస్తున్నాడని, స్కూళ్ళకు రాని రోజులకు జీతం ఆపుతున్నాడని రోడ్డెక్కారు. గురుకుల స్కూళ్లన్నీ రెసిడెన్షియల్ స్కూళ్ళు. ఆ స్కూళ్ళలో వర్కింగ్ దినాల్లో టీచర్లు అక్కడే ఉండాలి. కానీ టీచర్లు దూర, దూరాల్లో ఉంటూ, ఆలస్యంగా స్కూళ్ళ కు వస్తారనే ఆరోపణ చాలా కాలం నుంచి ఉంది. రాష్ట్ర ంలో అత్యున్నత ప్రభుత్వ రంగ విద్యారంగం ఇది. ఈ రంగం సరిగా పనిచెయ్యక పోవడం వల్లనే తెలంగాణ విద్యా విధానం బాగా దెబ్బతిని ఉన్నది. స్కూల్ టీచర్లలో ఎక్కువ మంది తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు, అదొక సాకుగా చూపించి అర్థ విద్యాబోధన విధానాన్ని అవలంభించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆ రంగాన్ని గాడిన పెట్టడం అంత సులభం కాదు. టీచర్ సంస్థలు, ప్రజా సంఘాలు వారి వేతనాలు, స్కూళ్ళ పరిస్థితులు, ట్రాన్స్‌ఫర్లు, ఇంక్రిమెంటు మొదలగు వాని చుట్టూ కేంద్రీకరించాయి కానీ, బోధనా బాధ్యత మీద ఎన్నడూ కేంద్రీకరించలేదు. ఇది దేశం మొత్తం మీద ఉన్న పరిస్థితి కూడా.
టీచరు తమ పిల్లల్ని తమ కంటే చాలా తక్కువ జీతాలతో పనిచేసే ప్రైవేటు టీచర్లు పాఠాలు చెప్పే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకు పంపుతారు. కానీ తామే ప్రభుత్వ విద్యా విధానం ఇంగ్లీషు మీడియానికి మారే ప్రక్రియను చాలా బలంగా వ్యతిరేకిస్తారు. దీనికి తమ పిల్లల్ని ఇంకా పెద్ద స్కూళ్ళలో చదివించే ‘పెద్ద’ మేధావి వర్గపు మద్దతు కూడా ఉంటుంది. ఇదొక ప్రమాదకరమైన హిపొక్రటిక్ వర్గం. దీన్ని సిద్ధాంత రీత్యా తిప్పికొట్టడం ఒక పెద్ద సమస్య. యూనిఫాం విద్యా విధానం గురించి మాట్లాడేవారిని వీళ్ళు చాలా సులభంగా ఐసలోట్ చెయ్యగలరు. మీడియా కూడా వీరికి అండగా ఉంటుంది.
మార్క్సిస్టు మావోయిస్టు ఉద్యమాల నుంచి వచ్చినవారు కూడా టీచర్ సౌకర్యాల మీద చర్చించినంతగా విద్యా బోధన మీదగానీ, మీడియం మీద గానీ చర్చించరు. వీళ్ళంతా ప్రైవేటు రంగాన్ని వ్యతిరేకిస్తారు, ప్రభుత్వ రంగం పెరగాలంటారు కానీ తమ పిల్లల్ని ప్రైవేట్ రంగంలో చదివిస్తారు. తమకు రోగమొస్తే ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయిస్తారు. ఈ ధోరణి ప్రభుత్వ రంగానికి ఎంత ద్రోహం చేస్తుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. విద్యారంగంలో ప్రభుత్వ-ప్రైవేటు వ్యత్యాసాన్ని రూపుమాపకుండా హిపొక్రటిక్ ప్రాక్టీస్‌కు అడ్డుకట్టబడదు. దీనికి ప్రభుత్వ- ప్రైవేట్ స్కూల్‌ను సమ-మీడియం, సమ-సిలబస్, సమతుల్య జీతాలు, సమతుల్య సౌకర్యాలు ఏర్పర్చకుండా ఏ రాష్ట్రం బాగుపడదు. తెలంగాణ వంటి విద్యా వెనుకబాటుతనం గల రాష్ట్రం అసలే బాగుపడదు. దీనికి పరిష్కారం కేజీ టు పీజీ ఇంగ్లీషు మీడియం విద్యావిధానం ప్రభుత్వ టీచర్లు, వాళ్ళ సంఘాలు ఒక బలమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వం పట్టుదలతో అమలు చెయ్యాల్సి ఉంటుంది. పోతే ఉపాధ్యాయులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు కనుక, వారు ఎన్నికల రంగంలో ఒక కీలక పాత్ర నిర్వహిస్తారు గనుక వారు వ్యతిరేకిస్తే ఇప్పుడు అమలులోకి రానున్న కేజీ టు పీజీ ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రభుత్వం ఆపేసే అవకాశముంది. తమ ఉద్యోగ ధర్మమొకటి తప్ప మిగతా చాలా పనులు చేసి పలుకుబడిగలవారు, ఎమ్మెల్సీలో, నాయకులు అయినవారు మన విద్యా సంస్థల్లో చాలా మంది ఉన్నారు. వీరిని చర్చల ద్వారా, రాతల ద్వారా, వాదనల ద్వారా మార్చడం చాలా కష్టం. వారి పద్ధతులను వ్యవస్థ మార్పుల ద్వారా అరికట్టాల్సిందే.
స్కూలు వ్యవస్థలో ఎటువంటి మార్పుల చెయ్యాలో ప్రైవేటీకరణ పరుగులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నది. ఈ ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా (ఇప్పటికీ అనధికారికంగా) పనిచేస్తున్న ప్రొఫెసర్ అరవింద పనగారియా, ఈ మధ్య ‘ఇండియా టుడే’లో రాసిన వ్యాసంలో ఒక మార్గాన్ని సూచించాడు. ఆయన ఆలోచన ప్రకారం ప్రభుత్వ స్కూళ్ళు భారత దేశంలో సరిగా పనిచెయ్యడం లేదు కనుక (ఈయన అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఉంటాడు) ప్రభుత్వ స్కూళ్ళను క్రమంగా ప్రైవేటు రంగంలోకి మార్చాలి. మొదటి దశలో బీద కుటుంబాలన్నిటికీ ‘విద్యా కూపన్లు’ ఇచ్చి, తల్లిదండ్రులను తమకు నచ్చిన స్కూళ్ళలో చదివించుకునే అవకాశం ఇవ్వాలి. ఈ పద్ధతి అమెరికాలో కూడా పెట్టాలని రిపబ్లికన్లు వాదిస్తున్నారు. ఒబామా ఈ మధ్య దాని గురించి ఆలోచిస్తానని చెప్పారు కూడా. దీనర్థమేమంటే కూపన్ల ద్వారా బీద పిల్లలకు స్కూల్ ఫీజ్, పుస్తకాలు, బట్టల ఖర్చులకు ప్రభుత్వం డబ్బు ఇస్తుంది. ప్రజలు వారి పిల్లల్ని ఇప్పుడు చదివించే స్కూళ్ళను క్రమంగా ప్రైవేటీకరించవచ్చు లేదా మూసివేయవచ్చు.
తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికే ఆంధ్ర గ్రామాల కంటే ఎక్కువ ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయి. గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ స్కూళ్ళు సరిగా పనిచెయ్యనందున అవి ఇంకా పెరిగాయి. అవి మంచిదో చెడ్డదో ఇంగ్లీషు-కొన్ని తెలుగు మీడియంలో ఉన్నాయి. ఈ కూపన్ల సిస్టమ్ ఈ దేశంలో వస్తే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళకు పోతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ (ఎక్కువగా వీరే ఆ స్కూళ్ళలో ఉన్నారు కనుక) కూపన్లను ఉపయోగించుకొని, తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్ళకు తోలుకుంటారు. దీనికి అడ్డుకట్ట వెయ్యాలంటే ప్రభుత్వ స్కూళ్ళను ఇంగ్లీషు మీడియంలోకి మార్చి టీచర్లను నిబద్ధీకరించడం తప్ప మరో మార్గం లేదు. టీచర్లు ఇతర మేధావులు విద్యావ్యవస్థను మార్చడం గురించి ఆలోచించకుండా మరో మార్గం లేదు.
ప్రొఫెసర్ అరవింద్ వాదన ప్రకారం యూనివర్సిటీలను కూడా క్రమంగా ప్రైవేటీకరించాలి. ఆయన యూజీసీనే రద్దు చేయమని మోదీ ప్రభుత్వానికి రెకమెండ్ చేశారు. అంటే మొత్తం విద్యారంగాన్ని ప్రైవేటు సెక్టారుకు ఒప్పజెప్పే తీవ్ర ప్రయత్నమొకటి జరుగుతున్నది. ఈ దశలో అన్ని స్థాయిల ఉపాధ్యాయ వర్గం ఇప్పుడున్న పని తీరును, స్టాండర్డ్స్‌ను ఒక ఉద్యమంగా మార్చకుండా ప్రభుత్వ విద్యారంగం బతకదు. ఇక్కడే టీచర్లు సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరమున్నది. ఇప్పుడు ప్రభుత్వ రంగంలోని టీచర్ల వేతనాలకీ, ప్రైవేటు రంగంలోని టీచర్ల వేతనాలకీ ఎంత తేడా ఉందో ఆలోచించాలి. జీతాలెక్కవ ఉన్న దగ్గర స్టాండర్డ్స్ ఎక్కువ ఉండాలి. ఎక్కువ పని గంటలుండాలి. అప్పుడే ప్రభుత్వ రంగం బతుకుతుంది.
ఇదేమీ ఆలోచించకుండా మమ్మల్ని తెలుగు మీడియంలో చెప్పేందుకు మాత్రమే రిక్రూట్ చేశారు. మేం ఇంగ్లీషు మీడియంలో చెప్పం. పాత కాలంలో మా పని గంటలు ఇలా ఉండేవి అలా తప్ప మరో రకం పని విధానాన్ని అలవర్చుకోము అనేది ఇప్పుడున్న ఆలోచన ప్రక్రియ ఆత్మహత్య ప్రక్రియేకాని మార్పు ప్రక్రియ కాదు. ఉద్యమం పేరుతో కొంతమంది రోజూ రోడ్లమీద ఉపన్యసించడం మానేసి తమ మార్పు ఆలోచన ఏదో రాసి, చర్చకు పెడితే మంచిది. నేను చెప్పేది విద్యారంగంలో పనిచేసే అధికారులను నియంతలుగా మార్చడానికి ఏ విధంగానూ దోహదపడదు. ఎంత తెలివైన అధికారైనా విద్యారంగం గురించి టీచర్ల కంటే ఎక్కువ ఆలోచిస్తాడని నేను అనుకోను. విద్యారంగం సెల్ఫ్ డిసిప్లినరీ రంగం. అధికార దండం దానిపై అంతగా పని చెయ్యదు. అందుకు మొత్తం ఉపా ధ్యాయ రంగం, మేధావులు (వారే రంగంలో ఉన్నా) స్కూల్ ఎడ్యుకేషన్ సంపూర్ణ మార్పును ఎలా చెయ్యాలో చర్చించాలి.
ప్రభుత్వం కేజీ టు పీజీ ఇంగ్లీష్ విద్య అనేది ఒక పాలసీ నిర్ణయం మాత్రమే. దానికి డబ్బు కేటాయించడం, సౌకర్యాలు కల్పించడం చెయ్యాలి. కానీ టీచర్లు ఈ రంగాన్ని ఒక ఉద్యమంగా మార్చడానికి మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడున్న పరిస్థితిలో టీచర్ల ట్రేడ్ యూనియనిజం ద్వారా రాష్ర్టాన్ని మార్చలేం. టీచర్ క్రియేటివిటీ ద్వారానే మార్చగులుగుతాం. ముందు, ముందు దేశంలో వచ్చే విద్యా మార్పులకు ఇక్కడి నుంచి మనమొక మార్గం చూపించవచ్చు. ఎటు వంటి పాఠాలు చెబితే గ్రామీణ ప్రాంతంలో క్రియేటివిటీ పెరగుతుందో ఆలోచించి, టీచర్లు తమంతట తాము పాఠాలు రాయాలి. మొత్తం విద్యా రంగంలో శ్రమ గౌరవ పాఠాలు చెప్పడం చాలా ముఖ్యం, దానికి ఇప్పుడున్న చాలా వృత్తులకు లేని గౌరవాన్ని, స్కూళ్ళో గౌరవం కలిపించే విధంగా పాఠాలు తయారు చేసుకోవడం అవసరం. టీచర్ పిల్లలకు ఒక్క సిలబస్ మాత్రమే చెప్పక్కర్లేదు. సిలబస్‌కు బయట ఎన్నో కొత్త పాఠాలు వారిచే చదివించవచ్చు. ప్రతి టీచర్ ఇంట్లో ఒక స్వంత లైబ్రరీ పెట్టుకోవడం చాలా ముఖ్యం. టీచర్ వ్యక్తిత్వం, ఆయన ఇంటి వాతావరణం, క్లాసులో ఆయనకున్న విశాల జ్ఞానం విద్యార్థుల్ని చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా స్కూల్ టీచర్లు పుస్తకాల్లో ఉన్న పాఠాలను చదివి మాత్రమే వినిపిస్తారు. దానికి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషుకు మారుతున్నప్పుడు తనకు ఇప్పుడున్న ఇంగ్లీషు జ్ఞానానికి అదనపు పదకోశాన్ని చేర్చుకుంటే సరిపోతుంది. అసలు మీడియం విషయంలో భయపడడమనేది సరికాదు. ఇంగ్లీషు ఏ టీచర్‌కు రాని భాషకాదు. చెయ్యాల్సిందల్లా దానిపై కేంద్రీకరించడమే.
ప్రతి టీచర్ వారానికి రెండు మూడు వ్యాసాలు, సంవత్సరానికి రెండు కొత్త పుస్తకాలు చదవడం చాలా అవసరం. చదివే అలవాటు లేనప్పుడు కొత్త జ్ఞానం నేర్చుకోవడం కష్టం. అప్పుడే తమపై అజమాయిషీ వహించే అధికారి కన్నా తాము గొప్ప వారమనే భావన వారిలో ఉంటుంది. అప్పుడు అధికారే టీచర్‌కి భయపడుతాడు.
-కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

No comments:
Post a Comment