Pages

Saturday, 27 June 2015



జానపద పట్టుకుచ్చులు మందెచ్చులు
Namaste Telangana edit page 28.06.2015
Updated : 6/28/2015 12:03:08 AM
Views : 26
మందహెచ్చుల పుట్టుక గురించి చాలా కథనాలు ఉన్నాయి. శారదకాండ్ర స్త్రీ , గొల్ల పురుషుడు ఒకరినొకరు ఇష్టపడ్డారట. ఆ కలయికలో ఒక బాలుడు జన్మించాడట. ఈ విషయం పసిగట్టిన శారదకాండ్రు ఆ స్త్రీని వారి బృందం, కులం నుంచి కూడా వెలివేశారట, ఆ స్త్రీ ఏం చేయాలో తెలియక ఆ గొల్లవాని దగ్గరకు వెళ్లిందట. గొల్లవారు ఆవిడకు ఆశ్రయమైతే ఇచ్చారు కానీ ఆమెకు కలిగిన సంతానాన్ని తమ కులంగా గుర్తించలేదట. అలా గొర్రెల మంద దగ్గర పెరిగిన శారదకాండ్ర స్త్రీ సంతానం మందెచ్చుల వారై బుడగజంగాలు అనే కొత్త కులంగా పుట్టుకొచ్చారు.

జాన పదాల నదీనదాలకు చెదరని చెలిమె తెలంగాణ. ఆ చెలిమెలోంచి పుట్టుకొచ్చిన తేటైన నీటి ఊటే మందహెచ్చులు. దేశీ సాహిత్యం, జాను తెనుగు పదాల పోహళింపు, దేశీ సంగీత పదగతులు, చక్కని దరువులు, తీరైన తాళాల మోతలు, గజ్జెల సవ్వడులు, రాగాల జరుల సంగతులు కలిసిన కళా శరీరం మంద హెచ్చులు. వీరు కాటమరాజు వంశీకుల కథలను అప్పటికప్పుడు అశువుగా చెబుతారు. ఈ ఇతివృత్తాలు తెలంగాణ దేశీయతను పొదువుకుని విరాజిల్లుతున్నాయి. వీరు బిక్షుక గాయకులు.

మందపిచ్చోళ్ళు, మందెచ్చోళ్ళు, పోగడపోళ్ళు, పొడపొత్రపోళ్ళు అంటూ రకరకాల పేర్లతో వీరిని పిలుస్తారు. వీరు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైద్రాబాద్, నల్గొండ జిల్లాల్లోనే ఉన్నారు. మంద-హెచ్చు రెండు దేశీపదాల కలయిక. మంద-దేశీ నామవాచకం, హెచ్చు- దేశీ క్రియారూపం. మంద అంటే పశు సమూహం. హెచ్చు అంటే పెరగటం. ఈ కళారూపం గొల్లల ఆశ్రిత కులం వారైన జంగం లేదా బుడగ జంగం కులస్థులు ప్రదర్శిస్తుంటారు. వీరిని షెడ్యుల్డ్ కులాల జాబితాలో గుర్తించారు. గొల్లలు నివసిస్తున్న పల్లెలకు వెళ్లి వారి కులపెద్ద దగ్గర అనుమతి పొంది, త్యాగం కుదుర్చుకుంటారు. త్యాగం అంటే ఆట ఆడినందుకు ప్రతిఫలం. వీరు ఒప్పందం చేసుకున్న గ్రామాలను మీరాశి గ్రామాలంటారు. వీరు సంచార జీవులు.

మంద హెచ్చుల పుట్టుక గురించి చాలా కథనాలు ఉన్నాయి. శారదకాండ్ర స్త్రీ , గొల్ల పురుషుడు ఒకరినొకరు ఇష్టపడ్డారట. ఆ కలయికలో ఒక బాలుడు జన్మించాడట. ఈ విషయం పసిగట్టిన శారదకాండ్రు ఆ స్త్రీని వారి బృందం, కులం నుంచి కూడా వెలివేశారట, ఆ స్త్రీ ఏం చేయాలో తెలియక ఆ గొల్లవాని దగ్గరకు వెళ్లిందట. గొల్లవారు ఆవిడకు ఆశ్రయమైతే ఇచ్చారు కానీ ఆమెకు కలిగిన సంతానాన్ని తమ కులంగా గుర్తించలేదట. అలా గొర్రెల మంద దగ్గర పెరిగిన శారదకాండ్ర స్త్రీ సంతా నం మందెచ్చుల వారై బుడగజంగాలు అనే కొత్త కులంగా పుట్టుకొచ్చారు.

గొల్ల కులస్థుల ప్రస్తావన, వారి వీరోచిత పోరాటాలు, వారి దేవతల ప్రాశస్త్యం ఉన్న కథలనే చెబుతారు. ముఖ్యంగా యాదవ భారతంగా పేరు పొందిన కాటమ రాజు కథను ఎక్కువగా చెబుతారు. వీరి బృందంలో స్త్రీలు కూడా ఉంటారు. వీరు కాటమ రాజు కథల్లో గంగురాజు కథ, వలురాజు కథ, కరియావు రాజు కథ, పోలురాజు కథ, బత్తిరన్న కథ, బొల్లావు యుద్ధం కథ, కాటమరాజు యుద్ధం కథ ప్రధానంగా చెబుతారు. ఇంకా సారంగదర కథ, మండోదరి కథ, భూనాంచారి కథలను కూడా చెబుతూ ఉంటారు.

యాదవుల కుల దేవతగా భావించబడే గంగాదేవి ప్రార్థనతో కథను ప్రారంభిస్తారు. వీరి కథా ప్రదర్శనలో గంగు రాజు కథను తప్పకుండా చెబుతారు. గంగురాజు కాటమ రాజుకు తాత. గంగు రాజే గొల్లలకు మూలాధార మని వీరి నమ్మకం.

ఒగ్గుకథలో ఉపయోగించే వాయిద్యాలే వీరు ఉపయోగిస్తారు. అందులో డోలు చాలా ముఖ్యమైనది. దీనిని రఢవీర అని కూడా అంటారు. ఇది గంభీర నాదాన్ని చేస్తుంది అందుకే దానిని ఆ పేరుతో పిలుస్తుంటారు. వీరి మరో వాయిద్యం ఢమరుకం. దీనిని ఈ కళాకారులు జగ్గుఅని అంటారు. వీరు ఉపయోగించే వాయిద్యం లో ముఖ్యమైనవి తాళాలు. మంద హెచ్చుల ప్రధాన కళాకారుని చేతిలో ఉండే వాయిద్యం అనుసుల కర్ర. ఇంకా ప్రధాన కథకుని కాళ్లకు గజ్జెలుంటాయి.

గొల్లల ఇండ్లలో కథాప్రదర్శనకు ముందురోజు బొమ్మల కొలువులాగా అన్ని బొమ్మలను వరుసగా ఉంచి గంగా దేవి ప్రార్థన చేస్తారు. ఆయా కుటుంబాలకు ఆశీర్వచనాలు ఇస్తారు. ఎవరైనా చనిపోయిన వారుంటే వారి ఆత్మ శాంతికోసం పార్థన చేస్తారు. ప్రదర్శన చేసే రోజు వీరు నిష్ఠగా ఉంటారు. ఉదయాన్నే చాపలు, గొంగళ్ళు పరిచి చనిపోయిన వ్యక్తి ఫోటోను ఎదురుగా పెట్టి ప్రదర్శన చేస్తారు. పూలు, కుంకు మ, పసుపు పెట్టుకుని సాంబ్రాని పొగ వేసి ఒక్కొక్క బొమ్మను బయటకు తీసి కథా ఘట్టాన్ని వర్ణిస్తారు.

వర్ణన పాట రూపంలో లేదా వచన రూపంలో ఉంటుంది. ప్రార్థ నయ్యాకా గంగాదేవి బొమ్మను తీసేటప్పుడు గొల్ల ఇల్లాలు బియ్యం , పసుపు కలిపి వండిన బోనాన్ని అలంకరణతో తీసుకువచ్చి కథకుని ముందు ఉంచుతుంది. ఆ బోనం మీద ఒక గిన్నెను ఉంచి అందులో నూనె పోసి వత్తి వెలిగిస్తారు. మోదుగాకులో పసుపు కలిపిన బియ్యం అక్షింతలుగా ఉపయోగిస్తారు. కొబ్బరికాయ, పెరుగు గంగముందు ఉంచుతారు. అందరికి బండారును పెడతారు.

ఒప్పందం చేసుకున్నట్లు వడ్లు, జొన్నలు, చనిపోయిన వ్యక్తి దుస్తులు లేదా, ఒక గొర్రె పిల్ల ఇంకా బోలుకడియం, కాలుబేడి, వెండికంటే ఒక్కోరీతిలో త్యాగంగా తీసుకుంటారు. బొమ్మలన్నీ ఆయా కథలలోని పాత్రలే. గంగురాజు, వలురాజు, పెద్దిరాజు, సింహాద్రిరాజు, ఎరనూకరాజు, నలనూకరాజు ఇలా దాదాపు అరవై బొమ్మల్ని ప్రదర్శన లో ఉంచుతారు. ఈ బొమ్మలను తెలంగాణ ప్రాంతంలో ఉన్న నకాషి కులం వారు చేస్తారు. వీరు నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, జనగాం, వరంగల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. తెల్లని పునికి కర్రతో బొమ్మను చేసి చింతంబలి, రంపంపొట్టు కలిపిన మిశ్రమాన్ని పూసి ఆ బొమ్మకు పరిపూర్ణత్వాన్ని తీసుకొస్తారు.
వీరు చేసే మరో ప్రత్యేకమైన ప్రదర్శన గావుపట్టి బలి చల్లటం. గొర్ల మందకు దిష్టి తగలకుండా రోగాలు రాకుండా, చీడపీడల నివారణకు, పిశాచాల బారి నుంచి మందను రక్షించేందుకు, పంటలు సమృద్ధిగా ఉండేందుకు ఎంపిక చేసిన ఒక గొర్రె ను గాని మేకను గానీ గావుపట్టి బలిస్తారు.

ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. బలి ప్రదేశంలో తొలుత బొమ్మల ప్రదర్శన చేస్తారు. తరువాత గావు పట్టేవ్యక్తి దిగంబరంగా మారి మొలకు వేపకొమ్మలు కట్టుకుంటాడు. గొర్రెను భుజంమీద పెట్టకుని కాసేపు విన్యాసం చేసి దాని మెడను నోటితో కొరుకుతూ మందచుట్టూ తిరిగి దాని రక్తాన్ని ఒక గిన్నెలో పట్టి, అందులో మొక్కజొన్న, పసుపు, నల్లవాయిలి, నిమ్మ, గుమ్మడికాయ ముక్కలు, కల్లు ఇతరేతరాలను కలిపి మందచుట్టూ చల్లుతారు. దీన్నే బలి అంటారు. బలి అయ్యాక అందరూ మద్యం, మాంసాలతో విందు జరుపుకొంటారు. మందహెచ్చుల వారు ఎక్కువగా గొల్లల వేషధారణను అనుకరిస్తారు.

వీరు ఎక్కువగా తెల్లని దోతి, అంగి, భజంపై తువ్వాల, కాళ్లకు కాకరకాయ బేడి కడియాన్ని ధరించి తోలు చెప్పులు వేసుకుంటారు. చేతులకు వెండి కడియాలు, వేళ్లకు ఉంగరాలు ధరిస్తారు. ప్రధాన కథకులు, సహాయకులు కూడా కొందరు జుట్టుని పెంచుకుంటారు. స్త్రీ వేషం వేయడానికి ఈ జుత్తు ఉపకరిస్తుంది. స్త్రీ పాత్రదారులు ఆభరణాలు ధరించడానికి ముక్కు చెవులు కూడా కుట్టించుకుంటారు. స్త్రీలు చెవులకు గం టీలు, పల్లేరు పువ్వు అనే సొమ్ములను ధరిస్తారు. చేతులకు మణికట్టు కడియాలు, దండ కడియాలు, కాళ్లకు వెండి కడియాలు వేసుకుంటారు. మెడలో నల్ల పూసలు, గంటె పూసలు, కాళ్లకు మట్టెలు, ముక్కుకు పుల్లలు, ముక్కు పోగులు, చేతులకు గాజులు నిత్యం ఉండాల్సిందే.

ముక్కు పుడక ఎర్రగొల్లలు ధరించరు. మందహెచ్చులు పాకనాటి గొల్లలు అందుకే వారి వేషధారణను ఎక్కువగా అనుసరిస్తారు. వీరి కులదైవం గంగ. వీరు పోశమ్మ, ఎల్లమ్మలను కూడా భక్తితో ఆరాధిస్తారు. ఎవరన్నా తప్పు చేసిన వారి దగ్గర సాక్ష్యం రాబట్టడానికి ఇమానం అంటే ప్రమాణాలని ఎక్కువగా నమ్ముతారు. తెలంగాణలో పురుడుపోసుకున్న జానపద కళలో ఇది ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది.

Saturday, 11 April 2015



నల్లమలలో చెంచుల వేట! SAKSHI EDIT PAGE DATED 11.04. 2015

Sakshi | Updated: April 11, 2015 01:49 (IST)
నల్లమలలో చెంచుల వేట!
ఆహార సేకరణ చక్రం నుంచి బయటపడని చెంచుకు అడవి బయటి జీవితం మరణ శాసనం కాదా? నల్లమలలో పులుల జనాభాను పెంచి ప్రశంసలందుకుంటున్న ప్రభుత్వాలే... అదే నల్లమల చెంచులు మన కళ్లముందే కాలగర్భంలోకనుమరుగైపోయేలా చూడటం విచిత్రం. బహుశా, అతి త్వరలోనే విదేశీ గుత్త సంస్థలు నల్లమల కడుపు తోడి వజ్రాలు, తదితర ఖనిజ సంపదలను ‘నాగరికంగా’ తవ్వి తరలించుకుపోవడం మొదలవుతుంది. ఆ విధ్వంసాన్ని కళ్లారా చూడటానికి నల్లమల కంటిపాపలు చెంచులు మిగిలి ఉండరేమో!

 ఏనాటిదో నల్లమల! ఆ కొండలు, దట్టమైన అడవుల పుట్టుక ఎప్పటిదో? ఆ లోయల్లో పలువంపులు తిరుగుతూ పరుగులు తీసే కృష్ణవేణమ్మ అక్కడికె ప్పుడు చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా ఇక్కడ మాత్రం ఇంకా తన ఉనికిని కాపాడుకుంటున్న పెద్దపులి జాతి ఎన్నాళ్లుగా నల్లమలను ఏలుతు న్నదో?... ఎక్కడా దొరకని అరుదైన దివ్యౌషధం సరస్వతి ఆకు (నాగరికులు పెట్టిన పేరు) అక్కడే ఎందుకు దొరుకుతున్నదో? రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మకు నీడనిచ్చిన సరాక అశోకవృక్షం లంకకు ఆవల కేవలం నల్ల మలలోనే ఎందుకు విస్తారంగా కనబడుతున్నదో? మరెక్కడాలేని ఓ బుల్లి రకం (అతి చిన్న జింకజాతి) ‘బుర్రజింక’ ఇక్కడ మాత్రమే ఎందుకు గంతు లేస్తున్నదో? సాలీడు రాకాసి సాలీడుగా, జెర్రిపురుగు రోకలిబండగా, ఉడుత బెట్టుడుతగా భారీగా ఆకారాలు పెంచుకొని ఎందుకలా ఉంటాయో? ఈ అడవిలోని చెట్లతో స్నేహం చేస్తూ, పశుపక్ష్యాదులతో కలియ దిరుగుతూ అనాదిగా సహజీవనం చేస్తున్న ఓ ఆదిమ తెగ ‘చెంచులు’ పేరుతో ఇక్కడెప్పుడు వెలిసిందో?

నల్లమల చెంచులు ఇప్పటికీ ఆహార సేకరణ దశను పూర్తిగా దాటలేదు. ఒక పర్యావరణ చక్రాన్ని నిర్దేశించుకున్న ప్రకృతి సహజ సూత్రాలకు అనుగుణంగానే వారి జీవితం ఉంటుంది. చెట్ల నుంచి రాలిపడే కాయలు, పళ్లను తింటారు. కాలానుగుణంగా దుంపలను తవ్వుకుంటారు. వంట చెరకు కోసం చెట్లను కొట్టరు. ఎండిపోయిన కొమ్మలను, పుల్లలను వినియోగిస్తారు. ఎండిపోయిన పేడను వెలిగిం చుకొనే పాలు కాచుకోవడం ఆచారం. సాధారణంగా ఉడుతలు, ఉడుములు, ఎలుకలు, కుందేళ్లు, పక్షులను వేటాడుతారు.  జింకల వేట మాత్రం అరుదు. ఏ రోజు అవసరానికి ఆరోజే వేట. రేపటి కోసం దాచుకొనే అలవాటు చెంచులకు లేదు. వేలయేళ్లుగా ఇదే జీవనశైలితో అటవీ ఆహార చక్రంలో చెంచులు ఇమిడిపోయారు. ఈ చక్రం నుంచి బయటపడి బతకలేని స్థితికి చెంచు జీవితం చేరుకుంది. వ్యవసాయం నేర్పించి వీరిని ఆ చట్రం నుంచి బయటపడేయడానికి గతంలో జరిగిన కొన్ని ప్రయత్నాలు ఏవీ సత్ఫలితాలను ఇవ్వలేదు.

 భారతీయ ఆదిమ తెగలపై పరిశోధన చేసిన ఆస్ట్రియన్ మానుష శాస్త్రవేత్త హేమన్‌డార్ఫ్ సిఫారసు మేరకు నల్లమల అడవి అంచున మైదాన ప్రాంతాల్లోని లక్ష ఎకరాల భూమిని గుర్తించి చెంచుల వ్యవసాయం కోసం కేటాయిస్తూ నైజాం సర్కార్ 1940వ దశకంలో ఫర్మానా జారీ చేసింది. స్వాతంత్య్రానంతరం ప్రజా ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను అటకెక్కించాయి. బ్రిటిష్ పాలకులు కూడా కర్నూలు జిల్లా పెచ్చెరువు ప్రాం తంలో చెంచుల కోసం ఒక ఆశ్రమ పాఠశాలను, ఒక వైద్యశాలను ఏర్పాటు చేశారు. చెంచులకు ఉపాధి కల్పించడం కోసం వేల సంఖ్యలో టేకు చెట్లను నాటించారనేందుకు ఆధారాలున్నాయి. ఇదంతా ఎందుకంటే చెంచుల పట్ల బ్రిటిష్, నిజాం పాలకులు చూపినపాటి శ్రద్ధ మన ప్రజాప్రభుత్వాలకు లేకపోయిందని చెప్పడానికి. గిరిజనాభివృద్ధి కోసమే ఏర్పాటుచేసిన ఐటీడీఏ ఆచరణలో అటవీ సంపద దోపిడీకి ఉపయోగపడినంతగా గిరిజన జీవితాల్లో మార్పునకు ఉపకరించలేదు. నల్లమలలో ఈ సత్యం మరింత నగ్నంగా కనబడుతుంది. అడవుల్లో మానవ నివాస ప్రాంతాలు ఉండటంవల్ల వన్యప్రాణుల ఉనికికి భంగం కలుగుతోందనీ, వారిని మైదాన ప్రాంతాలకు తరలించాలనీ చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక ప్యాకేజీని ప్రకటించింది. ఆ ప్యాకేజీ ప్రకారం చెంచు పెంటలను(ఆవాసాలను) తరలించే హడావుడి మొదలైంది. మొదటి దశ కింద తరలించాలని ప్రకటించిన పల్లెల్లో మహబూబ్‌నగర్ జిల్లా లోని వట్వార్లపెల్లి, సార్లపెల్లి, కుడి చింతలబైలు వగైరా పెంటలు అభయా రణ్యంలో కాక, అడవి అంచున బఫర్ జోన్‌లోనే ఉన్నాయి.

  పైగా అది పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న మల్లెల తీర్థానికి వెళ్లే దారిలో ఉంటాయి. వన్యప్రాణులకు పర్యాటక కేంద్రంవల్ల లేని ముప్పు చెంచు పెంటల వల్ల కలుగుతుందా? గిరిజనుల తరలింపును అమలు చేయడానికి వన్యప్రాణులు ఒక సాకు మాత్రమే అనేందుకు ఇదొక చక్కని ఉదాహరణ. పైగా వందలు, వేలయేళ్లుగా వన్యప్రాణులతో సహజీవనం చేస్తూ అటవీ సంపదకు రక్షణగా నిలబడిన గిరిజనుల తరలింపువల్ల అటవీ సంపద దోపిడీకి, వన్యప్రాణుల విధ్యంసానికి ఇక ఎదురేముంటుంది? అడవిలోకి నాగరికుల చొరబాటు పెరిగిన దగ్గర్నుంచే అటవీ సంపద తరుగుతోందని చెప్పేందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఐటీడీఏ ఏర్పాటైన తర్వాత గిరిజనుల నుంచి ఈ సంస్థ అటవీ ఉత్పత్తులను సేకరించి, వారికి ప్రతిఫలం ముట్టజెప్పడం ప్రారంభించింది.

  క్రమేపీ బినామీ పేర్లతో నాగరి కులు ఈ పనుల్లోకి చొరబడ్డారు. మన్ననూర్ గిరిజన సహకార కేంద్రానికి 2006లో 13 క్వింటాళ్ల నరమామిడి చెక్క అమ్మకానికి వస్తే 2010లో ఒక క్వింటాల్ మాత్రమే వచ్చింది. అరుదైన నరమామిడి చెట్ల నుంచి గిరిజనులైతే చెట్టు మొదలును ముట్టుకోకుండా పైభాగానున్న కొమ్మల నుంచి జాగ్రత్తగా చెక్కను తీస్తారు. మైదాన ప్రాంత బినామీలు డబ్బు కక్కుర్తితో చెట్లను మొద లంటా నరికిపారేసి, నాలుగేళ్లలో ఆ ప్రాంతంలో నరమామిడి చెట్టన్నదే లేకుం డా చేశారు. అడవిలో పెరిగే అడ్డాకు తీగలు చెట్ల మొదళ్లను అల్లుకుంటూ కొమ్మలమీదగా వ్యాపిస్తాయి. విస్తళ్ల తయారీకి ఉపయోగించే ఈ అడ్డాకులను గిరిజనులు ఒడుపుగా చెట్ల పెకైక్కి తీగకు గాయం కాకుండా సేకరిస్తారు. మైదానం నుంచి వచ్చే కిరాయి మనుషులు చెట్లను కూల్చి, తీగల్ని తెంపి మరీ అడ్డాకును సేకరిస్తారు. చెట్టుపైనే పాకానికి వచ్చి, ఎండి రాలిపోయిన కుంకు ళ్లను మాత్రమే గిరిజనులు సేకరిస్తారు. మైదాన వాసులు కొమ్మలను నరికి మరీ కుంకుళ్లను సేకరిస్తారు. వన్యప్రాణుల విషయంలోనూ అంతే. గిరిజను డికి అడవి తల్లితో సమానం. అడవిలోని సమస్త జీవరాశినీ అతడు ప్రేమి స్తాడు. అటువంటి గిరిజనుడి వలన వన్యప్రాణులకు ప్రమాదమని చెప్పడం ఎంత బూటకం? కనుక, ఈ తరలింపు వెనుక ఏదో మతలబు ఉంది.

 దేశంలోని వివిధ అరణ్యాల గర్భాన దాగి ఉన్న అపార ఖనిజ సంపదల పైకి బహుళజాతి కంపెనీలు ఎన్నాళ్లుగానో గురిని ఎక్కుపెట్టాయి. యథాశక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి సహకరిస్తున్నాయి. నల్లమల అడవుల్లోనూ, కృష్ణాతీరం వెంట అత్యంత విలువైన కింబర్లైట్ రకం వజ్రాల నిక్షేపాలు, బంగారం, విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు ఎప్పుడో గుర్తించారు. నల్ల మల కేంద్రంగా కొన్ని వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ‘డీబీర్స్’ అనే బహుళ జాతి సంస్థ ఖనిజాన్వేషణ పర్మిట్ (ఆర్.పి.) తీసుకుంది. ఏ ప్రాం తంలో ఎంత పరిమాణంలో వజ్రాలు, బంగారం నిక్షేపాలు ఉన్నాయనే అం శంపై ఈ సంస్థ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఇక మైనింగ్ లెసైన్స్‌లు తీసుకొని వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజాన్ని తవ్విపోసుకోవాలి. కానీ, ఇందుకోసమే అంతరించిపోతున్న అతి పురాతనమైన, అరుదైన చెంచు జాతిని అడవి నుంచి వెళ్లగొట్టారన్న అపవాదు వస్తుందన్న భయంతో ప్రభు త్వాలు కొత్త నాటకాన్ని ప్రారంభించాయి. దీని ప్రకారం ముందుగా వన్య ప్రాణుల రక్షణ పేరిట చెంచులు అడవుల నుంచి బయటకు తరలి పోయేట్టు చేయాలి. అనంతరం గనుల తవ్వకం లెసైన్స్‌లతో బహుళ జాతి సంస్థలు అడవిలోకి ప్రవేశించాలి.  

 మన దేశ చరిత్రను ఆర్యుల ఆగమనంతో మొదలుపెట్టి చదువు కోవడం పరిపాటి. కానీ వారి రాకకు వేల ఏళ్లకు ముందు నుంచే ఇక్కడ స్థిరపడ్డ వారు చెంచులు. లక్షల ఏళ్ల క్రితమే ఆఫ్రికా ఖండం నుంచి సాగిన మానవ మహా విస్తరణలో భారతావనిపై స్థిరపడ్డ అతి పురా తన తెగల వారసులు చెంచులు. అందుకు నిదర్శనం వారికి కొన్ని ఆఫ్రికా తెగలతో ఉన్న పోలికలే. ఈ ఆదిమ మానవ జాతి వారసులు మన అరుదైన జాతీయ సంపద. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వాల పాలనలోనే వారు మరీ నిర్లక్ష్యానికి గురికావడం పెద్ద విషాదం. వారిప్పుడు అంతరించిపోతున్న జాబితాలో చేరారు. ఐటీడీఏ లెక్కల ప్రకారం మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు నాలుగు జిల్లాల్లో కలిసి 40 వేల జనాభా ఉన్నట్టు అధికారిక అంచనా. అయితే ఈ లెక్క తప్పులతడక. వాస్తవానికి చెంచు జనాభా అందులో 60 శాతం కూడా ఉండదు. గతంలో కూడా పునరావాసం పేర అడవి నుంచి చెంచులను బయటకు తరలించారు. వారిలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు.

 ఇప్పుడు ప్యాకేజీ పేరిట ఇంటికో పది లక్షల రూపాయలు ఇస్తారు. రేపటికి ఆహారం దాచుకోవడమే తెలియని చెంచు పది లక్షలు దాచుకొని నాగరిక ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తాడు? ఆహార సేకరణ చక్రం నుంచి బయటపడని చెంచుకు అడవి బయటి జీవితమంటే మరణ శాసనం కాదా? నల్లమలను పులుల అభయారణ్యాన్ని చేసి, వాటి జనాభాను పెంచి అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థల ప్రశంసలందుకుంటున్న ప్రభుత్వాలే... అదే నల్లమలలోని దేశంలోనే అతి పురాతన తెగలలో ఒకరైన చెంచులు మన కళ్లముందే క్రమక్రమంగా చరిత్ర కాలగర్భంలోకి కనుమరుగై పోయేలా చూడటమే విచిత్రం. తప్పదు. డాలర్లు, రూపాయల వేటలో వెనుకా ముందూ కానక పరుగులు తీస్తూ మనం అనుసరిస్తున్న అభివృద్ధి మార్గం ఇది. నల్లమల నుంచి చెంచుల నిష్ర్కమణతో పాటే చాపకింది నీరులా బహుళజాతి సంస్థల ప్రవేశం జరగబోతోంది. బహుశా, అతి త్వరలోనే విదేశీ గుత్త సంస్థలు నల్లమల కడుపు తోడి వజ్రాలు, తదితర ఖనిజ సంపదలను అత్యంత ‘నాగరికంగా’ తవ్వి తరలించుకుపోవడం కోసం ఆ పురాతన అరణ్యాలనే అంతరింపజేయవచ్చు. ఆ విధ్వంసాన్ని కళ్లారా చూడటానికి నల్లమల కంటిపాపలు చెంచులు మిగిలి ఉండరేమో!
 (muralivardelli@yahoo.co.in)

Wednesday, 30 July 2014


అస్తిత్వ సమాధులపై పోలవరం - మైపతి అరుణ్‌ కుమార్‌

Published at: 31-07-2014 00:29 AM
‘మమ్మల్ని ముంచే ప్రజాస్వామ్యం మాకొద్దని’ పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న ఆదివాసులు నినదిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, కొమరం భీం, బిర్సాముండా, సోయం గంగులు పోరాట        సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మా గూడెంలో మా రాజ్యం. ‘జల్‌, జంగిల్‌, జమీన్‌’ మాదే అని ఉద్యమిస్తున్నారు.
దేశ చరిత్రలో మూడు లక్షల మంది ఆదివాసులను ప్రజాస్వామ్య పద్ధతిలో ఊచకోత కోయడానికి మార్గం సుగమం చేసిన చీకటి రోజు 2014, జూలై 11. ప్రస్తుత ప్రజాస్వామ్య పాలన భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని నిరూపించిన రోజు అది. రాజ్యాంగంలోని జీవించే హక్కును ఆదివాసులకు అందకుండా కాలరాసిన రోజు. గత యూపీఏ ప్రభుత్వం తయారు చేసిన పోలవరం ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్‌ను ప్రస్తుత ఎన్డీఏ యాంలో పార్లమెంటులో ఆమోదం పొందిన రోజు. పోలవరం పేరిట ఆదివాసీలకు ప్రజాస్వామ్య పాలకులు వేసిన శిక్ష అది.
సమాజం మొత్తం అనుకున్నట్లే కేవలం గ్రామాలు, అడవులు, పురావస్తు ఆధారాలు, భద్రాచల రామాలయ భూముల్ని మాత్రమే కోల్పోతున్నామా లేక ఇంతకంటే విలువైనవేమైనా జల సమాధి అవుతున్నాయా? అదివాసీ సమూహాల్లో కొన్ని వేల ఏళ్ళుగా వస్తున్న అస్తిత్వ మూలాలు జలసమాధి అవుతున్నాయి. ప్రభుత్వాలు వారి అస్తిత్వానికి ఏం పరిహారం చెల్లిస్తాయి? కోల్పోతున్న వారి అస్తి త్వాన్ని ఏవిధంగా పునర్మిరిస్తాయి? సాధారణంగా ఆదివాసీ సమూహాలు.. ప్రకృతితో మమేకమై, అటవీ ఉత్పత్తుల అనుసంధానంతో, అందుబాటులోని నీటివనరుల ఆధారంగా తమ అస్తిత్వాన్ని సుస్థి రం చేసుకుంటారు. ఆ విధంగా సంప్రదాయబద్ధంగా గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సాలోని ముంపునకు గురయ్యే 300 ఆదివాసీ గ్రామాలు ఆ విధంగా ఏర్పడినవే. ఖరీఫ్‌ సీజన్‌ మొదలవగానే దేశంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతుంది. ఆదివాసీ సమాజంలో దీనికి భిన్నంగా ఉం టుంది. దుక్కులు దున్నటానికి నాగలి కోసం అడవిలో వంక గల బిలుగు చెట్టు కలపను సేకరించి నాగ లి తయారు చేసుకుంటారు. దానికెటువంటి ఖర్చు అవసరం లేదు. పంటచేల రక్షణ కోసం అడవిలో చెట్లతోనే మంచెల నిర్మాణం, కంచె నిర్మాణం చేసుకుంటారు. పశుపోషణ అడవితో ముడిపడి ఉంది. అటవీ ఉత్పత్తులను సేకరించి సంతల్లో విక్రయించి పూట గడుపుకుంటారు. వెదురుతో బొమ్మలు చేస్తారు. అడవి కలపతోనే పూరి గుడిసెల నిర్మాణం చేసుకుంటారు. పండుగలు కూడా ఆయా గ్రామాల పరిసర ప్రాంతాలతో ముడిపడి ఉంటాయి. ఇవేకాక ఆదివాసీ సమాజంలో గట్టు విధానం ఉంటుంది. ముంపునకు గురయ్యే కోయ సమాజంలో 3 నుంచి 7వ గట్టుకు సంబంధించిన ఆదివాసీలున్నారు. ఇందులో ప్రతి గట్టు వారికి అడవిలో ఒక చెట్టు, జంతువు దైవాలుగా ఉంటాయి. మద్ది చెట్టు అడవి కోడి, ఉడుము, మేక, తాబేలు వంటివి. ఏ పండుగ జరిపినా విప్ప చెట్టును వారు ప్రధానంగా పూజిస్తారు. వేట విధానంలో కూడా వేటాడిన మాంసాన్ని నల్లమద్ది చెట్టుకు నైవేద్యంగా పెట్టిన తర్వాతనే తినటం ప్రారంభిస్తారు. గూడెంలోకి సరిపడు పంటలు పండటం కోసం సంప్రదాయబద్ధంగా ఏర్పాటుచేసుకున్న నీటి చెరువులు కుంటల కట్టలపై మైసమ్మ, ఎర్రమ్మలు కొలువుంచుకుంటారు. ఆదివాసుల అణవణువూ వారు శతాబ్దాలుగా బతుకుతున్న ప్రకృతిపై ఆధారపడి ఉంది. పెళ్ళి విధానంలోనూ ఉమ్మడి సాంప్రదాయక జీవన వ్యవస్థ ప్రకృతిలో గల సంబంధాన్ని చూడవచ్చు. పెళ్ళి విధానంలో పచ్చని పందిరి ఏర్పాటుకూ కొన్ని ప్రత్యేక చెట్లను వాడుతారు. ముహూర్తానికి ముందు జిన్న పొరక, పాల పొరకను అడివి నుంచి సన్నాయి వాయిద్యాలతో తీసుకొచ్చి పందిరిపై అలంకరిస్తారు. ప్రధానం పీఠ, కడపలను ఇదే సమయంలో తీసుకొస్తారు. వాటి తయారీకి అడవిలో బతెంగ చెట్టు బెరడునే ఉపయోగిస్తారు. వేరేదాన్ని వాడటానికి వీలులేదు. తాళి కట్టే సమయంలో జమ్మి చెట్టును అడవినుంచి తెచ్చాకే తాళి కడతారు. ఇలా ఆదివాసీ సమా జం ప్రకృతితో పెనవేసుకోయి శతాబ్దాలుగా నడుస్తోంది. అలాంటి ఆదివాసీ అస్తిత్వం పోలవరం ప్రాజెక్టు వల్ల సమాధి కాబోతోంది.
ఉన్నపళంగా వీటన్నింటినీ వదిలి నేడు పోలవరం పేరిట సామ్రాజ్యవాదులకు లాభం చేకూర్చటానికి ఈ గూడేలన్నిటినీ మైదాన ప్రాంతాలకు తరలిస్తే ఆదివాసుల అస్తిత్వమేమవ్వాలి? ప్రభుత్వం ప్రకటించే రూ.10 లక్షల నష్టపరిహారం వారు కోల్పోతున్న జీవితంతో పోలిస్తే ఏపాటిది? మైదాన ప్రాంతంలో పునరావాసం కల్పిస్తే వారు ఎలా బతకాలి? తాగునీరు సైతం మైదానంలో రూ.20 ధర పలుకుతుంటే వారి జీవనం ఎలా సాగాలి? మైదాన ప్రాంతంలో భూముల కోసం కొట్టుకు చస్తుంటే, మాకు భూములు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇచ్చినా ఏం పంటలు పండించాలి? అనే ప్రశ్నలు జలసమాధి కాబో తున్న ఆదివాసీలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. అడవి అనే నీటిలో చేపలాగా బతికే ఆదివాసీని బయటపడేస్తే ఎలా బతుకుతారు? కనీస మానవతా విలువలు లేకుండా వ్యవహరిస్తున్నాయి ఈ ప్రభుత్వం, రాజకీయ పార్టీలు. ఆదివాసీలు జీవించే హక్కును ప్రజాస్వామ్య బద్దంగా కాలరాస్తున్నవి. ప్రజాస్వామ్యబద్దంగా గ్రామ సభల తీర్మానం జరపాలని సూచించే రాజ్యాంగ నిబంధనను కూడా అవి ఉల్లంఘిస్తున్నాయి. అటవీ హక్కులకు సంబంధించిన 1/70 చట్టాన్ని పార్లమెంట్‌ గేటు దగ్గర పాతర పెట్టి లోపల మాత్రం పోలవరానికి ఆమోదం తెలిపాయి. అస్తిత్వ పోరాటాన్ని అంచనా వేయ డం చాలా కష్టం. నాడు జోలాపుట్‌ బలిమెల డ్యాంల కింద నిర్వాసితులైన గోండులు ఏమయ్యారో నేటికీ తెలియదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల కింద జల సమాధి అయిన చెంచులు బతికున్నారో లేదో అంచనా లేదు. నేడు ‘పోలవరం’ ముంపునకు గురయ్యే 3 లక్షల కోయ సమాజం కూడా వీరిలాగే ఉనికిలో లేకుండా పోతారనే ఆందో ళన ఉంది. అయితే గతంలో వలె నిరక్షరాస్యతతో నేటి ఆదివాసీ సమాజం లేదు. విద్యా చైతన్యాన్ని, సామాజిక స్పృహను సంతరించుకున్నారు. మమ్మల్ని ముంచే ప్రజాస్వామ్యం మాకొద్దని పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులవుతున్న ఆదివాసులు నినదిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ, కొమరం భీం, బిర్సాముండా, సోయం గంగులు పోరాట సంప్రదాయాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. మా గూడెంలో మా రాజ్యం. ‘జల్‌, జంగిల్‌, జమీన్‌’ మాదే అని ఉద్యమిస్తున్నారు. మరో శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం, ఇంద్రవెల్లిలు పునరావృతం అయితే దానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.
మైపతి అరుణ్‌ కుమార్‌
అదివాసీ విద్యార్థి సంఘం
Andhra Jyothi dated 31 -07-2014


ఆ చిన్నపిల్లల్ని ఎవరు చంపారు? " - కంచ ఐలయ్య
మాసాయిపేట దుర్ఘటనలో పాపం, పుణ్యం తెలియని పసికందులు ఎందుకు చనిపోయారు? నాలుగైదు గ్రామాల నుంచి అంత చిన్న పిల్లలు బస్సుల్లో పట్టణాల్లో స్కూళ్ళకు ఎందుకొస్తున్నారు? యల్‌.కె.జి.లో చేరే చిన్న పిల్లల వయస్సు ఎంత ఉంటుంది -మూడు లేదామూడున్నర కదా? రైలు ట్రాక్‌ చుట్టూ పడివున్న శవాలను, వారి పసి ముఖాలను చూసి ఏ పండిత వర్గమైనా బాధపడిందా?
ఈ చిన్న పిల్లల్ని గ్రామాల నుంచి ఇంగ్లీష్‌ మీడియం స్కూలుకు పంపిన తల్లిదండ్రుల ముఖాలు, బట్టలు చూశారా? అందులో ఎంత బీద లేబర్‌జనం ఉన్నారో గమనించారా? వాళ్ళ, వాళ్ళ గ్రామాల్లో కిండర్‌ గార్టెన్‌ నుంచి ఏడో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ఉండి ఉంటే ఇంత పసికందులు బస్సులో పడి గేటులేని లెవల్‌ క్రాసింగ్‌లు ఉన్న దేశంలో, రాష్ట్రంలో సుదూర స్కూలుకు వెళ్ళేవాళ్ళా? హైదరాబాద్‌కు అతి దగ్గర్లో ఉన్న రైలు లైన్ల మీద కూడా కనీసం మనిషిని పెట్టి గేటు పెట్టలేని రైలుపట్టాలున్న దేశమిది. రైల్వే ఆస్తుల్ని మంత్రులు, అధి కారులు ఎంత దోచుకుతింటున్నారో మనకు తెలుసు. ఈ ప్రాంతం నుంచి ఎంతోకాలం నుంచి ఎన్నో స్కూలు బస్సులు పసికందుల్ని ఎక్కించుకొని తిరుగుతున్నాయని అధికారులకు తెలుసు, మంత్రులకు తెలుసు. ఎంత వీలైతే అంత దోచుకొని పాపభీతి కూడా లేకుండా బతికే పాలకులకు పసిపిల్లల ప్రాణాలు ఎంత విలువైనవో ఎలా తెలు స్తుంది? ఆ చనిపోయిన పిల్ల్లల్లో ఎటువంటి మేధావితనం దాగి ఉండిందో ఎలా అంచనా కట్టగలం? వాళ్ళంతా ఇంత పెద్ద వ్యవస్థ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, అమానుషత్వంతో ఆగమైపోతే ఎందుకిలా జరుగుతుందో మూలాల్లోకి పోవాలి గదా! గ్రామాల్లో శ్రమజీవుల్లో ఇంగ్లీషు విద్యా ఆకాంక్ష అంతా ఇంత పెరగలేదు. హైదరాబాద్‌ చుట్టూ గ్రామాల్లో కూలీనాలీ చేసుకునే వాళ్ళు ఇంగ్లీషు విద్య కోసం ఇంత తపించి అంత పసికందుల్ని సుదూరం పొయ్యే బస్సెక్కిస్తుంటే ఎవరు ఆలోచించకపోయినా ప్రభుత్వ స్కూల్‌ టీచర్లు ఆలోచించాలి కదా?
ఈ పిల్లలు పుట్టిన అన్ని గ్రామాల్లో తెలుగు మీడియం స్కూళ్ళు ఉన్నాయి. అందులో ప్రభుత్వ పంతుళ్ళు ఉన్నారు. ఆ స్కూళ్ళలోకి ఈ కూలీ, నాలీ పిల్లల్ని పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడక, బస్సుకూ, స్కూలుకూ తమ రెక్కల కష్టం నుంచి డబ్బుకట్టి ఉచిత విద్యను, మిడ్డే మీల్స్‌ను పక్కకు పెట్టి ప్రైవేట్‌ స్కూళ్ళకు వాళ్ళు ఎందుకు పంపుతున్నారు? ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలంగాణ జిల్లాల్లో సగటున 59 మంది పిల్లలే మిగిలి ఉన్నారని టీచర్‌ సంఘాలే ఒప్పుకుంటున్నాయి. ఆ 59 మంది తల్లిదండ్రులు అయ్యో! మా పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం స్కూలుకు పోతలేదే అని ప్రతిరోజూ ఆవేదన పడుతున్నారు. ఆ ఆవేదన నుంచే కదా ఈ పసికందులు బలైంది? దానిని తల్లిదండ్రుల తప్పందామా?
ఈ స్థితి ఎందుకొచ్చిందనే ప్రశ్న గురించి ఎవరు ఎక్కువ ఆలోచించాలి? ఉపాధ్యాయ సంఘాలు, టీచర్‌ ఎమ్మెల్సీలు ఈనాడున్న విద్యా వ్యవస్థకు మేలుచేస్తున్నారా, కీడు చేస్తున్నారా? ఒక చిన్న మేధావి వర్గం విప్లవం, మార్క్సిజం, ప్రభుత్వ రంగం, సోషలిజం గురించి ఉపన్యసిస్తూ తమ పిల్లల చదువుకొచ్చే సరికి వరల్డ్‌ క్లాస్‌ ప్రైవేట్‌ స్కూళ్ళకు పంపుతుంటే వీళ్ళు విప్లవ దృక్పథానికి చేసే ద్రోహం ఎంత పెద్దదో ప్రజలకు తెలుసు. అందుకే వీరి ‘విప్లవం’ పట్ల ప్రజలవిశ్వాసం సన్నగిల్లుతున్నది. ఏ వ్యవస్థ పునాది అయినా అది ఎన్నుకునే విద్యారంగంపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ వచ్చేవరకు తెలంగాణ రాష్ట్రం రాగానే ప్రభుత్వాల మెడలు వంచి ప్రజల మేలుకోసం పాటు పడుతామని ప్రమాణాలు చేసిన వారంతా ఇప్పుడు ప్రభుత్వంలో తమకు ఏమి లభిస్తుందని ఆలోచిస్తున్నారు తప్ప ప్రభుత్వ హామీలను ముఖ్యంగా కె.జి. టు పి.జి. వరకు ఇంగ్లీష్‌ విద్యను అమలుచేయాలని ఒక్క అగ్ర కుల మేధావి అడగడంలేదు. పసికందులు ప్రైవేటు స్కూలు బస్సుల్లో, ఆటోల్లో పొయ్యే విద్యా విధానానికి స్వస్తిచెబుదామని ఎవరూ అడగడం లేదు.
ఏ నిర్ణయాన్ని ఎప్పుడు అమలుచేయాలో ఇప్పుడు ఒక్క కుటుంబం మాత్రమే నిర్ణయించాలి. ఉద్యమ ప్రజాస్వామ్యం ఇప్పుడు పటాపంచలైంది. చిన్న రాష్ట్రంలో పెద్ద అధికార పీఠాల వేట నిరంతరం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం దోపిడీ దొంగలకు కూడా లెజిటమసీ ఇచ్చింది. రోజూ పత్రికల్లో ఒక కుటుంబ ప్రకటనలు లేదా బీజేపీ, శివసేన వంటి వారు ముస్లింల మీద చేసే యుద్ధం తప్ప మరొకటి కనిపించడం లేదు. విద్యా వ్యాపారంపై పోరాటం చేసే బదులు విద్యా వ్యాపారులు, ప్రైవేట్‌ స్కూళ్ళ యజమానులు (ఇందులో టీచర్‌ ఎమ్మెల్సీలూ, నాయకులూ ఉన్నారు) ప్రభుత్వ రంగంలో ప్రవేశపెట్టాలనుకునే కె.జి.టు పి.జి ఇంగ్లీషు విద్యా విధానాన్ని ఆపడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మాసాయిపేట రైలు క్రాస్‌ వద్ద చనిపోయిన చిన్నారుల కుటుంబాల సంగతే చూద్దాం. వారికి ప్రభుత్వ రంగంలో ఇం గ్లీషు విద్య కూడా దొరికివుంటే వారి చావులు తప్పేవి, వారి కుటుంబాల ఆర్థిక స్థితి కూడా భిన్నంగా ఉండేది. నెలవారీగా ప్రైవేటు స్కూళ్ళ మీద పెట్టే ఖర్చు ఇంతా అంతాకాదు. తమ పిల్లలకూ ఇంగ్లీష్‌ రావాలనుకునేది బ్రిటిష్‌ వలసవాదం మీదనో, లార్డ్‌ మెకాలే మీదనో ప్రేమతో కాదు. తమ పిల్లలు తమలా కూలీలు కావద్దని. ఇప్పటికే తల్లిదండ్రులకు తెలుగు మీడి యంపై నమ్మకం పోయింది. ఆ కూలీల్లో కొంతమందైనా పదోతరగతి వరకు తెలుగుమీడియం చదువుకున్న వాళ్ళున్నారు. వారు మళ్ళా కూలీలుగానే బతుకుతున్నారు. ఇంగ్లీషు కూడా చదువుకుంటే ఈ విధంగా కూలీ బతుకు బతక్కుండా ఉంటారని ఒక నమ్మకం వాళ్ళలో ఉన్నది. ఈ స్థితిలోనూ ఉపాధ్యాయ సంఘాలు జూలై 27న తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసి తమ సర్వీసు విధానం గురించి అడిగారు. తమకు లెక్చెరర్‌ పదవులు కావాలని అడిగారు కానీ విద్యా విధానాన్ని మార్చండని వాళ్ళు అడుగలేదు. ముఖ్యమంత్రి తాను ఏమి ఆలోచిస్తున్నారో వారికి చెప్పి పంపారు.
తెలంగాణలో గత పదేండ్లలో ప్రైవేట్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్ళు ఎంత పెరిగాయో విద్యా కమిషన్‌ ప్రతి సంవత్సరం ఇచ్చే ఎడ్యుకేషన్‌ స్టాటిస్టిక్స్‌ చూస్తే తెలుస్తుంది. 2012 సంవత్సరాంతానికి ఒక్క రంగారెడ్డి జిల్లాలో 1002, హైదరాబాద్‌లో 744, కరీంనగర్‌లో 604, నల్లగొండలో 485, మహబూబ్‌నగర్‌లో 412, వరంగల్‌ జిల్లాలో 533 ప్రైవేట్‌ స్కూళ్ళు ఉన్నాయి. ఈ ప్రైవేట్‌ స్కూళ్ళన్నీ ఎక్కువగా అగ్రకుల విద్యా వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి.
ఈ అగ్రకులాల వారే ఎమ్మెల్సీలు, నాయకులు అవుతారు. వీరి పిల్లలు లెవల్‌ క్రాస్‌ చేయనవసరం లేని హైదరాబాద్‌ సిటీలో ఉండి చదువుతారు. ఒక ఉపాధ్యాయ సంఘ నాయకుడు చెప్పిన సమాచారం ప్రకారం కొంతమంది ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్‌ స్కూళ్ళకు పిల్లల్ని గ్రామాలు, కుటుంబాలు తిరిగి సమీకరిస్తారట. ప్రైవేట్‌ స్కూళ్ళలో పాఠాలు చెబుతారట. కానీ ప్రభుత్వ పాఠశాలకు మాత్రం వారానికొక రోజు కూడా పోరట. వీళ్ళంతా ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఈ కె.జి. నుంచి పి.జి. వరకు ఇంగ్లీష్‌ విద్య నిర్ణయాన్ని తిరగదోడించాలనేది వారి పట్టుదల.
కనీసం కమ్యూనిస్టు పార్టీలు, విప్లవగ్రూపులు తమ ప్రభావంతో నడిపే విద్యార్థి సంఘాల ద్వారాగానీ, టీచర్ల సంఘాల ద్వారాగానీ టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీని అమలుచేయించడం గురించి చర్చ జరుగుతుందా అంటే అది కనిపించడం లేదు. ఇక మిగిలింది దళిత బహుజన సంఘాలు. ఈ సంఘాలు కూడా విద్యా విధానం మార్పుపై మాట్లాడే ప్రక్రియను సీరియస్‌గా తీసుకోలేదు. కులసంఘాల్లోనూ సంఘనాయకులు తమ పిల్లల్ని ఏదో ఒకటిచేసి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో చదివించుకుంటారు. కానీ సర్వజన సమానత్వం, సమానపోటీస్థాయి కల్పించే విద్యా రంగం వరకు వచ్చేసరికి వాళ్ళకూ అంతగా పట్టింపు ఉండదు. అంటే తమ పిల్లల విద్య మాత్రమే తమ స్థాయిని కాపాడుతుందని ప్రతి నాయకుడు/నాయకురాలు ఆలోచిస్తారు. దాదాపు అన్ని కులాల్లో (అసలే చదువుకోని కులాలు తప్పితే) విద్యావర్గ లక్షణం ఒకటి వచ్చి కూర్చుంది. ఈ వర్గ వ్యత్యాసాన్ని మార్చగలిగేది కూడా ‘యూనిఫామ్‌ విద్యా విధానం’ మాత్రమే. ఈ అన్ని కారణాల వల్ల ‘సర్వ సమాన ఇంగ్లీషు విద్య’ అందరి పిల్లలకు రాకుండా చూసే కుట్ర వివిధ స్థాయిల్లో ఉంది. నమ్మాలో వద్దో కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ‘నేను యూనిఫామ్‌ ఇంగ్లీషు విద్య ప్రేమికుణ్ణి’ అని ప్రకటించుకున్నారు. అయితే ఆయన కుమారుడికీ, కుమార్తెకీ ఇటువంటి ప్రేమ ఉన్నదో లేదో చెబుత లేదు. అమలయ్యే నిర్ణయాలన్నీ కుటుం బం ఐక్యంగా తీసుకుంటుందని వదంతులున్నాయి. కనీసం ఈ ఒక్క నిర్ణయం - అంటే కె.జి. టు పి.జి. ఇంగ్లీషు మీడియం నిర్ణయం సమష్టిగా తీసుకొని అమలుచేస్తే తెలంగాణ రాష్ట్రానికో మేలు జరుగుతుంది.
ఐతే హైదరాబాద్‌, రంగారెడ్డి, వరంగల్‌, కరీంగనర్‌ నగరాల్లో, జిల్లాల్లో వివిధ చోట్ల తిష్ట వేసిన విద్యా వ్యాపారస్తుల ఒత్తిడి తక్కువ ఉంటుందని అనుకోలేం. బస్లుల్లో, ఆటోల్లో పిల్లలు సుదీర్ఘ దూరాలకు పోతూ సచ్చినా మంచిదేనని అన్ని గ్రామాల్లో ఇంగ్లీషు మీడియం విద్య ప్రైవేట్‌రంగం నుంచి ప్రభుత్వ రంగానికి మారడాన్ని వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇంగ్లీష్‌ మీడియం కాలేజీలు ఎత్తేసి అన్ని ఉన్నత పాఠశాలలను 12వ తరగతిలోకి మార్చడాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు.
వీళ్ళంతా పార్టీలకు చందాలిస్తారు. మంత్రుల, ఎమ్మెల్యేల అవసరాలు తీరుస్తారు. వీరి డబ్బులముందు తెలంగాణ ప్రజల త్యాగాలు పెద్ద లెక్కలోనివి కావు. తెలంగాణ బీద ప్రజలకు త్యాగాలు చెయ్యడం తెలుసు గానీ, తమపిల్లల్ని బాగుచెయ్యడం తెలువదు కదా! రైలుపట్టాల మీద చనిపోయిన పసికందుల రక్తం ఈ రాష్ట్రంలో అందరికీ ఇంగ్లీషు విద్య కోసం చిందింది. అది వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో దొరికితే కనీసం వాళ్ళ చావు ఒక సమస్యను పరిష్కరిస్తుంది.
- కంచ ఐలయ్య, సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi dated 31 July 2014

Saturday, 19 July 2014


Editorial Namasthe Telangana Logo

పోలవరంపై ఐక్య పోరాటం
Updated : 7/20/2014 1:37:57 AM
Views : 13
ది ఒడిశా మల్కానిగిరి జిల్లా పోడియ బ్లాక్ ఆదివాసీ కోయలు నివసించే ప్రాంతం. దట్టమైన అడువుల కాలిబాటలు కలెవాల్ కలెవాల్ కోయతూర్ కలెవాల్ ఆంప్‌వాల్ ఆంప్‌వాల్ పోలవరం ఆంప్‌వాల్‌అని కోయాతూర్ సమాజంలో అస్తిత్వ నినాదాలు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని ఆదివాసీ సంఘాలు ఒడిశా నుంచి కుంట (ఛత్తీస్‌గఢ్ మీదుగా భద్రాచలం వరకు తలపెట్టిన 15 రోజుల మహాపాదయాత్రలో ఒక కోయ విద్యార్థిగా, రచయితగా నేను భాగస్వామిని అయినాను. నాతోపాటు ఉస్మానియా, కాకతీయ విద్యార్థి సంఘాలు ఈ పాదయాత్ర అనుభవం నుంచి అన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాము.

పోలవరం ముంపు ప్రాంతాలు ఆంధ్ర, తెలంగాణలో ఉంటే పాదయాత్ర ఒరిస్సా నుంచి ఎందుకు మొదలయింది అన్నప్పుడు అనేక విషయాలు బయటకొస్తాయి. కోయ సమాజాన్ని గోదావరి పరివాహక ప్రాతం ఇరువైపుల శ్రీరాంసాగర్ (మహదేవ్‌పూర్ నుంచి) ఏటూరు నాగారం, భద్రాచలం మీదుగా పశ్చిమగోదావరి పోలవరం వరకు చూడవచ్చు. ఈ ప్రాజెక్టు వల్ల జలసమాధి అయ్యేది మూడు లక్షల మంది కోయ కొండరెడ్లు. ఇది గోదావరి నదికి సంబంధించిన ముంపు. కానీ ఈ ప్రాజెక్టు వల్ల, గోదావరి నీరు కమ్ముకోవటం మూలంగా, వి.ఆర్.పురం దగ్గర విలీనమయ్యే శబరి, సీలేరు నదులు గోదావరికి తాకి వెనుకకు నీరు మళ్లటం మూలంగా మళ్లీ ఈ రెండు నదుల పరివాహక ప్రాంతంలో జలసమాధి అయ్యేది కోయ సమాజమే.

ఒడిశా ప్రభుత్వం 17 ముంపు గ్రామాలని ప్రకటించింది. కాని ఈ రెండు నదుల ఇరువైపుల సర్వే నిర్వహిస్తే 139 గ్రామాలు లక్ష జనాభా, లక్షల ఎకరాల అటవీ భూమి, వేలాది ఎకరాల పంట భూములు మునిగిపోతాయి. అయినా ఇక్కడివారికి ముంపు సంగతి తెలియదు. ప్రభుత్వం చెప్పడం లేదు. నది దాటితే కుంట (ఛత్తీస్‌గఢ్) కోయ ప్రాంతం. ఇది తెలుగు గిరిజనేతరుల వలస ప్రాంతం. ఇక్కడ 14 గ్రామాలు మునుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ 50 గ్రామాల వరకు మునుగుతాయి.

కానీ మొన్నటిదాక ఈ ప్రాజెక్టును వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక మౌనం వహిస్తున్నది. ఆంధ్రలోని తూర్పు, పశ్చిమ గోదావరి కోయ కొండ రెడ్డిలది మరీ దారుణ సమస్య. ప్రభుత్వంతో పాటు అన్ని వర్గాలు పోలవరం నిర్మించాలంటున్నాయి.

ఈ రాష్ర్టాల్లోని కోయ సమాజం నేడు ఒక ప్రశ్నను సంధిస్తున్నది. పూర్వం మధ్య భారతాన్ని పాలించింది గోండులు (కోయాతూర్)లు.1956లో భాషాప్రయుక్త రాష్ర్టాలు ఏర్పాటు చేసినప్పుడు- మా ప్రాంతాన్ని పరిపాలించిన చరిత్ర, భూభాగం, ప్రత్యేక భాష, సంస్కృతీ సంప్రదాయాలు కలిగివున్నాం, మాకు ప్రత్యేక రాష్ర్టం కావాలంటే బలవంతంగా విడదీసి ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణలుగా విభజించారు. ఒరియా, హిందీ, తెలుగు పరాయి భాషలు రాక, మాతృ భాషలకు విలువ లేక దుర్భర స్థితిలో ఉన్నాం. ఏ రాష్ట్రం అభివృద్ధి మా దరి చేరలేదు.

అడవితల్లిని నమ్ముకొని ఎవరితో సంబంధం లేకుండా జీవిస్తున్నాం. మళ్లీ ఇప్పుడు పోలవరం పేరిట మా మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం అనంతరం ప్రత్యేక భారతం కావాలన్న ఆదివాసీలకు ప్రత్యామ్నాయ స్వయం ప్రతిపత్తి అని రాజ్యాంగంలో 5వ షెడ్యూలు మీరే చేశారు. పెసా అటవీ హక్కుల చట్టాలను చేశారు. 1/70 చట్టాన్ని మీరే చేశారు.

వాటన్నింటిని మీరే ఉల్లంఘించారు. ప్రజాస్వామ్యంలో ప్రతివ్యక్తి జీవించే హక్కును కలిగి వున్నాడు. అందుకే ఏదైనా పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరిగేటపుడు ఆయా ప్రాంతాల వ్యక్తులు ఆ ప్రాంతంలో జీవించే హక్కును కోల్పేయే అవకాశం ఉన్నందున, ప్రజాభిప్రాయసేకరణ జరపాలి అని రాజ్యాంగం చెబుతున్నది. కాని ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు జరపలేదు? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జీవనాన్నే కొల్లగొడుతున్నపుడు కోయల దారి ఎటువైపు మళ్ళుతుంది అనేది కూడా అర్థం కాని ప్రశ్న.
పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపటం కలుపకపోవటం పక్కనపెడితే ఈ రెండు ప్రాంతాలతో మేము ఎటువైపు అనేది అర్థం కాక కోయ సమాజం మానసిక క్షోభను అనుభవిస్తున్నది.

విద్యార్థులకు కుల ఆదాయ నివాస ధ్రువీకరణ పత్రాల అవసరం. తహశీల్దారు ఆఫీసుకెళితే ఏ రాష్ట్రం ధ్రువీకరణ పత్రం ఇస్తాడో తెలియదు. ఏ యూనివర్సిటీలో, కళాశాలలో దరఖాస్తు చేయాలో తెలియదు. ఫీజు రియింబర్స్‌మెంటు ఎవరిస్తారు? ఉద్యోగాల కోసం ఏ రాష్ట్రంలో దరఖాస్తు చేయాలి, ఉద్యోగస్తులకు ఏ ప్రభు త్వం జీతాలిస్తుంది? బలికోరాం రండి మా రాష్ర్టానికి అని ఆంధ్రప్రాంతం పిలిచినట్టా, బలిచ్చినా ఎరుగనట్టి తెలంగాణ ప్రాంతమా అన్నట్టుగ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బలమైన పోరాటం చేయకుండా డిజైన్ మార్చాలని ఏ రంధి లేకుండా పునర్నిర్మాణం చేసుకుంటుంది.


ఇటువంటి సమయంలో కోయ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలన్నపుడు, పోలవరం ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నపుడు కొన్ని రకాల పరిష్కారాల మార్గాలను వెతుకాల్సిన అవసరం ఏర్పడింది. భారతదేశాన్నే పునర్నిర్మాణం చేసే అంత మేధోసంపత్తి తెలంగాణ మైదాన ప్రాంతంలో వున్నది. అదే నేటి తెలంగాణ రాష్ర్టాన్ని నిలబెట్టగలిగింది. ఏ రాజకీయ ఉద్యమం దీనికి కారణం కాదు. తెలంగాణ కోసం 60 ఏళ్ళు శ్రమించిన ఈ మేధో సంపత్తి పోలవరం కోసం ఆదివాసీల పక్షాన ఉపయోగపడటం లేదు.

ఆదివాసీ పోరాటానికి పదును పెట్టే ప్రయత్నం చేయడం లేదు. చరిత్రలో ఆదివాసీ పోరాటాలయిన కొమురం భీం, బిర్సాముండా, సాయం గంగులు, మన్యం పోరాటాలన్నింటిని ఆదివాసీలే నడిపినా వాటి వెనుక మైదాన ప్రాంతాల మేధావుల హస్తం కొంతమేర అయి నా వుంటుంది. అది మళ్ళీ పోలవరం ఉద్యమంతో పునరావృతమవ్వాలి.

వందలాది పాఠశాలలు, కళాశాలలు ముంపునకు గురవుతున్నందున విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. ముంపు అనేది ఆదివాసీ ఉమ్మడి సంప్రదాయక జీవనవ్యవస్థతో ముడిపడి ఉన్నందున ఆదివాసీ సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. 7 గ్రామాలు 8 వేల జనాభా గల పోస్కో ఉద్యమం, పోస్కో ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకుంది. ఒడిశాలోని నియంగిరి కొండల్లోని నిరక్షరాస్య కోయలు విజయం సాధించారు.

కానీ మూడు లక్షల ఆదివాసీ జనాభా, ఉద్యమ చరిత్ర, విద్యా చైతన్యం గల మనం బలమైన ఉద్యమ నిర్మా ణం ఎందుకు చేయలేక పోతున్నాం అనేది ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆదివాసీ సంఘాల మధ్య, వ్యక్తుల మధ్య వైరుధ్యాలు మనుగడకే ముప్పు తెస్తున్నాయని గ్రహించాలె. ఆదివాసీ ప్రాంతాన్ని మొత్తం ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించుకుంటున్నాం.

మాకు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు మాకొద్దు, ఏ ప్రభుత్వాలు మాకు బువ్వపెట్టలేదు. మేము అప్పుడూ ఇప్పుడూ అడవినే నమ్ముకుని బతుకుతున్నాం. బతుకుతాం. మమ్మల్ని ముంచాలని చూస్తే ఊరుకునేది లేదు అని బలమైన సంకేతం ఇచ్చిన రోజు ప్రభుత్వాలే ఆదివాసీల దగ్గరకి వస్తాయనేది చరిత్రలో ఆదివాసీల సంప్రదాయ పోరాటాలు నిర్థారించిన విషయం అందరికి తెలిసిందే.

http://namasthetelangaana.com/EditPage/Essays.aspx?category=1&subCategory=7&ContentId=387599

Source  : Namaste TElangana DAted 20th July 2014
Home

అడవి చెంచుల్ని ఆదుకోవాలి - గంగాపురం లాలయ్య

Published at: Sunday  20-07-2014 01:17 AM Edit page
గిరిజన తెగలలో చెంచులు, ఎరుకలు, లంబాడీ కులాలవారు ప్రధానంగా ఉన్నారు. లంబాడీలు, ఎరుకల కులస్థులు గ్రామాలలో, మైదాన ప్రాంతాల్లో నివసిస్తుండడంతో చెంచులతో పోలిస్తే సాపేక్షంగా అభివృద్ధి చెందారు. లంబాడీలు, ఎరుకల కులస్థులను గిరిజన జాతుల్లో కలిపిన పిదప తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రల్లో వారు ప్రభుత్వం అందించే ప్రతీ సంక్షేమ పథకం ఫలితాలను అందుకొని చాలా వరకు అభివృద్ధి చెందారన్నది వాస్తవం. అయితే అడవుల మధ్య, కొండల నడుమ చెంచు గూడేల్లో, పెంటల్లో ఉన్న అడవి చెంచులు నాగరికతకు దూరంగా ఉన్నారు. వీరి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పథకాలను రూపొందించి, సమర్థులైన అధికారులను నియమించి క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం రూపొందించిన పథకాల ఫలితాలు వారికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని, నల్లమల అడవి తల్లి బిడ్డలు, గిరి పుత్రులు దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బతుకంత చీకటి. నిలువ నీడలు లేవు తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు చేయడానికి పని కల్పించినపుడే చెంచులు మనలో ఒకరుగా కలసి పోగలరన్న విషయం గుర్తుంచుకొని చర్యలు తీసుకోవాలి. ఆధునిక సమాజంలో అంతరించి పోతున్న చెంచుల జనాభాను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని, వారి జీవన స్థితిగతులపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి ఆ అడవి బిడ్డలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నల్లమల అడవి ప్రాంతంలో కొండల నడుమ నివసిస్తున్న చెంచులు కనీస మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యం అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్నారు. దక్షిణ భారతదేశంలో దట్టమైన అడవులుగా ప్రసిద్ధి పొందిన నల్లమల అడవులు క్షీణించడం వల్ల చెంచుల జీవనోపాధి సంక్షోభంలో పడి ంది. రెండు దశాబ్దాల క్రితం అడుగడుగున ఉన్న వృక్షాల్ని స్మగర్లు తరలించుకుని పోవడంతో అటవీ ఉత్పత్తులు లభించక, తిండి తిప్పలు నోచుకోక అల్లాడుతున్నామని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద గ్రామాలకు రహదారిలో ఉన్న చెంచు గూడేల్లో కొంత అభివృద్ధి జరిగింది. అయితే గ్రామాలకు దూరంగా నల్లమల అడవి మధ్యలో కొండల నడుమ నివసిస్తున్న చెంచుల అభివృద్ధికి జరిగిన కృషి అత్యల్పం. నిరక్షరాస్యత, ఆరోగ్యం పరిశుభ్రత గురించి తెలియని ఈ చెంచులు తరచూ రోగాల బారిన పడుతున్నారు. గిరిజన స్ర్తీలు, పిల్లల్లో ఎదుగుదల లేక రక్తహీనతతో బాధపడుతున్నారు. చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం దశాబ్దాలుగా వందలాది కోట్లు నిధులు మంజూరు చేసినా వాటిలో నామమాత్రంగానైనా చెంచుల అభివృద్ధికి చేరుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిథులు, దళారులు ఆ నిధుల్ని భుక్తం చేస్తున్నారు. గిరిజనుల అభివృద్ధి పేరుతో మంజూరయ్యే కోట్లాది రూపాయలను ఆయా అధికారులు వెనకేసుకుంటున్నారు. అడవి తల్లిని నమ్ముకుని బతుకుతున్న వారిని ఏకంగా అటవీ ప్రాంతాల నుంచి తరలించడంలో ప్రభుత్వం విఫలమైంది. అయితే అటవీ ఉత్పత్తులు తగ్గిపోవడంతో బతుకుదెరువు కోసం వలస బాటనే ఎంచుకుంటున్నారు. 1983లో పులుల అభయారణ్యంగా ప్రకటించారు. అయితే ఆ అభయారణ్యం నుంచి పులులు బయటికి వచ్చి గ్రామాలపై దాడి చేసి పశువులను కబళించడమే కాక, మనుషులపై కూడా దాడికి తెగబడుతున్నాయి. పులివాత పడి చనిపోయినవారికి ప్రభుత్వం నామమాత్రంగా చెల్లించడంతో ఎంతో మంది చికిత్స పొందుతూనే చనిపోయారు. వేల రూపాయలు విలువ చేసే పశువులు పులి దాడిలో చనిపోయిన సందర్భాల్లో ప్రభుత్వం నామమాత్ర నష్టపరిహారం ఇస్తోంది. దాంతో ఎంతో మంది ఆదివాసులు, అడవి అంచు గ్రామాల్లోని రైతులు వ్యవసాయం మానుకొన్న ఘటనలు అనేకం. చెంచులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం హర్షణీయం. గిరిజన జాతుల్లో లంబాడీ, ఎరుకలి కులాలవారు చాలావరకు సాంఘికంగా, ఆర్థికంగా ప్రభుత్వ పథకాల ద్వారా ఎదిగారు. ఈ నేపథ్యంలో చెంచుల సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించింది.
ఆర్భాటంగా, అట్టహాసంగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన అమాయక చెంచులకు అందేలా ప్రభుత్వం డెలివరీ మెకానిజంను రూపొందించాలి. కొత్త ప్రభుత్వంపై అడవి చెంచులు కోటి ఆశలు పెట్టుకొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రలలో చెంచుల పిల్లలను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జిల్లాకు 89 కేంద్రాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లమల అడవుల్లోని పెంటలు, గ్రామాలు, మైదాన ప్రాంతాలలో నివాసం ఉంటున్న చెంచులు ఉపాధి పనులకు వెళ్ళటం, గ్రామాల్లో కూలీలకు వెళ్ళేటపుడు వారి పిల్లల్ని చూసుకునే వారు లేరు. దీంతో వారిని సంరక్షించేందుకు ప్రభుత్వం గత నెల 15న, జీవో 17 విడుదల చేసింది. పుట్టిన ఆరు నెలల పాప నుంచి ఆరేళ్ళ పిల్లల వరకు కేంద్రాలలో సంరక్షించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను అనుసంధానం చేస్తూ, సంరక్షణ కోసం ఒక మహిళని నియమించనున్నారు. మహిళకు నెలకు వేతనాన్ని చెల్లించి నియమించనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి కొందరు అప్పుడప్పుడు చెంచు గూడేలకు వెళ్తున్నప్పటికీ గిరిజనులకు మాత్రం ఆశించిన స్థాయిలో నాగరికత అబ్బలేదు. ఈ చెంచులకు శాశ్వతగృహాలను నిర్మించడం జరుగుతున్నా సుదూరంగా ఉండే వారికి ఈ సదుపాయం కల్పించడానికి ఇంతవరకు అధికారులు కృషి చేయలేదు. అందువల్ల వారి జీవితాల్లో ఎలాంటి మార్పుకు అవకాశం లేకుండా పోయింది. ఉపాధి కల్పన పథకాలలో వీరికి తగిన ప్రోత్సాహం కనిపించడంలేదు. వ్యవసాయ బావులు తవ్వించడం, వ్యవసాయానికి ఎడ్లబండ్లను ఇవ్వడంలోను అడవి చెంచులకు అన్యాయం జరుగుతోంది. అధికారుల దృష్టి అంతా గ్రామాల్లోనూ, అందులోను రహదార్లకు దగ్గర ఉండే వారిపైనే ఉందనడంలో సందేహం లేదు. క్రూర మృగాల సంరక్షణ ప్రాంతాల్లో చెంచు గిరిజన గూడేలు అనాదిగా ఉన్నాయి. అంటే క్రూర మృగాల సంఖ్య పెరగడం వల్ల వారందరిని తరలించి పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందించింది. అటవీ ప్రాంతాల్లోని పెద్ద గ్రామాల పరిధిలో గిరిజనులకు గృహాలని నిర్మించాలని ప్రభుత్వ సంకల్పించినా, వారు మాత్రం పెద్ద గ్రామాలలో నివసించడానికి ఇష్టపడటంలేదు. అడవిలో చెంచులు మంచినీటి కోసం గూడెం నుంచి కనీసం మూడు కిలోమీటర్లు దూరం నడచి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రభుత్వం వారి మంచినీటి అవసరాలను తీర్చేందుకు ఎలాంటి సదుపాయాలు కల్పించక పోవడం దురదృష్టకరం. గిరిజనుల అభివృద్ధికి కోసం కేటాయిస్తున్న నిధులు ఖర్చు చేయకపోవడంతో తరచూ మురిగిపోతున్నాయి. గ్రామాలకు దగ్గరగా ఉన ్న చెంచులలో కొంత నాగరికత కనిపించినా, సుదూరంగా అడవుల్లో నివసించే వారు బాగా వెనకబడి ఉన్నారు. ఆదివాసుల కోసం రూపొందించే ఏ పథకమైనా వారికి అందుబాటులోకి వచ్చే విధంగా రూపొందించాలి. గిరిజనులకు పునారావాసాలను కేవలం అడవులకు పరిమితం చేయకుండా అవసరమైతే సాధారణ జనావాసాలకు చేరువగా నిర్మించి వారి అభ్యున్నతికి రెండు తెలుగు రాషా్ట్రలు కృషిచేయాలి.
గంగాపురం లాలయ్య
విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు
http://www.andhrajyothy.com/node/114995

Tuesday, 15 July 2014

NEW TRIBES of Andhra pradesh

Return to frontpage



Kayitha Lambadas celebrate new status

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/kayitha-lambadas-celebrate-new-status/article6121756.ece
PRINT   ·   T  T  

People of the rare tribal group found in two districts included in STs

ELATED:A rare tribal community, Kayitha Lambadas, at a tribal hamlet in Nizamabad district.– Photo: K.V. Ramana
ELATED:A rare tribal community, Kayitha Lambadas, at a tribal hamlet in Nizamabad district.– Photo: K.V. Ramana
People of the rare tribal group, Kayitha Lambadas also known as Mathura Lambadas, numbering a few thousand and scattered in Gandhari, Lingampet, Bichkunda and Jukkal mandals in the district, are happy over the government’s decision to include them in the Schedule Tribe category.
The promise made by the government it is believed will benefit them in the future as they being under BC “D” category all these years they had lost all opportunities in education and employment. As they were not in the ST category like the Lambadas or Banjaras, there was no improvement in their literacy level or employment among them.
Low literacy level
The literacy percentage among them is just 10 to 15 per cent, which is far below the literacy level of Lambadas, while the government employment is almost dismal.
Though their literacy level is poor they are financially sound, which is why they were converted into BC category in the early 80s. Since then, they have been demanding that they be given the previous status of STs. Rajiv Gandhi and Y.S. Rajasekhara Reddy had assured them of restoring their old social status, but to no avail.
Confined to Nizamabad and Adilabad districts they live around hills for greener pastures as they are predominantly cattle grazers.
They are basically vegetarians and shun liquor and celebrate festivals relating to Lord Krishna in a grand way as they feel as they are his descendants.
They were denied admission to tribal residential schools as they were not considered to be tribals. However, on the request of local people, about 70 Kayitha Lambada children were admitted to the tribal welfare hostel at Shivanur in Jukkal mandal, according to Chandrashekar, an employee in the department.
Lack of data
Interestingly, there is no demographic data of this community either with tribal welfare or BC welfare department. Among 1.89 lakh tribal population in the district as per the 2011 census the Kayitha Lambadas are hardly 4,000 in number. They are in a couple of thousands only in Gandhari mandal, says P. Jagadeeswar Reddy, the DTWO.“We did not receive any application for any benefit from them. In my 16-year stint in the department I have not seen a single Kayitha Lambada person coming for assistance,” said V. Ramesh, office superintendent at district BC welfare office.
TDP leader Badya Nayak is of the view that the government’s decision would certainly improve their socio economic conditions.