Pages

Wednesday, 26 March 2014




NewsListandDetails
విధ్వంసకర బాక్సైట్‌ తవ్వకాన్ని వ్యతిరేకిద్దాం
''ప్రకృతి సిద్ధమైన వాతావరణాన్ని అడవులు, చెరు వులు, నదులు, వన్యమృగ జీవనాన్ని కాపాడటా నికి పెంపొందించటానికి అలాగే జీవ జంతుజా లంపట్ల కనికరం,ప్రేమ చూపాలని ప్రజలు జీవిం చటానికి వారికి కావలసిన వసతులు పొందటానికి రక్షణలు కల్పించాలని భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు తెలియచేస్తున్నవి. కానీ అభివృద్ధి ముసుగులో రాష్ట్రంలో జీవన విధ్వంసం జరుగుతోంది. ఒకపక్క ఆదివాసీ లను అడవికి దూరం చేయవద్దని బాక్సైట్‌ తవ్వొద్దని కేంద్ర సాధికారిత కమిటీ పర్యటనకు నిరసనగా ఏజెన్సీ బంద్‌కు పిలు పిస్తే కమిటీ మాత్రం హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే చేసి వెళ్లింది. ప్రజావాక్యం వీరికవసరం లేదా!
  విశాఖపట్నం జిల్లాలో 60.293 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్డ్‌ ఏరియా ప్రాంతంలో 6 లక్షల జనాభాగల ఆదివాసీలు 7 తెగలుగా 11 మండలాలలో నివసిస్తున్నారు. మొత్తం విశాఖ మన్యంలో (చింతపల్లి, జెర్రెల, గుర్తేడు, అనంతగిరి ప్రాంతంలో) జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా లెక్కల ప్రకారం 8 వేల హెక్టార్లలో 700 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బాక్సైట్‌ నిక్షేపాలు ఉన్నాయి.  ఈ నిక్షేపాలను తవ్వి జిందాల్‌, అన్‌రాక్‌, ఆల్‌ఖైమ కంపెనీలకు కట్టబెట్టాలని ప్రభుత్వం ఎ.పి.ఎన్‌.పి.డి.సి. ముసు గులో దొంగనాటకాలాడుతోంది. ఈ బాక్సైట్‌ తవ్వకాలు ప్రక్రియ ఇపుడు మొదలైంది కాదు. 1890లోనే బ్రిటిష్‌ పాలకులు మొద టిసారిగా ప్రయత్నం చేశారు. ఒకవైపు సర్వేలు ముమ్మరం చేసి మరోవైపు రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారు. కాని ఆదివాసీలు ప్రతిఘటించడంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు. 1970లో భారత ప్రభుత్వం రష్యాతో సర్వే చేయించింది. రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేసింది కాని, అప్పటి శ్రీకాకుళం పోరాట ఉధృతికి పాలకులు వెనక్కుతగ్గారు. తదనంతరం తెలుగుదేశం ప్రభు త్వం ప్రయత్నాలు జరిపితే 2005 సంవత్సరంలో కాంగ్రెస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి ఒప్పందమే కుదు ర్చుకుంది. దాని ఫలితమే వాకపల్లి, బల్లుగూడ అత్యాచారాలు.
   ఈ తవ్వకాల వల్ల జరిగే విధ్వంసంతో విశాఖ ఏజెన్సీలోని గూడెం కొత్తవీధి,చింతపల్లి, కొయ్యూరు,అరకు, అనంతగిరి మం డలాలు పూర్తిగా కనుమరుగవుతాయి. 274 గూడేలలో 45 వేల మంది అడవిపై ఆధారపడి జీవించే ఆదివాసీలు మనుగడ కోల్పో తారు, సంస్కృతి సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి. పోడు వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ వారి జీవనాధా రం కనుక పసుపు, అలసంద, సోళ్ళు, చిక్కుళ్లు వంటి పంటలు, చింతపండు, పనస, కుంకుడు, ఉసిరి, శికాయి, కొండచీపురు, అడ్డాకులు వంటి 29 రకాల అటవీ ఉత్పత్తులు అదృశ్యమవు తాయి. ఈ బాక్సైట్‌ శుద్ధి కర్మాగారాల వలన ఇంకా ఎక్కువగా ముప్పు ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతు న్నారు.శుద్ధివలన సల్ఫర్‌డై ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ విషవాయువులు వెలువడు తాయి. బాక్జైట్‌ నుండి అల్యుమినియం తీశాక మిగిలిన ఎర్రమట్టి (బాక్సైట్‌ రిసెడ్యుస్లరి) దుమ్ము మరింత ప్రమాదకరం, అది సమీప చెట్లపై పడి చెట్టు నాశనం అయి అడవి అంతరిస్తుంది. దానినుండి వచ్చే ఎర్ర బురద కలుషిత నీరు నేలలో కలిసి జీవ రాశి, పంటపొలాలు నాశనం అవుతాయి. ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయి. పండే పంటల్లో అల్యుమినియం ఫ్లోరైడ్‌ శాతం పెరిగిపోతుంది. విశాఖ జిల్లాలో పండే 30 రకాల పంటలకు సుమారు 15 వేల మందికి ఆధారంగా చూపుతున్న కాఫీ తోట లకు 30 వేల మందికి ఆధారంగా ఉన్న పిప్పళ్ల పంటలకు కాలం చెల్లినట్లే అని చెప్పవచ్చు.
  అంతేగాక తూర్పు కనుమల నుంచి ప్రవహించే నదులు వాటిపై నిర్మించిన ప్రాజెక్టులు నిర్వీర్యమైపోతాయి అని అధ్య యనాలు వెల్లడిస్తున్నాయి. అడవులలో తవ్వకాలు చేపడితే నదు లకు ఎలా ముప్పు ఏర్పడుతుందనే సందిగ్ధం రావచ్చు! ఈ బాక్సైట్‌లోని స్పాంజ్‌ గుణమే (శ్రీకాకుళం) జిల్లాలోని వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా, విశాఖపట్నం జిల్లాలోని శారద, వరహా తాండవ, మచ్‌ఖండ్‌, గోస్తని (విజయనగరం), గౌతమి, నాగావళి, చంపావతి, వేదవతి, గోముఖి, సువర్ణ ముఖి, తూర్పు గోదావరి జిల్లాలోని తాండవ, పంప, ఏలేరు నదులను, వీటిపై కట్టిన ఏలేరు, తాండవ, పంపా, రైవాడ, సూరపాలెం, కళ్యాణలోవ,మేఘాద్రి, గంభీరం, కోనాం, రావిపా లెం, తాబేరు, రంగబోలు, డెంకాడు, ఆంధ్ర, తాటిపూడి, వేగాతి, సీతానగరం, పెద అంకలం ఆనకట్టలను రిజర్వాయర్‌ బతికిస్తుంది. బాక్సైట్‌ భూమిలో ఉన్నంతకాలం దాని ప్రభావం నీరు,పర్యావరణంపై పడదు. వెలికితీయడం మొదలైతే బాక్సైట్‌ లోని రసాయనాలు భూమి, నీరు, అడవిని కలుషితం చేస్తాయి. రసాయనాల ఫలితంగా నీరు భూమిలో ఇంకిపోకుండా ఆవిరిగా మారుతుంది. భూగర్భ జలాలు క్షీణిస్తాయి. తవ్వకాలు జరిగిన ఒడిశాలోని దామన్‌జోడిలో ఇలాంటి పరిస్థితి ఉందని పరిశోద µకులు అంటున్నారు. ఢిల్లీకి చెందిన ది ఎనర్జిస్‌ రిసోర్స్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మైనింగ్‌ ఫలితాలపై అధ్యయనం చేసి విశాఖ ఏజె న్సీలో ఒక్క అనంతగిరి ప్రాంతంలోనే 1500 కోట్ల విలువైన పర్యావరణ సంపద పోతుందని స్పష్టం చేసింది. పూనేకు చెం దిన కులవృక్ష పర్యావరణసంస్థ 2004లో సర్వే జరిపి ఏలేరు, తాండవ, శారద నదులకు కాలం చెల్లినట్లే అని పేర్కొంది.
   అదేవిధంగా ఈ తవ్వకాలతో వన్యప్రాణులు, వృక్ష, జంతు జీవరాశులు కూడా అంతరిస్తాయి అని చెప్పవచ్చు. తూర్పు కను మలలోని 1400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అడవుల్లో రకరకాల వన్యప్రాణులు, వృక్షసంపద ఉంది. పెద్ద పులులు, అడవి దున్నలు, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, రాస ఉడుత, కొండ ఎలుక, నెమళ్లు, అరుదైన గుడ్లగూబలు ఈ ప్రాం తంలో ఉన్నాయి. ఇక ఔషధ వృక్షాలకు కల్పతరు ఈ ప్రాంతం, ఇవేకాక 10వేల భారీ వృక్షాలు నేలకూలుతాయని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు.అంతేకాదు 90 రకాల వన్యప్రాణులు కనుమరుగవుతాయి. ఇప్పటికీ తూర్పు కనుమల్లో 11 రకాల పక్షులు, 54 రకాల తోకపిట్టలు, 10 రకాల వార్‌బర్డ్స్‌, 7 రకాల గుడ్లగూబలు మాయమవుతాయి. 30 ఏళ్ల క్రితం 160 రకాల పక్షులు 54 రకాల వలసజీవులు ఉండేవని, ప్రస్తుతం 100 దేశీయ రకాలు మాత్రమే ఉన్నాయని 'నేచర్‌ హిస్టరీ సొసైటీ ప్రకటించింది. తవ్వకాల మూలంగా అడవి దున్నలు, అడవి ఆవులు,కణుజులు,చుక్కల దుప్పులు, కొండ గొర్రెలు, మాను పిల్లులు, పులులు కనుమరుగు అవుతాయని స్వయాన విశాఖ రీజియన్‌ అటవీశాఖ స్పష్టం చేసింది.ఇప్పటికే అటవీ ప్రాంతంలో తేమ తగ్గి మానుపిల్లులు, డెక్కల పిల్లులు, అడవికోళ్ళు, నెమలి కోళ్లు, కొండ గొర్రెలు, కత్తెర పిల్లులు మాయమైపోయాయి.
  ఇంత పెనుముప్పు సంభవిస్తున్నా పాలకులు ఈ తవ్వకాలు ఎందుకు చేపట్టవలసి వస్తుంది అనేది చూస్తే, ఈ బాక్సైట్‌తో రిఫైనరీ ప్లాంట్‌లో శుద్ధిచేస్తే అల్యూమినియం అనే ముడిపదార్ధం పౌడర్‌ రూపంలో వస్తుంది. అది స్మెల్టర్లలో కడ్డీలుగా, రేకులుగా ఉండే లోహంగా తయారవుతుంది. ఈ లోహాన్ని అల్యూమిని యం అంటారు. ఈ అల్యూమినియం విమాన తయారీకి ఉప యోగిస్తారు. అయిన మనదేశ అవసరాలకు సరిపడే అల్యూమిని యం,నాల్కో, బల్క్‌, హిందాల్కో కంపెనీలు తయారుచేస్తు న్నవి. ఇప్పుడు కొత్తగా తీయాల్సిన అవసరం, అగత్యం ఏమీ లేదు, తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి ఉపయోగపడే వనరులను ఏ దేశంలో ఉన్నా మారుమూల ప్రాంతంలో ఉన్నా తన్నుకుపోవాలనే సంకల్పం సామ్రాజ్యవాద దేశాలది. ఇటువంటి సామ్రాజ్యవాదులకు మన పాలకులు మన ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవలసిన విష యం. ఇక్కడ బాక్సైట్‌ తవ్వటానికి ఆదివాసీలకు ప్రభుత్వం పున రావాసం,ఉద్యోగకల్పన భ్రమలు కల్పిస్తోంది.బాక్సైట్‌ భూములు కోల్పోయిన ఆదివాసీలకు భూములు ఇప్పిస్తామని బొంకుతోంది. పెద్ద మొత్తంలో నిర్వాసితులు అయ్యే ఆదివాసీలకు ప్రభుత్వం భూమి ఎక్కడి నుండి ఇస్తుంది? ప్రధానంగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ ప్రభావిత ప్రాంతంలో అమ్మాయిలను ప్యాషన్‌ డిజైన్‌ పేరుతో పట్టణ ప్రాంతాలకు పంపుతున్నారు. వారిలో కొంత మంది ఏమయిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి. గ్రామాల లోని యువకులను మావోయిస్టు ముద్రవేసి వందలాది మందిని జైళ్లకు పంపుతున్నారు.  
  ఈ తవ్వకాలు పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్ప వచ్చు. 1996 పంచాయితీరాజ్‌ (షెడ్యూల్డు ప్రాంతాల విస్తరణ) చట్టం ప్రకారం గ్రామసభల అనుమతులు పొందిన తరువాత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కాని తుపాకి నీడన భయానక వాతావరణంలో జరుగుతున్నవి. 1997లో సుప్రీంకోర్టు సమత వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో ఇచ్చిన చారిత్రకమైన తీర్పును పరిశీలిస్తే షెడ్యూల్డు ఏరియాలో ప్రభుత్వాన్ని కూడా గిరిజనేతరునిగానే పరిగణించాలని పేర్కొంది. వాస్తవంగా ఈ తవ్వకాలను జరిపే అధికారం ప్రభుత్వానికి లేదు. అయినప్పటికీ కోట్ల రూపాయల కోసం పాకులాడుతోంది. 1/70 చట్టం ప్రచా రంలోకి వచ్చిన షెడ్యూల్డు ప్రాంత భూ బదిలీ నియంత్రణ చట్టం 1959 సవరణను, అడవి హక్కుల చట్టం 2006 (పార్లమెంటు)ను ఉల్లంఘిస్తోంది. ఈ విధంగా ప్రాజెక్టుల, గనుల పేరుతో రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన దశాబ్దకాలంలో పాలకులు 87 రకాల ఆదివాసీ తెగలు అంతరించిపోవటానికి కారణమ య్యారు.ఇదేవిధంగా కొనసాగితే అడవులు అంతరించి మన్యంలో ఆదివాసీతెగలు కూడా పూర్తిగా అంతరించటం ఖాయం. ఈ తవ్వకాలవలన కేవలం ఆదివాసి సమాజానికి కాదు ఆదివాసేతర సమాజం పర్యావరణ,జంతు, జీవజాలం, నీటి వనరులకు కూడా ముప్పు ఏర్పడనున్నాయి. యావత్‌ ప్రజానీకం ప్రజల రక్షణకు ప్రజాస్వామ్య రక్షణకు ఆదివాసీల పోరాటం చేయ వలసిన అవసరం నేడు ముందున్న కర్తవ్యం.
Internet dept
Source: http://www.vaartha.com/NewsListandDetails.aspx?hid=1126&cid=1033

Related News

No comments:

Post a Comment