మన దేశపు విస్తీర్ణంలో ఇరవై శాతం ప్రాంతంలో గిరిజనులు నివసిస్తున్నారు. ఈ ఇరవై శాతం ప్రాంతంలోనే భారతదేశపు డెబ్బయ శాతం ప్రకృతి వనరులు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వనవాసీలు ద్వాపర యుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సేనలో ఉన్నట్టు ఆధారాలున్నాయి. భీముడి భార్య, ఘటోత్కచునికి తల్లి అయిన హిడింబి ఒక గిరిజన యువతే! ఇంకా చెప్పాలంటే కృత యుగంవాల్మీకి మహర్షి కూడా వనవాసీయే...! వ్యవసాయం రూపకల్పనకు మూలపురుషులు ఈ గిరిజనులే! కొండ కోనలలో, లోయలలో గిరిజనులు వ్యవసాయం చేస్తున్నారు. అనాదిగా సంస్కృతి, సంస్కారం కలిగిన ఈ గిరిజనుల ఉనికి నేడు ప్రశ్నార్ధకమైంది.
కోయ, చెంచు, యానాది, ఎరుకల , సహోలియా, సంతాల్, భిల్లు, గోండు, సవర, కొండ సబర, జాతాపు, కొండరెడ్డి, కోలాం, మొదలైన 33 తెగలు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే భారత రాజ్యాంగంలోని 342 అధికరణం కింద మొత్తం 533 తెగలు భారతదేశపు అన్ని రాష్ట్రాలలోను యూనియన్ టెరిటరీలలోను ఉన్నట్టు నమోదు కాబడి ఉంది. ఈ గిరిజనులు సహజంగా, నగర జీవనానికి దూరంగా, ఏకాంతంగా, కొండ కోనలలో లోయలలో, కీకారణ్యాలలో జీవనయానం సాగిస్తుంటారు. ఈ వనవాసీలు ప్రపంచం మొత్తం మీద సుమారు ఇరవై కోటు ల అనగా ఫ్రపంచ జనాభాలోనాలుగు శాతం మంది ఉన్నట్టు అంచనా! భారతదేశపు మొత్తం జనాభాలో 8.19 శాతానికి సమానమైన అనగా 8. .3 కోట్ల వనవాసీలున్నారు. 1951వ సంవత్సరంనుండి ఈ జనాభా క్రమక్రమం పెరుగుతూ వచ్చింది. భారతదేశపు మొత్తం జనాభాలో సెక్సురేషియో 927 ఉంటే గిరిజనులలో 972 ఉంది (అనగా 1000మంది పురుషులకు 972 మంది మహిళలు అన్నమాట)
శతాబ్దాల తరబడి ఆహారం, నిలువ నీడ, ఇంధనాల కోసం అరణ్యాలతో అనుబంధం కలిగి అరణ్యాలలో జీవిస్తున్నారు. ఈ ఆడవిపుత్రులు, భారతీయ జీవన వ్యవస్థల పెంపుదలకు పూల పురుషులు, కానీ ఈ వనవాసీలు క్రమపద్ధతిలో అణగదొక్కబడుతూ వచ్చారు. వీరి సంపదపై ఆధిపత్యాన్ని కోల్పోయారు. 1952వసంవత్సరం నాటి అటవీ విధానం వలన వనవాసీల హక్కులు పూర్తిగా నేలకు రాయబడ్డాయి. అందుకు కారణం వీరి నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు!
జన జీవనానికి దూరంగా బతకడం, అమాయకత్వం, పేదరికం, ఫలితంగా దోపిడీకి గురవుతున్నారు. 2001 సంవత్సరపు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సాక్షరత 64.84 శాతం ఉంటే వనవాసీలలో 47.10 శాతం ఉంది. అలాగే మహిళలలో 53.67 శాతం ఉంటే వనవాసీ మహిళలలో 34.76 శాతం ఉంది! అలాగే అనేక పథకాల ద్వారా గిరిజనులకు వైద్య, ఆరోగ్య సేవలు మెరుగుపడుతున్నాయి. అందువలన కొంత మేరకు వైద్య ఆరోగ్య సేవలు గిరిజనులకు మెరుగైనట్టే భావించాం. వనవాసీలు అధికంగా వ్యవసాయ కూలీలుగా లేదా పారిశ్రామిక కూలీలుగా జీవనయానం సాగిస్తున్నారు. సగానికి పైగా గ్రామీణ గిరిజనులు దారిద్య్ర రేఖకు దిగువనే జీవనం గడుపుతున్నారు. మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56నుంచి గిరిజనుల అభివృద్ధికి ప్రణాళికలను భారత ప్రభుత్వం రూపొందించం మొదలుపెట్టింది. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956-61నుంచి సామజిక, ఆర్థిక పరిస్థితుల అభివృద్ధికి అంకురార్పణ చేసింది. ఎంపిక కాబడిన గిరిజన ప్రాంతాలలో బహుళార్ధక సాధక గిరిజన పథకాలు ప్రవేశఫెట్టడం జరిగింది. 1961-66 మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ‘ట్రైబల్ డెవలప్‌మెంట్ బ్లాకు సిస్టం’ను అమలుచేయడం జరిగింది. నాల్గవ పంచవర్ష ప్రణాళిక 1969-74లో 498 ట్రైబల్ డెవలప్‌మెంట్ బ్లాకులు ఏర్పడ్డాయి. ఫలితంగా గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతున్నది.
ఇదే కాకుండా అనేక నూతన పథకాల రూపకల్పన జరిగింది. 5వ పంచవర్ష ప్రణాళిక 1974-79 కాలంలో గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచడం కోసం ట్రైబల్ సబ్ ప్లాన్ (టిఎస్‌సి)లకు నూతన వ్యూహంతో పునాదులేర్పడ్డాయి. 6వ పంచవర్ష ప్రణాళిక 1980-85 కాలంలో ఇంతకుముందు అభివృద్ధికి రాకుండా మరుగున పడిపోయిన గిరిజన ప్రాంతాలకోసం ‘మోడిఫైడ్ ఏరియా డెవలప్‌మెంట్ అప్రోచ్’ (యంఏడిఎ) అనెడి సమగ్రాభివృద్ధి పథకాన్ని టిఎస్‌సి కింద రూపొందించారు. 7వ పంచవర్ష ప్రణాళిక 1985-90 కాలంలో దారిద్య్ర రేఖకు దిగువన వున్న 40 లక్షల గిరిజన కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలనేది లక్ష్యమైంది. 1987-88 ఆర్ధిక సంవత్సరంలో 3 కోట్ల, 13 లక్షల 21వేల గిరిజనుల సంక్షేమం కోసం 184 సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు పనిచేయడం మొదలయ్యాయి. భారత రాజ్యాంగ నిర్మాతలకు గిరిజనుల సమస్యలపై మంచి అవగాహన ఉంది. అందుకనే వారి సంక్షేమం కోసం అభివృద్ధికోసం ప్రత్యేక అవకాశాలను రాజ్యాంగంలో పొందుపరిచాయి.
భారతరాజ్యాంగం 330, 332, 334 అధికరణాల కింద లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలలో గిరిజనులకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించబడింది. అలాగే 164 , 338 అధికరణల కింద రాష్ట్రాలలోను, జాతీయ కమిషన్‌లోను గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రభుత్వ శాఖలను ఏర్పరచడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. 224 అధికరణ, 5,6 షెడ్యూల్ కింద ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్‌లు ప రిపాలన, నియంత్రణలకు ప్రత్యేక అవకాశం, వాటికయ్యే ఖర్చును భరించడానికి 275)1) అధికరణ కింద రాజ్యాంగం అవకాశాన్ని కల్పించింది. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అత్యున్నత వ్యవస్థగా వ్యవహరిస్తోంది. ఇన్నిరకాలుగా ప్రభుత్వం చొరచూపి, గిరిజనులకు సంక్షేమం, అభివృద్ధికోసం చట్టాలు చేస్తున్నా, పథకాలకు రూపకల్పన చేస్తున్నా కూడా అమలులో చిత్తశుద్ధి లేకపోవడంవలన వాటి తీపి ఫలాలు గిరిజనులకు అందడంలేదంటే అతిశయోక్తి లేదు ఇప్పుడు గిరిజనేతరులు, వడ్డీవ్యాపారులు, మద్యం వ్యాపారు లకబంధ హస్తాలనుండి గిరిజనులకు విముక్తి లభించడం దుర్లభమవుతున్నది. అందుకుగాను ప్రభుత్వం చొరవ చూపి గిరిజనుల రుణాలను మొత్తం మాఫీ చేయాలి. గిరిజన ఉత్పత్తులకు లాభదాయకమైన మార్కెట్ సౌకర్యం కల్పించాలి. నిరక్షరాస్యత, మూఢనమ్మకాలను పారదోలాలి. వారికి రక్షితనీటి సౌకర్యం, పౌష్టికాహార సరఫరా, నీటి పారుదల సౌకర్యం, జల పరీవాహక పథకాల ఏర్పాటు జరగాలి. గిరిజనులవంటి నిష్కలంక మిత్రులు ప్రపంచంలో మరొకరుండరు. అట్టివారి సంక్షేమం అభివృద్ధికోసం ప్రభుత్వమే కాదు సభ్యసమాజం అంతా దీక్ష బూని పాటుపడాలి. చట్టాలు చేస్తే సరిపోదు, చిత్తశుద్ధితో అమలుపరచాలి.

No comments:
Post a Comment