Pages

Friday, 23 August 2013



Andhraprabha

డొక్కలెండుతున్న నల్లమల చెంచులు..

apr -   Sat, 6 Apr 2013, IST
  • కొండెక్కిన గిరిజన వైద్యం..
  • పట్టించుకోని ఐటిడిఏ అధికారులు..
  • మరణమృదంగంలో చెంచులు..
ఆత్మకూరు టౌన్‌, ఏప్రిల్‌ 5 (కెఎన్‌ఎన్‌) ఆహారపు దశ దాటని ఆదిమ గిరిజనుల డొక్కలెండుతున్నాయి. నల్లమల అడవులలో జీవనం సాగిస్తున్న చెంచుల స్థితిగతులు చూస్తే ఉన్న ప్రాణం ఊడినంత పనైంది. సంపన్నులే సరైన వైద్యం చేయించుకోలేక బాధపడుతున్న తరుణంలో చెంచుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటిడిఏ అందినంత దోచుకుంటూ డొక్కలెండిన చెంచుల ప్రాణాలను అరిస్తుంది. చెంచుల అభివృద్ది కోసం నాలుగు జిల్లాలలో విస్తరించిన ఐటిడిఏ నేడు అందినంత దోచుకుని ఆదిమ జాతికి చెందిన గిరిజనుల పాలిట శాపంగా మారింది. నల్లమల కొండలలో దాదాపు 14 చెంచు గూడేలు ఉన్నాయి. వాటి పరిస్థితి తలచుకుంటే అగమ్య గోచరం తప్ప ఆలోచనా శక్తి ఉండదు. కీకారణ్యంలో తిండికోసం కొట్టుమిట్టాడుతున్న చెంచుల సంగతి అంతా ఇంతా కాదు. ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిధిలో ముఖ్యంగా 42 చెంచు గూడేలు ఉన్నట్లు తెలుస్తొంది. కొత్తపల్లి మండలంలో ఉన్న ఎర్రమఠం, జానాల గూడెం, పాతమాడుగుల గూడెం, గుమ్మడాపురం, శివపురం గూడుం, ముసలిమడుగు గూడెం, పాలెంచెరువు గూడెం, ఎదురుపాడు గూడెం చెంచులు జీవిస్తున్న పరిస్థితి చూస్తే చలించినంత పనవుతుంది. అసలే చెంచులు ఆపై ఆరోగ్యస్థితి గతులు తెలియని వారు కావడంతో ఆనారోగ్య భారిన పడి తనువు చాలిస్తున్నారు. కొండా కోనలలో అటవీ ఫల సాయంపై, జంతువుల మాసం తింటూ జీవనం సాగిస్తున్న చెంచులకు మాయదారి రోగాలతో చెంచులు తల్లడిల్లిపోతున్నారు. నల్లమలలో జం తు జీవరాశులతో మమేకమైజీవనం సాగిస్తున్న చెంచుల పరిస్థితి దుర్భరంగా ఉంది. కనీసం తినేందుకు తిండి, తాగేందుక నీరు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. నాగరికతకు దూరంగా ఉంటూ తమ జీవితాలను సగంలోనే ముగించుకుంటున్న చెంచుల స్థితిగతులు చూడాల్సిన ఐటిడిఏ పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండగా పాలకులు కూడా వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. చెంచుల కోసం కేటాయించిన నిధులు కొల్లగొడుతూ వారిపైనై దౌర్జన్యం చేస్తూ కాలం గడుపుకుంటున్న కొందరి అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్‌ తీ వ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలిసింది. చెంచు గూడెంలలో అపరిశు భ్రత కారణంగా టిబి, మలేరియా, పైలేరియా వంటి రోగాలతో మంచాన పడుతున్నారు. కొందరైతే మద్య వయస్సులోనే తనువుచాలిస్తున్నారు. మరికొందరు గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన వైద్య ఆలయాలు మచ్చుకైనా కనబడకపోవడం గమనార్హం. ఆత్మకూరు మండల పరిధిలో ఉన్న చెంచు గూడేలలో చెంచులు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు. నాటువైద్యం తప్ప ఆంగ్ల వైద్యం తెలియని చెంచులు ఉన్నారంటే ఆశ్చర్య పోవాల్సిందే. పట్టించుకోవాల్సిన అధికారులు జీతాలు తీసుకుంటూ పబ్బం గడుపుతున్నారే తప్ప చెంచుల స్థితి గతులను చూసే నాధుడే కరువయ్యాడు. బరువెక్కిన హృదయంతో డొక్కలు ఎండిన దేహంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చెంచుల పట్ల ధైన్యం కాని, ధ్యానం కాని మానవత్వం కాని లేని మహామకుటులు ఎందరో ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులైనా, ఐటిడిఏ అధికారులైనా చెంచుల ఆనారోగ్యాలపై కాని, వారి జీవన స్థితి గతులపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు భావిస్తున్నారు. కీకారణ్యంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయంతో క్రూర మృగాల మద్యన జీవనం సాగిస్తున్న వారిపై కనికరం తప్పదని చెంచుల అభివృద్ది కోరూ మానవతాదృక్పదవాదులు ఆశించడం న్యాయమే.

No comments:

Post a Comment