Namaste Telanga 22nd August 2013
విద్యుదీకరణనకు వీడని గ్రహణం
- విద్యుత్ సౌకర్యానికి నోచుకోని నల్లమల చెంచుపెంటలు
- వెలుగునిచ్చేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్ విద్యుదీకరణ యోజన
- 112 పెంటలకు విద్యుత్ సౌకర్యం ఇవ్వాలని ప్రతిపాదన
- 2006లో రూ.కోటీ 50 లక్షలు మంజూరు
- భూగర్భ విద్యుత్ లైన్ కోసం అనుమతివ్వని అటవీశాఖ
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు
మహబూబ్‌నగర్, ఆగస్టు 21 (టీ మీడియా ప్రతినిధి) : మైదాన ప్రాంతంలో రాత్రిళ్లు రెండు గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రజలు తల్లిడిల్లిపోతారు. కరెంట్ ఎప్పుడు వస్తుందా అని కునుకు తీయకుండా ఎదురు చూస్తారు. కొద్దిసేపు అంధకారంలో ఉండేందుకు ఆందోళన చెందుతారు. గ్రామీణ ప్రాంతాల్లో బయటకు వెళ్లేందుకు జంకుతారు. వెలుతురు లేకపోవడంతో విషపురుగుల తాకిడి ఉంటుందనే భయంతో ప్రజలు బయటకు కాలు పెట్టేందుకు వెనుకంజ వేస్తారు. రెండు గంటలు విద్యుత్ లేకుంటే ఇక్కడి ప్రజల తీరు ఇలా ఉంటే అసలే విద్యుత్ సౌకర్యం లేకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరెంట్‌లేని జీవితాన్ని ఊహిస్తేనే ఒల్లుజలదరిస్తుంది. కాని ఏళ్ల తరబడి విద్యుత్ సౌకర్యానికి నోచుకోక చీకట్లోనే మగ్గుతున్నారు. పెంటల చుట్టూ అటవీప్రాంతం, చిమ్మ చీకట్లో చెంచులు బతుకీడుస్తున్నారు. చెంచులకు వెలుగునిచ్చేందుకు ప్రవేశపెట్టిన పథకాలు అమలుకు నోచుకోవడంలేదు. పథకాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు చొరవతీసుకోవడంలేదు. బొడ్డుగుడిసెల్లో కటిక చీకట్లో దుర్భరంగా జీవిస్తున్న చెంచులపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
చెంచుపెంటల్లో చీకటి రాజ్యమేలుతుండటంతో చెంచులు, గిరిజనులు పడుతున్న కష్టాలు వర్ణాణాతీతం. ఎటూ చూసినా దట్టమైన అటవీ ప్రాంతంలో విషకీటకాల మధ్య ఏళ్ల తరబడి దుర్భర జీవితాలను గడుపుతున్నారు. విద్యుత్ సౌకర్యంలేక రాత్రి సమయాల్లో బొడ్డు గుడిసెల్లో బుడ్డి దీపం వెలుతురులోనే కాలం వెల్లదీస్తున్నా రు. చెంచుల నివాస ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 2006లో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ విద్యుదీకరణ యోజన పేరుతో ఓ పథకాన్ని వెలుగులోకి తెచ్చింది. జిల్లాలోని కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో రాజీవ్ విద్యుదీకరణ యోజన కింద విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 112 చెంచుపెంటలను అధికారులు గుర్తించి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ చెంచుపెంటల్లో దాదాపు ఏడు వేలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ పథకం కింద నల్లమలలోని ఫర్హాబాద్ చౌరస్తా నుంచి అప్పాపూర్ వరకు భూగర్భ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు 2006లో ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేసింది. కాని నేటికీ ఈ చెంచుపెంటలు విద్యుత్ సౌకర్యానికి నోచుకోలేదు. శ్రీశైలం రహదారిపై ఉన్న మన్ననూర్ నుంచి వట్టువర్లపల్లి, సార్లపల్లికి మాత్రమే విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఇక్కడి నుంచి మిగతా చెంచుపెంటలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఉన్నా అటవీ శాఖ అనుమతి ఇవ్వడంలేదు. అటవీశాఖ అధికారులు విద్యుత్ లైన్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది.
దీంతో చెంచులు విద్యుత్ సౌకర్యానికి దూరమయ్యారు. అసలే అటవీప్రాంతం కావడంతో రాత్రి అయితే చాలు చెంచులు బొడ్డుగుడిసెలకే పరిమితమవుతున్నారు. బయటకు వస్తే చీకట్లో ఏ విష కీటకం కాటేస్తుందోననే భయాందోళనలో చెంచులు బతుకుతున్నారు. వట్టువర్లపల్లి నుంచి మల్లాపూర్ వరకు విద్యుత్‌లైన్ వేసి అక్కడి నుంచి పుల్లాయిపల్లి, రాంపూర్, ఆగర్లపెంట, భౌరాపూర్, ఈర్లపెంట తదితర చెంచుపెంటలకు విద్యుత్ సౌకర్యం కల్పించే అవకాశమున్నా అధికారులు ఆ వైపు చర్యలు తీసుకోవడంలేదు. వట్టువర్లపల్లి నుంచి ఈ చెంచుపెంటలు సుమారు 30 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. ఐటీడీఏ గుర్తించిన ఈ చెంచుపెంటలకు రాజీవ్ విద్యుదీకరణ యోజనలో విద్యుత్ సౌకర్యం కల్పించాలనే నిబంధన ఉంది.
అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు
రాజీవ్ విద్యుదీకరణ యోజన పథకం కింద చెంచు పెంటలకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా విద్యుత్‌లైన్ల ద్వారా విద్యుదాఘాతం అయితే అడవికి నిప్పంటుకునే ప్రమాదం ఉందనే నెపంతో అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. భూగర్భ విద్యుత్‌లైన్ కోసం అటవీ ప్రాంతంలో కేబుల్ వేసేందుకు కూడా అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కేబుల్ వేస్తే వేటగాళ్లు భూమిని తవ్వి విద్యుత్‌ను ఎక్కడబడితే అక్కడ వాడుకునేందుకు వీలుండటంతో అటవీ ప్రాంతానికి, వన్యప్రాణులకు ముప్పు జరుగుతుందని వారు అభ్యంతరం చెబుతున్నారు.
అప్పాపూర్ వరకు రోడ్డు సౌకర్యం ఉండటంతో రోడ్డు పక్కనే కేబుల్ వేస్తే వన్యప్రాణులకు ఎలాంటి ముప్పు ఉండదని తెలిసినా ఆ శాఖ అధికారులు అనుమతిని నిరాకరిస్తున్నారు. దీంతో చెంచుపెంటలకు విద్యుత్ సౌకర్యం కలగానే మిగులుతోంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఐదు నెలల కిత్రం నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించి చెంచుల సమస్యలు తెలుసుకున్నారు. చెంచు పెంటల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెంచులు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. చెంచు పెంటల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. స్పీకర్ ఇచ్చిన హామీలు మచ్చుకు కూడా అమలుకునోచుకోకపోవడంతో ఇక చెంచుపెంటలకు విద్యుత్ సౌకర్యం కలగానే మిగులుతోంది. చెంచుపెంటల్లో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపడంలేదు. ప్రజాప్రతినిధులకు ఐదేళ్లకు ఓసారి ఎన్నికల సమయంలో చెంచు పెంటలు గుర్తుకు వస్తాయి. ఓట్లు వేయించుకున్న అనంతరం చెంచు పెంటల్లో సౌకర్యాల గురించి మరిచిపోతున్నారు.

No comments:
Post a Comment